Monday, October 7, 2024

రాధాకృష్ణుల నృత్య నిలయం నిధివన్‌

మన దేశం అనేక అపూర్వ ఆలయాలు, లెక్క లేననన్ని ధార్మిక పర్యాటక ప్రాంతాల నిల యం. వాటిలో అనేకం అటు శాస్త్రజ్ఞులకు ఇటు ఆధ్యా త్మికవేత్తలకు అంతుచిక్కని రహస్యాలుగా నేటికీ మిగి లిపోయాయి. వీటి మర్మాలను ఛేదించాలని చాలా మంది తమ జీవితకాలం వెచ్చించినా ప్రయోజ నం లేకుండాపోయింది. ఈ క్రమంలో మరికొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది మతిస్థిమితం కోల్పోయారు అని చెప్పేందుకు ఎన్నో దృష్టాంతాలు.
అలాంటి రహస్యమైన అపురూప మహత్యం కలి గిందే ఉత్తరప్రదేశ్‌లోని మధురలోనున్న ‘నిధివన్‌.’ ఇక్కడ రాత్రి పూట జరిగే వింతలు ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతచిక్కని రహస్యాలు గానే మిగిలిపోయాయి. ద్వాపరయుగం రాధాకృష్ణల తో ముడిపడి ఉంది. శ్రీకృష్ణుడు ప్రతిరోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారని, రాధాకృష్ణు లు గోపికలతో కలిసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుం టారని స్థానికులు చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు ఈ నిధివన్‌ చుట్టూ అదృశ్య రూపంలో కాపా లా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని స్థల పురాణం పేర్కొంటోంది. అందుకే ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెం టనే మూసివేస్తారు. అంతేకాకుండా నిధివన్‌కు ప్రవే శించే ద్వారాన్ని కూడా మూసి తాళం వేస్తారు. రాత్రి సమయంలో ఇక్కడకు మనుషులే కాదు, కనీసం ఆలయపైకి , వనంలోని వృక్షాలపైకి పక్షులు కూడా చేరవు. అంతేకాదు ఉదయం నుండి వందల సంఖ్యలో ఉండే కోతులు సాయంత్రం ఒక్కటీ కనిపించదు.
పొరపాటున ఎవరైనా రాధామాధవ్‌లు చేసే ఈ నాట్యాన్ని చూస్తే చనిపోతారని లేదా మతిస్థిమితం కోల్పోతారని అక్కడి ప్రజల విశ్వాసం. అంతేకాకుండా ఆ నిధివనానికి ఎదురుగా వాకిళ్లు వచ్చేలా ఇళ్ల నిర్మాణా లు కూడా చేపట్టరు మధురలో. ఇక రాత్రి సమయంలో ఆ వనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోని వారు వనం వైపు ఉన్న కిటికీలనూ మూసివేస్తారు భయభక్తులతో.
అయితే రాత్రి సమయంలో పిల్లనిగోవి వాయిస్తు న్న శబ్దంతోపాటు స్త్రీమూర్తుల కాళ్ళ పట్టీల వినసొంపై న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ మొక్కల కాండాలన్నీ ఒకే లాగా ఉంటాయి. ఇక భూమి పై ఒక్క చుక్క నీరులేక పోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రి పూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటా రని మరో కథనం చెబుతారు స్థానికులు.
నిధివనం మధ్యలో ఉన్న రంగమహల్‌లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపు తారని పూజారులు వివరిస్తారు అందువల్లే రాత్రి ఆల య ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, కొన్ని తీపి పదార్థాలు, తాంబూలం, పళ్లు తోముకోవడానికి రెండు వేపపుళ్ల లు, చీర, గాజులతో పాటు మరికొన్ని అలంకార వస్తు లు రంగమహల్‌లో ఉంచుతారు.
మరునాడు ఉదయం ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం నమిలి ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటు మంచం పై ఉన్న దుప్పట్లు కొంత చెదిరి ఉంటాయి. ఇక స్వీట్లు, పండ్లు సగం తిన్న ఆనవాళ్లు కనిపిస్తాయి. దీన్ని భక్తులు కూడా చూస్తారు. ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్న వాస్తవం.
ఇటీవల ఓ ఛానల్‌ వారు ఈ రహస్యం కనుగొనా లని ప్రయత్నించి విఫలమయ్యారట. ఇక్కడ వనంలో ఉన్న కొలనును విశాఖకుండ్‌ అని అంటారు. విశాఖ అనే గోపిక దప్పిక తీర్చడానికి కృష్ణుడు తన పిల్లనగోవి తో ఈ కొలనును సృష్టించారని చెబుతారు. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ఎక్కువ శాతం రాధాకృష్ణులవి కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement