Tuesday, April 23, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో మిథున‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 02, వ్యయం 11
రాజ్య పూజ్యం – 02, అవమానం-04

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటు-ంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుందుట మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 11వ స్థానమై శుభుడైనందున అన్నికార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలుండవు.శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటు-ంబంలో అభివృద్ధితో పాటు- ఆకస్మిక ధనలాభముంటు-ంది.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 9వ స్థానమై అశుభుడైనందున మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటు-ంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 11వ స్థానమై శుభుడైనందున నూతన వస్తు, వస్త్ర వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగ ముంటు-ంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన| పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 5వ స్థానమై సాధారణ శుభుడైనందున పట్టు-దలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగానుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 4వ స్థానమై అశుభుడైనందున కుటు-ంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచి కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది.

Advertisement

తాజా వార్తలు

Advertisement