Saturday, September 23, 2023

ప్రణాళికతోనే ఫలితం సాధ్యం!

తలపెట్టిన కార్యాన్ని శుభప్రదంగా పూర్తిచేయడానికి ఆచరించాల్సిన నియమ నిబంధనలు, వ్యూహాల కలయికనే ప్రణాళిక అనొచ్చు. చేయాల్సిన కార్యక్రమాలను దృష్టిలో నుం చుకొని, ముందుచూపుతో వ్యవహరిస్తూ, ఎదురవ్వబోయే పరిణామాలకు తగ్గట్టు జాగ్రత్తలు పాటిస్తూ కార్యక్రమ రూప కల్పన చేసినప్పుడే సత్ఫలితాలను పొందగలరు.
నాటి రాజుల నుండి నేటి పాలకుల వరకూ, సామాన్య మానవుడి నుండి సంపన్నుడి వరకూ ప్రతి ఒక్కరికీ ప్రణాళిక అవసరమే. తగిన ప్రణాళిక లేనిదే అనుకున్నది సాధించడం సులువు కాదు. సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుడితో మైత్రికి అంగీకరించి, కోట్లలోవున్న వానర సైన్యం సహాయంతో నలు మూలలా గాలించడం, హనుమంతుడు లంకా ప్రవేశం చేసి సీతమ్మ జాడ కనిపెట్టడం, సముద్రానికి వారధి నిర్మించి లంక లో ప్రవేశించడం, రావణుడితో యుద్ధానికి సన్నద్ధమయ్యే ముందు అగస్త్య మహర్షి బోధించిన ఆదిత్య హృదయాన్ని శ్రీరాముడు హృదయంలో నిలుపుకోవడం వంటి వరుస కార్యా లన్నీ ప్రణాళిక ప్రకారమే జరిగాయని రామాయణం చదివిన వారికి తెలుస్తుంది.
విదురుడి నుండి సమాచారం అందుకున్న పాండవులు, లక్క ఇంటి నుండి సజీవంగా బయటపడే ప్రయత్నాలు చేయడం, అరణ్య అజ్ఞాతవాస సమయాల్లో శ్రీకృష్ణుని సహాయ సహకారాలతో పథక రచన చేసినందువల్లనే దిగ్విజయంగా వాటిని పూర్తి చేయగలగడమే కాకుండా పాండవులు బతికి బట్టకట్ట గలిగినట్టు భారతంలోని ఘట్టాల నుండి తెలుస్తుంది.
ప్రజలకు మెరుగైన పాలనను అందించడానికి మంత్రులతో కూర్చుని నాటి రాజులు, చక్రవర్తులు ప్రణాళికలు రచించేవారు. అంతేకాదు శత్రువులను ఓడించడానికి యుద్ధాలలో అనేక వ్యూహాలను పన్నేవారు.
గురువు ద్రోణుడు సర్వ సైన్యాధ్యక్షుడై రెండు రోజులు దాటినా ధర్మరాజుని బంధిం చలేక పోయాడని కటువుగా మాట్లాడిన దుర్యోధనుడిని సంతృప్తిపరచడానికి, పాండవుల ను దెబ్బ తీయడానికి ఆయన పద్మవ్యూహం పన్నాడు. ఆ వ్యూహాన్ని ఛేదించి తిరిగి రావడం అందరికీ సాధ్యంకాదు. అది తెలిసిన అర్జునుడు ఎక్కడో దూరంగా యుద్ధం చేస్తున్నాడు. లోపలకి ప్రవేశించడం మాత్రమే తెలిసిన అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించి కౌర వుల పన్నాగానికి బలయ్యాడు. ఆవిధంగా పాండవులకు గొప్ప నష్టం కలుగగా, దుర్యో ధనుడికి గొప్ప సంతోషం కలిగింది. వ్యూహం ప్రకారం వెళితే విజయం దక్కుతుందని చెప్పేందుకు ఎన్నెన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.
కోరిక మాత్రం బలంగా ఉంటే సరిపోదని, సాధించేందుకు నైపుణ్యంతో బాటు ప్రణా ళికా రూపకల్పన అవసరమని గుర్తించి ఆ ప్రకారం అడుగులేసి విజయం పొందిన వీరులు చరిత్రలో కనిపిస్తారు. నందరాజు లను ఓడించి చంద్రగుప్తుడిని పట్టాభిషిక్తు ణ్ణి చేయడంలో చాణ క్యుడనుసరించిన వ్యూహాలు, చూపించిన మేథో నైపుణ్యం నేటికీ ఆదర్శనీయంగా నిలిచాయి. సింహఘడ్‌ కోటతో సహా అనేక కోట లను జయించడంలో, హందూ సామ్రాజ్యాన్ని విస్తరించడంలో తానాజీతో కలసి ఛత్రపతి శివాజీ అనుసరించిన వ్యూహాలు, చూపించిన ధైర్య సాహసాలు వారికి ఎన్నో విజయాలను కట్ట బెట్టాయి. చరిత్ర పుటల్లో శివాజీకి చక్కని స్థానం కల్పించాయి.
దేశ పాలకులు కూడా ఏడాదికొకసారి ఆదాయ వ్యయాల ప్రణాళికలను రూపొందించి చట్టసభలలో ఆమోదం కోసం పెడ తారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడానికి, అన్ని వర్గాల ప్రజలకు ఆమోద్యయోగ్యమైన పాలన అందించడానికి, అంత ర్జాతీయ అవసరాలను తీర్చేవిధంగా రూపొందించే ఆర్ధిక ప్రణా ళికలే పరిపాలనను సులభతరం చేస్తాయి. ప్రధానిగా జవహర్‌ లాల్‌ నెహూ పంచవర్ష ప్రణాళికలు ఆమోదింపజేసి దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం, భారీ పరిశ్రమలను స్థాపించడం, ఉన్నత విద్యాసంస్థల కోసం నిధుల ను కేటాయించడంవల్లనే స్వేచ్చా భారతంలో అభివృద్ధిని సాధించాము. ఒకప్పటికీ ఇప్ప టికీ విదేశీ మారక ద్రవ్య నిల్వలు దేశంలో పెరిగాయంటే పాలకులు అనుసరించిన సరళీ కృత ఆర్ధిక విధానాలే కారణం. కార్యసాధకులు తలపెట్టిన కార్యాలను ఆత్మవిశ్వాసంతో ప్రారంభించి ఆటంకాలను అధిగమిస్తూ పూర్తి చేస్తారు. అందుకవసరమైన ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకుని ఎదురయ్యే కష్టాలను, అడ్డంకులను అధిగమించి విజయ పథాన ముందుకి సాగుతారన్నది సత్యం.
”ప్రణాళికలు వేసి పనులు చేయకున్న ప్రగతి ఏది?
నడిచెదనని కూర్చుంటే గమ్యమదే వస్తుందా?”
అని కవి ప్రశ్నించినట్టు చేయాల్సిన పనులను దృష్టిలో పెట్టుకుని పథకాలు, ప్రణా ళికలు రూపొందిస్తే సరిపోదు. చిత్తశుద్ధి, అంకిత భావాలతో ఆయా కార్యాలను పూర్తి చేసే వరకు విశ్రమించని నైజం, మొక్కవోని దీక్ష కావాలి. అప్పుడే ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement