Wednesday, November 27, 2024

సౌందర్యలహరి

21. భవాని త్వం దాసే మయివితరదృష్టింసకరుణాం
ఇతిస్తోతుంవాంఛన్కథయతి భవాని త్వమితియః
తదైవత్వంతస్మైదిశసినిజసాయుజ్యపదవీం
ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజనపదామ్.

తాత్పర్యం: భవుని రాణి వైన జగదంబా! “నీ దాసుడనైననాయందు నీ కరుణామయ దృష్టిని ప్రసరింపచేయుము” అని నిన్ను కీర్తించాలనే కోరిక గలవాడై‘భవాని త్వం’అని ఎవరైనా పలికితే అతడికి నీవు ఆ విధంగా పలకటం పూర్తి కాకమునుపే విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారి చక్కగా కనపడే కాంతివంతమైన కిరీటాల చేత హారతి ఇవ్వ బడుతున్న పాదాలు కల నీతో తాదాత్మ్యాన్ని ఇస్తావు.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement