Thursday, December 12, 2024

సౌందర్యలహరి

25. త్రయాణాందేవానాం త్రిగుణ జనితానాం తవ శివే
భవేత్పూజా పూజా తవ చరణయోర్యావిరచితా
తథాహిత్వత్పాదోద్వహనమణిపీఠస్యనికటే
స్థితాహ్యేతేశశ్వన్ముకుళితకరోత్తంసమకుటాః !

తాత్పర్యం: అమ్మా! భవానీ! నీపాదాలకు చేసిన పూజయేసత్త్వరజస్తమో గుణాల నుండి ఉద్భవించిన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా చేసినట్టు అవుతుంది. ఈ మాట తగినదే సుమా! ఎందుకంటే, జోడించిన చేతులే కిరీటాలుగా ఉన్న ఆ త్రిమూర్తులు నిరంతరం నీపాదాలను పెట్టుకునే పాదపీఠి వద్ద చేరిఉంటారు కదా!

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement