Thursday, April 25, 2024

చింతానివారణం సాయి నామ స్మరణం

సబ్‌కా మాలిక్‌ ఏక్‌… అంటే అందరి ప్రభువు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతం ప్రబోధించారు షిర్డీ సాయిబాబా. ఎలాంటి నియమాలు అవసరంలేదు. నిర్మలమైన మనస్సుతో పూజించినవారిని కరుణిస్తానని భక్తులకు చెప్పారు షిర్డీసాయి. సాయిబాబాను గురువు, సాధువు, ఫకీరు అని పలురకాలుగా పిలుచుకుంటారు భక్తులు. కుల, మతాలకు అతీతంగా అందరూ సమానులు అని ప్రబోధించారు సాయినాథుడు. అందుకే ఆయన్ను ముస్లిం లు, హిందువులు పూజిస్తారు. మసీదులో నివసించిన సాయినాథుడు… గుడిలో సమాధి అవడమే అందుకు నిద ర్శనం. తాను దైవాన్ని కాదని, కేవలం గురువుగా భావించాలని భక్తులకు వివరించారు సాయి బాబా. అంతేకాదు భగవంతు డిని ఏవిధంగా ఆరాధించాలి, భగవంతుడి పట్ల వినయ విధే యులుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గనిర్దేశం చేశారు షిర్డీసాయి.
సాయిబాబాలో సూర్యుని తేజ స్సు కనిపిస్తుంది. చంద్రుని చల్ల దనం అనుభూతికొస్తుంది. కష్టం కలిగినప్పుడు, మనసుకు క్లేశం కలిగినప్పుడు బాబాను తలచు కుంటే, ఆయన్ను స్మరిస్తే మనసు కు నిశ్చింతగా ఉంటుంది. ‘సా యీ నువ్వే శరణం’ అని బాబా మీద భారం మోపితే దు:ఖాల నుండి బయటపడే మార్గం కని పిస్తుంది. ఆపదలు తొలగిపోతా యి. మనసులో అల్లకల్లోలాలు తొలగిపోతాయి. మనసును నిబ్బరంగా ఉంచుతాడు. సాయి చింతనతో ప్రశాంతత చేకూరు తుంది. చింతలు దూరమౌతా యి. వ్యాకులత తగ్గిస్తాడు. అజ్ఞా నపు చీకటిని తొలగించి, జ్ఞాన జ్యోతులు వెలిగిస్తాడు. కష్టాల నుండి విముక్తి పొందే మార్గాన్ని సూచిస్తాడు. జీవన గమనంలో హాయిగా ముందు కు సాగేలా చేస్తాడు.
నీటితో దీపాలు వెలిగించినా… భక్తుల పాపకర్మలను తానే స్వయంగా కడిగినా… భక్తుల కోర్కెలు తీర్చినా… తానె ప్పుడూ దైవం అని చెప్పుకోలేదు సాయినాథుడు. తనకు దేవుడు అప్పగించిన కార్యాలని నిర్వహించడానికి వచ్చిన గురువుగా మాత్రమే వచ్చానని చెప్పేవారు. ఈ సృష్టిలో దైవానికి మించినది ఏదీలేదని భక్తులకు ప్రబోధించారు సాయి. అయితే బాబా సద్గురువేకాదని భగవంతుని స్వరూపమని ఆయన లీలలు సాక్షాత్తు చూశా మని ఆయనతో కలిసి జీవించినవారు విశ్వసించారు. ఆయన మహిమలు ఎన్నో ఉన్నాయని ఆయనతో కలిసి జీవించినవారు కొన్ని పుస్తకాల్లో ప్రస్తావించారు.
తన భక్తులు రెండు నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడూ చెబుతుండేవారు సాయిబాబా. అవి శ్రద్ధ- సబూరి. వీటి ప్రతి ఒక్కరు అలవరుచుకోవాలని సూచించారు. శ్రద్ధ అంటే విశ్వాసం, భక్తి, దీక్ష అని- సబూరి అంటే ఓర్పు, సాధన అని సందేశమిచ్చారు. అందరిపైనా ప్రేమ కురిపించేవారు సాయి.
మూగజీవులను కూడా ఎంతో ప్రేమతో చూసుకోవాలని సూచించారు. వాటి ఆకలి తీరిస్తే తన ఆకలి తీర్చినట్టే అని తన భక్తులకు చెప్పేవారు సాయిబాబా.

Advertisement

తాజా వార్తలు

Advertisement