Tuesday, April 23, 2024

నేటి రాశి ప్ర‌భ (1-12-2021)

మేషం : సన్నిహితుల సాయం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కుటు-ంబ సభ్యులతో అకారణ వైరం. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో కొత్త యత్నాలు విఫలం. ఆకస్మిక ప్రయాణాలు.

మిథునం : పడిన శ్రమ ఫలితమిస్తుంది. కొత్త పరిచయాలు. అదనపు రాబడి ఉంటు-ంది. చిరకాల మిత్రులను కలుస్తారు. ఉద్యోగాలు, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం : వ్యాపారాలలో ముందంజ. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు.

సింహం : కుటు-ంబ సభ్యుల నుంచి వ్యతిరేకత. రాబడి అంతగా కనిపించదు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

- Advertisement -

కన్య: కార్యక్రమాలలో ఆటంకాలు. ఇంటాబయటా సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారాలలో నిరుత్సాహపడతారు. ఉద్యోగాలలో మార్పులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో విజయాలు.

వృశ్చికం: సంఘంలో గౌరవ మర్యాదలు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

ధనుస్సు: దూర ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో అకారణ వైరం. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో పనిభారం.

మకరం: కొత్తగా అప్పులు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. శారీరక రుగ్మతలు.

కుంభం: నూతన పరిచయాలు. దేవాలయ దర్శనాలు. కుటు-ంబంలో శుభకార్యాలు. ఆస్తి లాభం. యత్న కార్యసిద్ధి. గృహ నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం : ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో చిక్కులు. కార్యక్రమాలలో అవాంతరాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement