Tuesday, September 19, 2023

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో క‌న్యా రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం – 02, వ్యయం – 11
రాజ్య పూజ్యం – 04, అవమానం – 07

గురువు 22.3.2023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 7వ స్థానమై శుభుడైనందున రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీసంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు. గౌరవమర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 8వ స్థానమై అశుభుడైనందు నమనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందుల నెదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టు- కార్యాలకు దూరంగా వుంటారు.

- Advertisement -
   

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 6వ స్థానమై శుభుడైనందున బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో, ఋణబాధలు తొలగిపోతాయి. కుటు-ంబ సౌఖ్యముంటు-ంది. శతృబాధలు దూరం. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటు-ంది.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 8వ స్థానమై అశుభుడైనందున మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్నకార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. 31.10.2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 7వ స్థానమై సాధారణ శుభుడైనందున ప్రయత్నం మేరకు స్వల్పలాభముంటు-ంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాయింటాయి. ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున కుటు–ంబపరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. ఆకస్మిక ధనలాభంతో
ఋణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొనుటకు కృషి చేస్తారు.స్తీలు,బంధు,మిత్రులను కలుస్తారు.31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యా రాశి 1వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడడటం మంచిది.ఆధ్యాత్మిక కార్య క్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగగమవుతుంది. కుటు-ంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు.సహనం అన్ని విధాలా శ్రేయస్కరం.డబ్బును పొదుపుగా వాడతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement