Friday, November 29, 2024

సౌందర్యలహరి

27. జపోజల్పశ్శిల్పంసకలమపి ముద్రా విరచనా,
గతిఃప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతివిధిః
ప్రణామ స్సంవేశస్సుఖమఖిలమాత్మర్పణదృశా
సపర్యా పర్యాయ స్తవభవతుయన్మేవిలసితమ్!

తాత్పర్యం: జగన్మాతా! ఆత్మార్పణ బుద్ధితో నేను మాట్లాడే మామూలు మాటలు నీ నామజపంగాను, పనులు చేసేప్పుడు ఏర్పడే భంగిమలు అన్నీ నీ కొరకు పెట్టే ముద్రలుగాను, నా నడకలు అన్నీ నీకు చేసే ప్రదక్షిణలుగాను, తీసుకునే ఆహార పానీయాలు అన్నీ నీకు సమర్పించే హవిస్సులుగాను,నిద్రించునప్పుడు దేహంలో జరిగే మార్పులు నీకు చేసే సాష్టాంగప్రణామాలుగాను, సమస్తమైన సుఖకరమైన వస్తువులు, భోగాలు నీకు సమర్పించే ఉపచారాలుగానుఅగు గాక. (అంటే సమస్త చేష్టలు అమ్మ పూజయేఅగు గాక!)

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement