Wednesday, April 24, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో క‌ర్కాట‌క‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 11, వ్యయం – 08
రాజ్య పూజ్యం – 05, అవమానం – 04

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 9వ స్థానమై శుభుడైనందున స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటు-ంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తి,ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 8వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటు-ంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు. కుటు-ంబ విషయాల్లో మార్పులు వుంటాయి.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 10వ స్థానమై సాధారణ శుభుడైనందున మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటు-ంబ పరిస్థితులు సంతృప్తికంరగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలెక్కువ చేస్తారు.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 4వ స్థానమై అశుభుడైనందున కుటు-ంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. జాగ్రత్తగా నుండుట మంచిది. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 3వ స్థానమై శుభుడైనందున నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. ఋణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటు-ంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement