Friday, March 29, 2024

ఒడిశాలోనూ రాజశ్యామల మందిరం

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: భారతదేశంలో మరో రాజశ్యామల అమ్మవారి ఆలయం నిర్మాణం కాబొతోంది. ఒడిశా రాష్ట్రం జర్సుగూడలో ఈ మేరకు నూతన రాజ శ్యామల మందిరాన్ని ఏర్పాటు- చేస్తున్నారు. జర్సుగూడలోని సువిశాల ప్రాంగణంలో మందిర నిర్మాణానికి విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూ పానందేంద్ర సరస్వతీ స్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి భూమిపూజ నిర్వహించారు. ఒడిశా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నభాకిషోర్‌ దాస్‌ ఆధ్వర్యంలో ఈ పూజా కార్య క్రమం నిర్వహించారు. మంత్రి కిషోర్‌ దాస్‌ చాలాకా లంగా విశాఖ శారదా పీఠాధిపతులకు శిష్యులు, పీఠంలో కొలువుదీ రిన రాజశ్యామల అమ్మవారి భక్తులు. రాజశ్యామల అమ్మ వారి ఆరాధనతో శుభం చేకూరుతుందని మంత్రి కిషోర్‌ దాస్‌కు అత్యంత విశ్వాసం. దీంతో ఒడిశా రాష్ట్ర ప్రజలకు రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం ఉండాలని సంక ల్పించి మంత్రి జర్సుగూడలో ఆలయ నిర్మాణం చేపట్టారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి చేతులమీదుగా నిర్మాణం ప్రారంభించాలని ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ జగన్మాతగా కీర్తించబడుతున్న రాజశ్యామల అమ్మవారు శక్తిసంపన్నులుగా అభివర్ణించా రు. భారతదేశంలోనే రాజశ్యామల అమ్మవారి తొలి ఆల యం విశాఖ శారదాపీఠంలోనే ఉందని తెలిపారు. ఆ తర్వాత ఒడిశా రాష్ట్రంలో జర్సుగూడలో ఏర్పాటవుతోందని అన్నారు. అమ్మవారి ఆరాధనతో తెలుగు రాష్ట్రాల్ల్రో ప్రభు త్వాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఒడిశా ప్రజల సంక్షేమాన్ని కాంక్షి స్తూ ప్రతి ఏటా జర్సుగూడ వేదికగా రాజశ్యామల అమ్మ వారి యాగం చేపడతామని ప్రకటించారు. విశాఖ శారదా పీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సేవా రంగం లోనూ ముందుంటు-ందని, ఒడిశాలో నిరుపేదలకు ఉచిత ఆరోగ్య సేవలందించేందుకు మంత్రి నభా కిషోర్‌దాస్‌ భాగ స్వామ్యంతో ఆసుపత్రి నిర్మించే ప్రతిపాదన ఉందన్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం ఒడిశానలు మూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు జర్సుగూడ తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement