Friday, April 19, 2024

తత్త్వవేత్తల మేధస్సుకు తార్కాణం

నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతనకు అత్యధిక ప్రాధా న్యతనిచ్చే సంస్కృతి మనది. వాదాలు, శాస్త్రాలు పురా ణాల ద్వారానేకాక, కథలు, పాటలు, చివరకు ఆటలలో కూడా ఆధ్యాత్మిక ప్రబోధం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కలి గించే ప్రయత్నం చేశారు మన పూర్వీకులు.
”వైకుంఠపాళి” అనే ఆటను గమనించామంటే ఈ విష యం ప్రత్యక్షర సత్యం అని మనకు అవగతమవుతుంది. నాటి నుండీ నేటి దాకా ఆబాలగోపాలం ఎంతో మక్కువతో ఆడే ఈ ఆట మన కు నేర్పుతున్న జ్ఞానాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేద్దాం.
‘పాళి’ అంటే ఫలకము/పలక అని అర్థం.
వైకుంఠం అంటే శ్రీ మహావిష్ణువు నెలకొని ఉండే ప్రదేశం. యోగి పుంగవులు, ఎంతో పుణ్యం చేసుకొన్నవారు, భక్తాగ్రేసరులు మాత్రమే చేరగల దివ్య ధామం. ధర్మకార్యాలు, సత్కర్మలు చేయ డం వై పు మానవాళిని మళ్ళించే ఆలోచనతో మన పూర్వులు స్వర్గం పట్ల ఆపేక్షను, నరక బాధల పట్ల భీతిని మనలో కలిగించే ప్రయత్నం చేశారు. సత్ప్రవర్తన, ధార్మిక ప్రవృత్తి వలన స్వర్గ ప్రాప్తి పొందగలమని, అధర్మ వర్తనులకు నరకయాతనలు తప్పవనీ బోధించారు. వైకుంఠపాళి ఆటలో పరమ పదమైన 132వ గడిని చేరడమే లక్ష్యంగా ఆటగాళ్ళు పాచికలు వేస్తూ తమ పావులను కదుపుతారు. ఎవరు ముందు ఆ గడిని చేరు కొంటారో వారు విజేత లన్నమాట. ఈ ఆటకు ‘పరమపద సోపాన పటము’ అన్న మరో పేరూ ఉంది.
వైకుంఠపాళి ఆటకు కావలసిన సామాగ్రి పటము (చిత్ర ము), పాచికలు లేదా గవ్వలు (డైస్‌), ఆటగాళ్ళు తమ ప్రతీకలుగా పటంపై కదిలించే పావులు. ఈ ఆటను ఎంతమం దైనా ఆడవచ్చును. అంద రికీ సరిపడా పావులుండాలి.
దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ పటానికి క్రింది వరుసలో ఏనుగులు, పాములు చిత్రించబడి ఉంటాయి. ఆ వరుస పాతాళలోకమని (భూమికి దిగు వన ఉండే అధోలోకం), భూభారాన్ని మోస్తున్న దిగ్గజాలు, ఆదిశేషుని వంటి సర్పాలకు ఆ చిత్రాలు ప్రతీకలని అంటారు.
పావులు కదిలే గడులున్న భాగమంతా భూలోకం. అక్కడ మానవ సంచారానికి గుర్తుగా ఈ పటంలో పావులు కదుపబడతాయి. చివరకు చేరుకొనే 132వ గడి వైకుంఠం లేదా పరమ పదము. (తద్విష్ణో: పరమం పదం; విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం). పరమ పదాన్ని చేరుకొన్న వ్యక్తికి మరుజన్మ ఉండదంటారు. ఆ లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నించడమే ఈ ఆట యొక్క ముఖ్యోద్దేశం. వైకుంఠ పాళి పటంలో మానవుల సుఖ సంతోషాలకు నిచ్చెనలు, దు:ఖాలకు పాములు సంకేతా లుగా చెప్పవచ్చును. నిచ్చెన ఉన్న గడిలోని పావు త్వరగా పదోన్నతి పొంది చాలా గడులలో ప్రయాణించే ప్రయాసను తప్పించుకొని పై గడిలోకి చేరు తుంది. అదనంగా మరొక పందెంవేసే అవకాశాన్నీ బోనస్‌గా ఇస్తుంది. మనం జీవితంలో ఏ సత్కర్మలు చేస్తే మనమా లక్ష్యానికి దగ్గరగా వెళతామో వాటిని ఆ ఉన్నతిని సూచించే నిచ్చెనలున్న గడులకు పేర్లుగా నామకరణం చేశారు. సుగుణం… సాలోక్యానికి, సత్ప్రవర్తనం…. గోలోకానికి, నిష్ఠ… తపో లోకా నికి, యాగం… స్వర్గలోకానికి, భక్తి… బ్ర#హ్మలోకానికి, చిత్తశుద్ధి… మహా లోకానికి, జ్ఞానం… కైలాసానికి, గురుబోధ…. స్వర్గానికి, వైరాగ్యం… వైకుం ఠానికి, యోగి బొమ్మ ఉన్న గడి… సారూప్యానికి- సోపానాలుగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అక్కడకు చేరాక ఇక జన్మరా#హత్యం కలిగించే పరమ పదం చేరడానికి మన వంతు వచ్చేదాకా, అంటే సరైన పందెం పడే దాకా ఓపికగా వేచి ఉండాలి.
వైకుంఠ పాళి పటంలో చిన్నవి, పెద్దవి మొత్తం 10 నిచ్చెనలు, 13 పాములు ఉన్నాయి. అంటే బాగుపడడానికంటే చెడిపోవడానికే ఈ లోకంలో అవకాశాలు ఎక్కువ అన్న సూచన చేయబడిందన్నమాట. చెడు గుణాలకు బానిసలై అథోగతిని పొందిన రాక్షసుల పేర్లు దుర్గుణాల పేర్లు పాములున్న గళ్ళకు పెట్టబడ్డాయి. రావణుడు, #హరణ్యాక్షుడు, నరకాసురుడు, దుర్యోధ నుడు, బకాసురుడు, తనరథుడు, కర్కోటకుడు, మాత్సర్యము, అరుకాసు రుడు, అ#హంకారము, శతకంఠుడు, ధేనుకాసురుడు, పూతన అనేవి పాము లున్న గడుల పేర్లు. ఆ రాక్షసుల దుష్టగుణాలను దరిచేరనీయకుండా తప్పిం చుకోవాలన్నది దీని అంతరార్థము. పాముతల ఉన్న గడిని చేరిన ఆటగాని పావు దాని తోక ఉన్న అడుగు భాగపు గడికి తిరిగి రావాలి. అంటే ఆథోగతి చెందుతుంది.
పరమపదాన్ని చేరనీకుండా రెండు పాములు (ద్వార పాలకులు) అడ్డు కొంటాయి. అరుకాసుడనే పెద్ద పాము 106వ గడిలో ఉంటుంది. అంత వరకు కష్టపడి వచ్చినామని గర్వించే వారిని మింగి ఒకటవ గడిలోకి, అంటే అట్టడుగునకు పడవేస్తుంది. ఇలా పరమపదాన్ని చేరేవరకు జీవుడు సంసార, జరామరణ చక్రంలో పడుతూ లేస్తూ, తప్పించుకోలేని ఊగిసలాట ను గొప్పగా ఈ ఆట ద్వారా బోధించిన తీరు అద్భుతం.
మహాకవి సి.నారాయణరెడ్డిగారు అన్నట్లు ”జీవితమే ఒక వైకుంఠ పాళి, నిజం తెలుసుకో భాయీ/ ఎగరేసే నిచ్చెనలే కాదు పడదోసే పాములు ఉంటాయి.”
అత్యంత జాగరూకతతో జీవితమనే వైకుంఠపాళిలో మనగలిగే వారికే అంతిమ విజయం లభిస్తుంది. గెలుపోటములు అనే మానసికాను భూతులను ధైర్యంగా, స్థైర్యంగా ఎదుర్కోగలిగే వ్యక్తిత్వ వికాస శిక్షణను ఇస్తుంది ఈ ఆట. గుండు మధసూదన్‌గారు అన్నట్లు ”పిల్లలాడునాట, పెద్దలాడెడి యాట/ నిచ్చెనలును పాములిచ్చి పుచ్చు/ వారివారి కర్మ పరిపాకమును బట్టి/ ముందు వెనుకలుగను మోక్ష పదవి.” మన తెలుగు వారికి సుపరిచితమైన వైకుంఠపాళి ఆటను రూపొందించిన తత్వవేత్తల మేధస్సుకు జోహార్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement