Thursday, April 25, 2024

శ్రీ దత్తశ్శరణం మమ!

‘దత్త’ ఈ రెండు అక్షరాలు తారకం. ఈ రెండు అక్షరాలు, ఒకటి కామధేనువు, మరొకటి కల్పవృక్షము. ఈ రెండు అక్షరాలు, అఖిల భువన భాండాలను నడుపు చక్రాలు. యోగుల పరమ గమ్యం. ”నా ప్రాణాలు. సకల ప్రాణులను తరింపచేయు మం త్రమేదైనా ఉన్నదా స్వామి” అని శుక మహర్షి, పరమేశ్వరుని అడిగినపుడు, కైలాసపతి చెప్పిన మంత్రం ‘దత్త’. కార్తవీర్యుని కనికరించి విధి రాతని కూడా తిరగరాయగల విధాత దివ్య మంత్రం ఇదే అని నిరూపించింది ‘దత్త’.విష్ణుదత్తుని దీవించి లోకహతంకోసం అవతరించినపుడు, నీకేసంతానమై వస్తాను అని వరప్రదానం చేసినది ‘దత్త’. ప్రహ్లాదునికి, వశిష్ఠులు యదువు, మత్సేంద్ర నాథు ఇలా ఎందరికో యోగసిద్ధిని అనుగ్రహంచినది ‘దత్త’.
పరశురాముల వారు సేవించినది, నారదుల వారిచే కీర్తింపబడినది, బ్రహ్మ కు వేదాలను బోధించినది ‘దత్త’. బ్రహ్మకు వేదాలను బోధించటమంటే, అది పర బ్రహ్మకే సాధ్యం. అందుకే అది ‘దత్త’ పరబ్రహ్మం. ఇలా ఎంతని చెబుతాము. పిపీలికాది బ్రహ్మపర్యంతం ఎవరికి సాధ్యం దత్తుని వర్ణించ టం? దత్త తత్వాన్ని బోధించటం?
మనకేమి తెలియకపోయినా, ఒక్కటి చేయగలిగితే చాలు. అదే దత్తుని పట్ల విశ్వాసంతో ఆయన నామాన్ని భజిం చటము, జపించటము చేస్తే చాలు. ఆయన దివ్య ప్రేమలో మనం తడిసిముద్ద అవుతాము. ఎక్కడ ‘దత్త దత్త దత్త’ అని స్మరించబడుతోందో, ఎక్కడ దత్త నామసంకీర్తన జరుగు తోందో, దత్త నామము భజింపబడుతోందో అటువంటి ఇల్లు సిద్ధుల ఆశ్రమం. అక్కడ సకల దేవీ దేవతలు కొలువై ఉంటా రు. ఎవరి హృదయం దత్త దత్త దత్త అని స్పందిస్తుందో, అట్టి హృదయమే మాతాపురం. ఎవరి మనసు ‘అనసూయ’ ఎవరి బుద్ధి ‘అత్రి’ అవుతుందో, వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు.
దత్తుడు పరమపిత, దత్తుడు లోకకర్త, దత్తుడు జగద్భర్త, దత్తుడు వేదములచే సేవించబడు పరబ్రహ్మం. అలాంటి దత్తుని వైపు చూడటమే ఓ యోగం.

Advertisement

తాజా వార్తలు

Advertisement