Wednesday, April 24, 2024

సప్త సారస్వతము

మన భారత భూమి అనేక పుణ్య నదుల కు పేరు. ద్వాపరయుగంలో వన వాసంలో ఉన్న పాండవులు తీర్థ యాత్రలు, చేస్తూ అనేక పుణ్యనదులలో స్నాన మాచరించి, దానధర్మాలు చేసారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో తాను పాల్గొనకుండా, బలరాముడు పుణ్యతీర్థాల సందర్శనకు బయలుదేరాడు. అనేక పుణ్యతీర్థాలు సంద ర్శించి, ”ప్రభాస తీర్థమనే” పుణ్యనదీ ప్రాం తానికి చేరుకొని, తాను చేయ సంకల్పించిన అగ్ని కార్యాలకు అనువైన వస్తువులు దాన ధర్మాలు చేయడానికి అవసరమైన సంపదను, గోవులను తీసుకురావడానికి ఏర్పాట్లు ముందే చేసుకొన్నాడు. ఆప్తులైన బంధువులను, పండి తులను, మిత్రులను రప్పించాడు. అందరితో కలిసి సరస్వతీనది సము ద్రంలో కలిసే సంగమం స్థానానికి చేరాడు. ఈ సంగమం స్థానానికి ”ప్రభాస తీర్థం” అని పేరు. ఈ ప్రభాస తీర్థంలో స్నానమాచరించి, బంగారం, గోవులను, సంపదను, దానములు చేసి, అక్కడ ఉన్న మహిర్షిని ఈ ప్రభాసతీర్థం విశేషాలు అడిగాడు. అపుడా మహిర్షి, ”ఓ! రాజా! ఈ తీర్థం చాలా విశిష్టమైనది. చంద్రుడు ఈ తీర్థంలో స్నానమాచరించి, తనకున్న క్షయ వ్యాధి నుండి విముక్తుడయ్యాడు. ఆ వివరాలు తెలియచేస్తున్నాను.
దక్షుడు కుమార్తెలు 27 మందిని చంద్రుడు వివాహమాడాడు. అందరిలోను అందగత్తె రోహిణిని ఎక్కువగా ప్రేమించేవాడు. మన స్తాపంతో మిగిలినవారంతా తమ తండ్రి దక్షుడు వద్దకు వెళ్ళి, విష యాన్ని చెప్పగా, దక్షుడు చంద్రునితో ”నువ్వు ఇలా ప్రవర్తించడం ధర్మంకాదు. అందరి భార్యలతో సఖ్యతగా ఉండమని బోధించాడు. అయినా, చంద్రుడు తన తీరును మార్చుకోకపోవడంతో, దక్షుడు కోపంతో, చంద్రుడుని క్షయ వ్యాధితో బాధను అనుభవించమని శపిం చాడు. దాంతో చంద్రుడు దినదినానికి కృశించిపోసాగాడు. కళా విహనంగా మారిపోయాడు. ఆయన కళావి#హనమవ్వడం వల్ల ఓషధులు కూడా కళావిహనమైపోయాయి. పనిచేయకుండా పోయాయి. చంద్రు డు ఓషధీపతి కదా! అందుకే అవి క్షీణించడం జరిగింది. చంద్రుడు పరి స్థితి చూసి దేవతలు చంద్రుడుతో కలిసి దక్షప్రజాపతి వద్దకు వెళ్లి ప్రార్థించగా, దక్షుడు ”చంద్రుడు భార్యలందరితోనూ సఖ్యతతో ఉండా లని సూచిస్తూ, సరస్వతీ నది సముద్రంలో కలిసే సంగమ స్థానంలో (ప్రభాస తీర్థం) స్నానమాచరించినచో, పదిహేను రోజులు వృద్ధి పొంది తే, పదిహేను రోజులు తగ్గుతూ ఉంటాడని” చెప్పాడు. ప్రతీ అమా వాస్య నాడు ఆ తీర్థంలో స్నానం చేస్తే ప్రవర్థమానుడై, శక్తిమంతుడు అవుతాడని వివరించారు.
అల్లుడు చంద్రుడుతో స్త్రీలను, బ్రాహ్మణులను అవమానించవద్ద ని, శాప విమోచన మార్గాన్ని తెలిపాడు. చంద్రుడు ఈ ప్రభాసతీర్థంలో స్నానం చేయగా, చక్కని శరీరంతో లోకాలకు వెలుగును ప్రసాదిస్తు న్నాడు. ఓషధులు పెంపొందుటకు దో#హదం పడుతున్నాడు అని వివ రించారు. అపుడు బలరాముడు ”సరస్వతీ నది విషయాలు తెలుసు కోవాలని కోరగా, ఆ మ#హర్షి, మీరు నైమిశారణ్యానికి వెళ్ళండి. అక్కడ ఈ సరస్వతీ నది విశేషాలు తెలుస్తాయి. అనగానే బలరాముడు అక్కడకు చేరుకొన్నాడు. అక్కడ యజ్ఞయాగాదులు, తపస్సు చేస్తున్న వారి సౌల భ్యం గురించి సరస్వతీ నది వారికి దగ్గరగా పారింది. ఆ సరస్వతీ నదీ ప్రాంతంలో ఒక గొప్ప మహాముని ఆశ్రమం నిర్మించుకుని తపస్సును చేసాడు. ఆయన పేరు మంకణ మ#హర్షి.
ఒకసారి మంకణ మహిర్షి సరస్వతీ నదిలో స్నానం చేస్తుండగా, కొంచెం దూరంలో ఒక స్త్రీ వివస్త్ర అయి స్నానమాచరించడం చూసి, కామప్రకోపం వల్ల వీర్యం వెలువడింది. దానిని ఒక కుండలో భద్ర పరచగా, అది ఏడు భాగాలై ఏడుగురు సత్పురుషులు జన్మించారు. దేవతలు పుట్టుటకు వారే కారణమయ్యారు. అపుడు విశ్వం అంతా అల్ల కల్లోలం అయ్యింది. దేవతలు శివుడుని దర్శించడానికి వెళ్ళారు. పర మాత్మకు కారణం వివరించగా, శివుడు మంకణ మహిర్షి ఆశ్రమానికి వెళ్ళగా ఆ సమయంలో మహిర్షి తాపసంతో నాట్యం చేస్తూండడం చూసాడు. శివుని చూసిన మంకణ మహిర్షి సాష్టాంగ పడి స్తుతించాడు. శివుడు ”ఇలా నాట్యం చేయడం, తపస్సులకు సరైనదేనా? నాట్యం ఆపమ”ని ఆజ్ఞాపించి, పరమాత్మ తన కాలిబొటకన వ్రేలుతో నేలను గట్టిగా రాయగా, భస్మం వచ్చింది. అపుడు మహర్షి నాట్యం ఆపి ”నీవే ఆధారం. నీవే దైవం. నీవే సృష్టి స్థితి లయకారుడవు. నీవే దయతో నన్ను కాపాడుము. అనగానే తపస్సు శక్తి నశించకుండా వరమిచ్చి వెళ్ళిపో యాడు. ఆయనలో తాపసం తగ్గింది. ఆ మహావీరుని ఉనికిపట్టు అయి న సరస్వతీ నది సప్త సారస్వతమయ్యింది.” అని ఆ నైమిశారణ్యంలో ఒక మహిర్షి వివరించగా, బలరాముడు ”ఈ సరస్వతీ నది ఏవిధంగా సప్త సారస్వతమయ్యింది?” అని ప్రశ్నించారు. అపుడు ఆ మహిర్షి వివ రిస్తూ బ్రహ్మ, గయుడు, ఉద్ధాలకుడు, వశిష్ఠుడు, గురుడు, హమవంతుడు, పుష్కరుడు నైమిశారణ్యంలో యజ్ఞయాగాదులు చేస్తున్న సందర్భంలో, ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రూపంతో విలసిల్లింది. అవే సుప్రభ కనకాక్షి, విశాల, సుల్తాన్‌, ఓఘమాల, సువేణి, విమలోదక అనే ఏడు పేర్లతో వెళ్ళి గౌరవం పొందింది. సరస్వతీ దేవి స్త్రీ రూపంలోనే వెళ్ళి, దేవతలు చేత, యజ్ఞకర్తలు చేత, మహర్షులు చేత గౌరవం పొందింది. మంకణ మహిర్షి ఆశ్రమంలో తిరిగాడుతున్న సరస్వతీదేవి పైన చెప్పిన ఏడు రూపాలలో తిరుగాడుతూ, మహ‌ర్షుల యజ్ఞ యాగాదులు సౌలభ్యం నిమిత్తం గౌరవించాలి. ఏడు రూపాలతో గౌర వం పొందడంవల్ల సప్తసారత్సమని పేరు.” అని మహర్షి వివరించారు.
బలరాముడు సంతోషించి, వారివద్ద శలవు తీసుకుని మరో క్షేత్రా నికి బయలుదేరాడు. ఈ ప్రభాస తీర్థం సప్త సారస్వత సరస్వతీదేవి గురించి విన్నవారికి సరస్వతీ కటాక్షంతోబాటు, ప్రభాసతీర్థ స్నాన ఫలితం వస్తుందని మహర్షి బలరాముడుకు తెలిపారు.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement