Wednesday, November 6, 2024

సౌందర్యలహరి

11. చతుర్భిః శ్రీ కంఠై: శివయువతిభిఃపంచభిరపి
ప్రభిన్నాభిశ్శంభోర్నవభిరపిమూలప్రకృతిభిః
చతుశ్చత్వారింశద్వసుదళకలాశ్రత్రివలయ
త్రిరేఖాభిస్సార్థం తవ చరణ కోణాఃపరిణతాః

తాత్పర్యం : అమ్మా!నలుగురుశివుల చేతను, శివుడి కన్న వేరైన ఐదుగురు శివశక్తుల చేతను, తొమ్మిది మూలప్రకృతుల చేతను అష్టదళ,షోడశదళ,త్రివలయ,త్రిరేఖల చేతను, నీకు నిలయమైన శ్రీచక్రమునలుబదినాలుగు అంచులు కలది అవుతోంది.
ళినాలుగు శివ సంబంధమైన చక్రాలు, ఐదు శక్తి సంబంధమైన చక్రాలతో అంటే మొత్తం తొమ్మిది చక్రాలతో అమ్మవారి నిలయం అలరారుతూ ఉంది అని అర్థం.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement