Sunday, March 24, 2024

సాయి బోధనా మార్గం

సాయిబాబా గారు ఎవరి సంస్కారానికి తగిన ఉపదేశం ఇచ్చి సంస్కరించేవారు. భి.వి.దేవ్‌ దహను గ్రామానికి మామలతదారుగా పనిచేసేవాడు. ఆతనికి ఎప్పుడు ”జ్ఞానేశ్వరి” గ్రంథం పారాయణ మొదలుపెట్టినా ఏదో ఒక ఆటం కం వస్తూ వుండేది. సద్గ్రంథ పఠన కూడా సద్గురువుని అనుగ్రహం వలనే సార్ధకమ వుతుందని విశ్వసించి సాయినాథుని భక్తుడైన దేవ్‌ గ్రంథాన్ని సాయి ఆశీస్సులు పొంది చదవాలని నిశ్చయించుకొని శిరిడీ వెళ్ళాడు. బాబా వారు సర్వాంతర్యామి. ఆయన దేవ్‌ నుండి 20 రూపాయల దక్షిణ తీసుకొని పారాయణ విషయం మాట్లాడలేదు. మశీదు కిక్కిరిసి వుండడంతో దేవ్‌ ఒక మూల కూర్చున్నాడు. బాబా వారు అతడిని పిలిచి తన పాద సేవ చేస్తూ ప్రశాంతంగా కూర్చోమన్నారు. దేవ్‌ ఆరతి అయిపోగానే అక్కడే వున్న బాలక్‌రాం అనే భక్తుడిని అతను బాబా వారి కృపను ఎలా పొందాడో చెప్పమనగా అతడు చెప్పసాగాడు. ఇంతలో బాబా దేవ్‌ను పిలిచి కోపంతో ”నా గుడ్డపీలికలను ఎందుకు దొంగలించావు? తల నెరిసినా నీ పద్ధతిని మార్చుకోలేదు కదా, నిన్ను గొడ్డలితో నరు కుతాను” అని కేకలేసారు. ఒక్కసారిగా బాబా వారు ఎందుకు తన మీద కోపం వహంచారో దేవ్‌కు అర్ధం కాలేదు. కాసేపటి తర్వాత బాబా దేవ్‌ను పిలిచి ”గుడ్డపీలికల విషయం చెప్పి నిన్ను బాధపెట్తానా? దొంగత నం చేస్తే ఒప్పుకోక తప్పదు” అని అతని దగ్గర నుండి మరి పన్నెండు రూపాయలు దక్షిణ తీసు కొని ”నీ గదిలో విశ్రాంతిగా కూర్చొని జ్ఞానే శ్వరిని పారాయణ చెయ్యి. నీకు నేను జలతారు శాలువాను ఇవ్వడానికి సి ద్ధంగా వుంటే ఇతరుల గుడ్దపీలిక లను దొంగిలించవలసిన అగత్యం ఏమిటి?” అని ఆశీర్వదించారు. బా బా వారి ఆశీస్సు ల ను పొందిన అ త్యుత్సాహంతో దేవ్‌ పారాయణ మొదలుపెట్టగా ఈసారి అది నిరా టంకంగా సాగిం ది. బాబా తనను ఎందుకు కోపడ్దారో దేవ్‌కు అర్ధమయ్యింది. పరిశుద్ధ పరబ్రహ్మ స్వరూపులయిన సాయిని ఎదురుగా ఉంచుకొని సాయి అనుగ్రహం పొందాలి గాని వేరే వారి నుండి సాయిని గురించి తెలుసుకుందామన్న దేవ్‌ ఆలోచనలను బాబా ఈ విధం గా సంస్కరించారు. ”సామాన్యుల బోధలు చింకి గుడ్దలు. సద్గురువు బోధించేది జరీ శాలువ” అని బాబా తన లీల ద్వారా దేవ్‌కు అర్ధమయ్యే రీతిలో చూపించారు. బోధించ డమేకాక, ఒక సంవత్సరం తర్వాత దేవ్‌కు కలలో కనిపించి అతని పారాయణ ఎలా సాగు తున్నదో వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్ఞానేశ్వరి గ్రంథం అర్ధం అవడం కష్టంగా వుందని దేవ్‌ చెప్పగా, ఎలా పారాయణ చెస్తే ఆ గ్రంథంలోని విషయాలు అర్ధమౌతాయో బాబా అతనికి వివరించారు. అప్పటినుండి దేవ్‌ పారాయణ నిరాటంకంగా సాగి ఆ గ్రంథంలోని విషయాల పట్ల దేవ్‌ గొప్ప పట్టు సాధించాడు. గురువు శరీరంతో ఎదురు గా ఉండగా వారి వద్ద స్వయంగా తెలుసుకోవాలి గాని ఇతరుల నుండి తెలుసుకోవాల నుకోవడం దొంగతనంతో సమానం అని బాబా బోధించారు.
ఏ కార్యమైనా, ఏ సద్గ్రంధ పఠనం అయినా గురువు అనుగ్రహం వలనే చేయగలం, చద వగలం. బాబా వారు గురువును గురించి తెలుసుకోవాలి. లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా? అని ప్రశ్నించేవారు. సద్గురువు అనుగ్రహం వుంటే ఎంతటి క్లిష్టమైన కార్యమైనా సాధ్యమే. ఈ సత్యాన్ని మన పవిత్రమైన మనసులో పదిల పరచుకొని ఆ సద్గురువు గురించి తెలుసుకుంటూ, నిత్యం చింతన చేస్తూ, అనన్య భక్తితో ఆరాధిస్తూ, ఆత్మ జ్ఞానానికి, మోక్ష సిద్ధికి చిత్తశుద్ధితో కృషి చేద్దాం.
సర్వం శ్రీ సాయినాథ పాదారవిం దార్పణమస్తు

Advertisement

తాజా వార్తలు

Advertisement