Wednesday, November 27, 2024

సౌందర్యలహరి

29. కిరీటం వైరించంపరిహరపురఃకైటభభిదః
కఠోరేకోటీరేస్ఖలసిజహిజంభారీ మకుటం
ప్రణమ్రేష్వేతేషుప్రసభముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే

తాత్పర్యం: అమ్మా! బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులుసాష్టాంగప్రణామాలు చేస్తున్న సమయంలో నీ భర్త అయిన సదాశివుడు నీ మందిరానికి రాగా, ఆయనకు స్వాగతవచనాలతో ఎదురు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు నీ చెలులు– అమ్మా ! నీ ముందున్న బ్రహ్మ కిరీటాన్ని వదలి దూరంగా నడువుము,కైటభాసురుణ్ణి సంహరించిన విష్ణువు కఠినమైన కిరీటం అంచులు తగిలి జారి పడతావేమో జాగ్రత్త,జంభాసురుణ్ణి చంపిన ఇంద్రుడి కిరీటానికి దూరంగా జరుగు –అని పలికే పలుకులుసర్వోత్కృష్టముగా విరాజిల్లుతున్నవి.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement