Friday, March 29, 2024

రామాయణ కాలం…విద్యాపద్ధతి!

రామాయణ కాలంలో ఆశ్రమాలలో నియమ పూర్వకంగా విద్యాభ్యాసం జరిగేది. అయోధ్య వాసులలో విద్యావ్యసనం బాగుండేది. వైదిక ఆశ్ర మాలు- ఆచార్యుల ఆధిక్యం వలననే ఆ పేరులలో నిరక్షరాస్యత ఉండే ది కాదు. నిరక్షరాస్యులు కనిపించేవారు కాదు. బ్రహ్మచారుల సంఘానికి విద్యా సంబంధమైన ఖర్చులన్నీ రాజకుటుంబమే భరించేది. విద్యాప్రచారానికి యజ్ఞో త్సవములు- విద్వత్‌ పరిషత్తులూ, గంభీరమైన జ్ఞాన చర్చలు జరిగి విద్యాభివృ ద్ధికి దోహదం చేసేవి. ప్రతిభ కలిగిన వ్యక్తులకు కళాప్రదర్శనలు- పోటీలను ఏర్పాటు చేసేవారు. ఉత్సవాలకు ఆహుతులైనవారంతా వేదవేదంగాలు తెలిసిన వారు. చక్కగా వాదించేవారు.
విద్యా పాఠ్య కార్యక్రమాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అవి శారీర కం- బౌద్ధికం- వ్యావహారికం- నైతిక పాఠ్యకార్యక్రమాలు, శాస్త్రీయ సాహిత్యం లో వేదాలకు ముఖ్య స్థానం కల్పించేవారు. ఋగ్వేదం- యజుర్వేదం- సామవే దం రామాయణంలో తెలుపబడింది. అధర్వవేదానికి వేదాల్లో స్థానం ఇవ్వబడ లేదు. వాఙ్మయ సంబంధమైన విద్యలుండేవి. లలిత కళలకు స్థానం ఉండేది. ఆయుర్వేదం బాగా ప్రచారంలో ఉండేది. వాణిజ్య విద్యా వ్యాప్తి చెందినది. శిల్పక ళ అభివృద్ధిలో ఉంది. నైతిక విద్యలో కడు జాగరూకత వహించేవారు. పవిత్ర ఆచరణ- సత్యపాలన- కర్తవ్య పాలన- ఇంద్రియ నిగ్రహం- మనోవాక్కాయ కర్మల పవిత్రత ఉత్తమ విద్యావంతుల లక్షణంగా భావింపబడేది.
విశ్వామిత్ర మహర్షి ‘బలా- అతిబలా’ అనే అలౌకిక శక్తులనిచ్చే గుహ్యవి ద్యలను రామలక్ష్మణులకు నేర్పాడు. అవి నేర్చిన వారికి శారీరక బడలిక- మానసి క చింతలు కలుగవు. ఈ విద్యల ప్రభావంతో ఆకలిదప్పుల బాధలుండేవి కావు. బలా- అతి బలా విద్యలు ఉత్తమ వైదిక మంత్రాల సమూహం. దార్శనిక మంత్రా లు ఉండేవి. అవి శ్రీరామునకు దార్శనిక జ్ఞానం- బుద్ధి నైపుణ్యం- తర్కం సూక్ష్మ గ్రాహ్యం కలుగజేశాయి. వాల్మీకి ముని లవకుశులకు భూత వినాశినీ విద్య నందించి రక్షించగలిగాడు.
ఆనాడు వ్రాత పద్ధతి అల్పంగా వుండుటవలన విద్యమౌఖిక రూపంలో చె ప్పబడేది. విద్యాబోధనా పద్ధతులలో లేఖన విద్య- కథా పద్ధతి ఉండేవి. గురువు శిష్యులకు ఉపదేశాలు నిండిన కథలు వినిపించేవాడు. ఉత్తమ పౌరులుగా తయా రుచేసేవారు. తన పాఠ్యాంశములలో విస్మయము- కుతూహలము- నవీనత్వ మును సృజించేవాడు. విశ్వామిత్రుడు రామునికి అభిరామ కథలు వినిపించి, వినోదంతో బాటు విజ్ఞానాన్ని కలిగించేవాడు. శాస్త్రపఠనం చేసేవారు.
సంపాదించిన జ్ఞానాన్ని మరువకుండా ప్రాచీన కాలంలోని విద్యావేత్తలు స్వాధ్యాయము- అభ్యాస పద్ధతులను కనుగొన్నారు. గురువు ద్వారా పొందిన జ్ఞానమును ప్రతి నిత్యము వల్లించేవా రు. కంఠస్తం చేసేవారు. స్వాధ్యాయ మంటే స్వంత విద్యాభ్యాసము ఆర్జిం చిన దానిని నిరంతరము ఉపాసించడ మే. శ్రీరాముడు శీలం- జ్ఞానంలో తన కంటే పెద్దవారితో సంభావించేవాడు. వారి ఉపదేశాలను గ్రహించేవాడు. విద్యార్థులకు వాఙ్మయాభ్యాసము గల్గించుటలో చర్చలు ఎంతగానో ఉప యోగపడేవి.
శ్రీరాముడు విశ్వామిత్రుని వద్ద 55 రకముల అపూర్వ అస్త్రాల ప్రయోగ విధులను నేర్చుకున్నాడని రామాయ ణం తెలిపింది. రాముడు స్వయం వరంలో సీతను భార్యగా పొందిన పిదప కూడా విద్యను కొనసాగించాడు. చతుర్విధ పురుషార్థాల తత్త్వములను ఎరిగినవాడు. లోకాచారాలనూ, సత్పురుషుల వార్తాలాపాలు- విద్వాంసుల సత్సాంగత్యము- శాస్త్ర చర్చలు ఇవన్నీ బాగా తెలుసు. ధనుర్వేదంలో పండి తుడు. క్షాత్ర ధర్మం పట్ల విశ్వాసంగలవాడు. రాజ్యాంగంలో ఆదాయ వ్యయా లను గుర్తించి మెలగేవాడు. శాంత చిత్తం కలవాడు. ప్రియవచనాలు పలికేవాడు. వనవాస కాలంలో రాముడు ఎన్నో ఆశ్రమాలకు చేరి, అగస్త్యుని ఆశ్రమంలో కొన్ని అస్త్రాల వైదిక ప్రయోగ రీతులను నేర్చినాడు. వాల్మీకి తన కావ్యనాయకుని ఉత్తమగుణ సంపన్నునిగా చిత్రీకరించాడు. ఆదర్శ పురుషునిగా వర్ణించినాడు. దీర్ఘకాల విద్యాభ్యాసంలో అభ్యున్నతి పొందినాడు.
ఆ కాలంలో విద్య మొదటి ఉద్దేశ్యము శారీరక శక్తిని పెంపొందించుకోవడం. ఆరోగ్యం- బలం లేనప్పుడు కర్తవ్య పాలనము జరుగుట కష్టము. విద్య రెండవ ఉద్దేశ్యము విద్యార్థులకు ఒకే విషయమును బోధించుటయేకాక పలు శాస్త్రము లు విపుల జ్ఞానమునకు కలిగించుట కూడా కలదు. ఎక్కువ విషయములను పఠించుట నిజమైన విద్యార్థికి, విద్యావంతులకు గీటురాయి. సమగ్రమైన శిక్షణ నిజమైన విద్యగా భావించబడేది. అభ్యుదయ భావాలను కూడా వ్యక్తపరచుటకు అవకాశమును కల్పించుటే ఉత్తమ విద్య లక్షణము.
భారతీయ విద్యలో ఆత్మ సంయమము ద్వారా లభించే ధీరత్వం గంభీరత లకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. రామాయణ కాలంలో విద్యలోని వైశిష్ట్యం- ఆదర్శములు సమానంగా ఉండేవి. ఒడిదుడుకులు లేని సంఘ వ్యవస్థలో రాజు లు ఉత్తమ నాగరికతకు అవకాశం కల్పించేవారు. ఇవన్నియునూ సాంస్కృతిక విద్యా వరప్రసాదాలు. వినయమనే శపథం ద్వారా ఆత్మ సంయమము కలిగేది. దశరధుని మంత్రి విద్యావినీతుడై ప్రసిద్ధికెక్కినాడు. విద్యచేత వినమ్రుడైనాడని ఆంజనేయుని గురించి సీతకు రాముడు పరిచయం చేశాడు.
విద్యార్జన ఆ రోజులలో ఆరోగ్యకరంగానూ, కమనీయంగాను ప్రేమను కల్గించునదిగాను ఉండేది. విద్యలో సౌశీల్యము- విధేయత మున్నగు గుణ ములు అలవరచుకోవాలని రాముడు సోదరుడై భరతునికి వివరించాడు.
ఏదిఏమైనా రామాయణ కాలంలో విద్యాపద్ధతులు సర్వతోముఖ వికాసం కల్గించే రీతులలో విశిష్టతను సంతరించుకున్నాయి. భవిష్యత్‌ యుగాలకు ఆదర్శప్రాయమై అలరారినవి. ఆనాటి విద్య జీవితాన్ని తీర్చిదిద్దుకోగల లోకజ్ఞానాన్ని సంపాదించి పెట్టాయని ఆర్యుల సదభిప్రాయం. ”విద్యాదదాతి వినయం” అని కదా ఆర్యోక్తి.

Advertisement

తాజా వార్తలు

Advertisement