Saturday, November 30, 2024

సౌందర్యలహరి

29. స్వదేహోద్భూతాభిర్ఘృణిభిరణిమాద్యాభిరభితః
నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః
కిమాశ్చర్యంతస్య త్రినయన సమృద్ధిమ్తృణయతః
మహాసంవర్తాగ్నిర్విరచయతినీరాజనవిధిం.

తాత్పర్యం : చక్కగా సేవించదగిన శాశ్వతురాలా! నీ పాదాల నుండి వెలువడుతున్న కిరణాలతోనూ చుట్టూ ఆవరించి ఉన్న అణిమాదిసిద్ధులతోనూ ఉన్న నిన్ను “ నీవే నేను” అనే భావంతో నిత్యము ధ్యానం చేస్తూ తాదాత్మ్యభావన పొందే సాధకుడు సదాశివుడి అష్టైశ్వర్యాలని కూడా గడ్డిపోచ లాగా భావిస్తాడు. అటువంటి వాడికి మహా ప్రళయాగ్నినీరాజనమిస్తుంది అనటం లో ఆశ్చర్యం లేదు. (సహజం)

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement