Saturday, March 25, 2023

సప్త రథాలపై సప్తగిరీశుడు విహారం

”వేంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించినా
వేంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతే”
అనగా వెంకటాచల పర్వతాలు, తిరుమల క్షేత్రం వంటి పవిత్ర ప్రదేశం ఈ బ్రహ్మాండంలో ఎక్కడ లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అంతటి శక్తివంతమైన దైవం.
స్వామి వారు వైకుంఠం నుండి భూలోకానికి అర్చనావతారం లో అంటే విగ్రహ రూపంలో అవతరించిన ఘట్టంలో ఆయన బ్ర హ్మాది దేవతలతో ”తాను భూలోకంలో కల్పం చివరి వరకు ఉంటా నని, నన్ను లక్షలాది మంది భక్తులు దర్శించి స్వల్ప కోర్కెలు కోరు కుంటారని, వాటిని తీర్చిన తనను మళ్ళిమళ్ళి దర్శించుకుంటా రని” వివరించారని చరిత్ర తెలుపుతోంది. స్వామి వారిని ఎన్నో కోరి కలు కోరాలని వచ్చిన భక్తులు ఆలయంలోకి ప్రవేశించి గర్భాల యంలోని తొమ్మిదిన్నర అడుగుల ఎత్తున దివ్య సుందరమూర్తి మూలవిరాట్టుని దర్శించగానే కోరాల్సిన కోర్కెలన్ని మరచి తమకు తామే మైమరచిపోతారు. బయటికి వచ్చాక ఆలయం లోపల ఏమి చూసామో కూడా తెలియని విచిత్ర అనుభూతి ప్రతి భక్తునికి కలుగు తుంది. అయితే భక్త సులభుడయిన శ్రీవారు భక్తులు కోరుకోవలసిన కోర్కెలు వారు తన్మయత్నంలో మరిచినా, వారు అడగకుండానే తీరుస్తారు. అపూర్వం మానవ మేధస్సుకి అంద ని రీతిలో వుండే ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం. తిరు మలలో జరిగే ప్రతి ఉత్సవం ఒక బ్రహ్మాండమే. రథసప్తమి పర్వదినం తిరుమలలో జరిగే ముఖ్య మైన వార్షిక పండుగ. ఈ రోజు వేంకటేశ్వరుడు (మలయ ప్పస్వామి) తన దేవేరులతో కలసి ఏడు కొండల మీద, ఏడు వాహనాలపై రోజంతా ఊరేగడం విశేషం.
తిరుమల తిరుపతి దేవస్థానం గ్రంథాల ప్రకారం రథసప్తమి పండుగ 1565 సంవత్సరం నుండి నిర్వహంచబడుతోంది. ఈ రోజున, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంకటేశ్వర స్వామిని ఏడు వాహనాలు అయిన సూర్యప్రభ వాహనం, చిన్న శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వ భూపాల వాహనం, చంద్రప్రభ వాహనాలపై నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తకోటికి దర్శనమిస్తారు.
సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంలో మలయప్ప స్వామి ఏడు గుర్రాల రథానికి సారథ్యం వ#హస్తారు. శంఖం, చక్రం, గదా, సర్జాలతో సహా తన ఐదు శక్తివం తమైన కవచాలను ధరించి, వజ్ర కిరీటంతో అలంకరించబడి, వజ్రా లు రంగురంగుల పూలతో తయారు చేసిన దండలు అలంకరిం చిన రధం ఆలయంనుండి ”మహా ప్రదక్షిణ మార్గం”గుండా వెళుతుం డగా, ఊరేగింపుగా ఏనుగులు కూడా వెంట వస్తాయి. గుర్రాలు, ఎద్దులు, భక్త బృందాలు ‘భజనలు’ పాడుతూ ‘గోవింద’ నామా లను ఆలపిస్తారు. వేంకటేశ్వరుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేయ బడిన వేదిక వద్దకు చేరుకుంటారు. ఉదయించే సూర్యుడు తన సువర్ణ వర్ణ శోభాకిరణాలతో వేంకటేశ్వరుడిని పాదాలనుండి తల వరకు తాకి ఆ కిరణాల్లో మరింత శోభతో వున్న స్వామి దర్శ నం అపూర్వం అద్భుతం. ఈ తెల్లవారుజామున సూర్యుడు స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటాడట. స్వామి వారికి అర్చకులు బం గారు పళ్ళెంలో నైవేద్యాలను సమర్పించి మంగళకరమైన కర్పూర ‘హారతి’ సమర్పిస్తారు. సూర్యప్రభ వాహనంపై స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు సూర్యోదయానికి ముందే బారులు తీరుతారు. ఈ వైభవాన్ని చూస్తే సూర్యగ్రహ దోషం, నవ గ్ర#హ దోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.

Advertisement

తాజా వార్తలు

Advertisement