Thursday, March 30, 2023

పూర్వజన్మ వాసనాఫలం

మనం పూర్తి స్పృహలో ఉండి చేసిన పనులు లేక కర్మలకు సంబంధిం చిన జ్ఞాపకాలు మనసులో ఉండిపోతాయి. జీవుల గత జన్మల కర్మ ల యొక్క సూక్ష్మ జ్ఞాపకాలే ”సంస్కారాలు” లేక ”వాసనలు” అనబ డతాయి. జాగ్రదవస్థలో ఏ కర్మ అయితే కావాలని చేస్తామో, దాని తాలూకు గుర్తులు మన మనస్సులో బలంగా నాటుకొంటా యి. అవే సంస్కారాలు. మనం చేసే కర్మలు కేవలం భౌతిక దేహానికే పరిమితం కావు. మనం చేసే పనులు, మన ఆలోచనలు, వినిన మాటలు, చూసిన విష యాలు, తిరిగే వాతావరణం, మనస్సుపై చెరగని ముద్ర వేస్తాయి. ఒక ప్రదేశా నికి మొదటిసారి వెళ్ళినా, ఆ ప్రదేశం తనకు ఎప్పటినుంచో తెలిసినట్టుగా, కొం దరు వ్యక్తులను మొదటిసారి చూసినా ఎప్పటినుండో పరిచయం ఉన్నవా రిలాగా కొన్ని ఘటనలు తనముందు గతంలోనే ఎప్పుడో జరిగినట్లుగా అనపిస్తుంటుంది. వేదాంత శాస్త్రం దీనిని ‘వాసన’ అని చెప్పింది. ఒక వస్త్రంలో కట్టిన ఇంగువ వాసన చాలాసేపు వరకు ఆ వస్త్రానికి అలాగే ఉంటుంది
ఆవిధంగానే మనస్సు దేనిని గట్టిగా పట్టుకొని ఉంటుందో ఆ ‘వాసనే’ అలవడుతుంది. మనకు గత జన్మలో ఉన్న మంచి లేక చెడు అలవాట్లే ‘సం స్కారాలు’గా లేదా ‘వాసన’లుగా ప్రస్తుత జన్మలో మనస్సును ప్రభావితం చేస్తాయి. మరణం దేహానికేగానీ ఆత్మకు కాదు కదా! కనుక జీవి మరణించాక ఆ జన్మలో చేసిన పనులు, జ్ఞాపకాల ఆలోచనలు, కోరికలు ఆత్మను పట్టుకొని, వాసనల రూపంలో మరొక దేహాన్ని చేరి కర్మఫలితాలను చూపుతాయి. పూర్వ జన్మల సంస్కారాలు మన మీద బలీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. గత జన్మలలోని మన అలవాట్లు, ఇష్టాయిష్టాలు ఈ జన్మలో మన ప్రవర్తనను, జీవి తాన్ని నియంత్రిస్తాయి. వాటిని వదిలించుకొని బయట పడడం కష్టం. జ్ఞానం పొందడమొకటే మార్గం.
జీవి కర్మ చేయక తప్పదు. కోరికను అనుసరించి కర్మ, కర్మననుసరించి కోరిక ఉంటుంది. కర్మ. ఫలం జీవికి అంటకూడదంటే అది నిష్కామ కర్మ అయి ఉండాలి. కర్మ చేయాలి కానీ, అది ప్రతిఫలాపేక్షతోనో, ఇంద్రియాలను తృప్తి పరచుకోవాలి అన్న తపనతోనో ఉండకూడదు. నిష్కామ కర్మలు చేస్తూ మనసును పరమాత్మ సన్నిధిలో నిశ్చలం చేసుకోగలిగితే పూర్వజన్మల వా సన లు సైతం దహంచుకుపోతాయి. ఆదిశంకరాచార్యులు తమ ”వివేక చూడామ ణి” గ్రంథంలో ఇలా అన్నారు.
”జ్ఞాతే వస్తున్యపి బలవతి వాసనానాది రేషా
కర్తాభోక్తాష్యహమితి దృఢాయా స్య సంసార హతు:
ప్రత్యగ్దష్ట్యాత్మని నివసత సావనేయా ప్రయత్నాత్‌
ముక్తిం ప్రాహుస్తదిహమునయో వాసనా తానవంయత్‌”. అంటే బ్రహ్మ పదార్థమైన ఆత్మ ఈ దేహానికి వ్యతిరిక్త మని తలచి, బ్రహ్మాత్మ భావనతో తెలిసి కొన్నప్పటికీ, అనాదిగా కొనసాగుతున్న పూర్వ జన్మ వాసనలు చాలా బలమై నవి. కనుక అవి నిశ్శేషంగా తొలగిపోవు. సంసార బంధానికి అవే మూల కార ణం. నేనే కర్తను, భోక్తను అనే కర్తత్వ భావన నశించనంత వరకూ వా సనా పరంపర కొనసాగుతూనే ఉంటుంది. లోకానికి శ్రీరామచంద్రుని ద్వారా ప్రసా దించాలని చేయబడిన తత్వజ్ఞాన బోధయే యోగవాశిష్ఠంగా పిలువబడు తోంది. అందులో ఇలా చెప్పబడింది. పూర్వజన్మ వాసనల నుండి బయట పడలేని మనము అవే సత్య మనుకొని జరామరణ చక్రంలోపడి పరిభ్రమిస్తు న్నాము. అందుకే వివేచనతో జ్ఞానము పొంది జన్మ సార్థకం చేసుకోవాలి. దానికి నిష్కామ కర్మ ఒక్కటే మార్గము.
శాస్త్రాధ్యయనం చేసినా, నిష్ఠగా కఠిన సాధనలు చేసినా, మనకు ఆత్మ సాక్షాత్కారం కలగడం లేదంటే కారణం మన బుద్ధికి పవిత్రత, శుద్ధత్వం, సూక్ష్మత్వం లేకపోవడం వలననే అనిపిస్తుంది. మనకు ఉన్న మలిన వాసనలు తొలగినప్పుడు బుద్ధికి శుద్ధత్వం కలుగుతుందంటారు విజ్ఞులు. ‘లోక వాసన’, ‘శాస్త్ర వాసన’, ‘దేహవాసన’లను ‘మలిన వాసన’లు అంటారు. ఇతరులు మనలను పొగడేలాగా, నిందించకుండా, తప్పులు పట్టకుండా ఉండేలాంటి పనులు మనం చేస్తూ ఉండాలి అనే భావంతో కర్మలు చేస్తూండటం లోకవా సన. అలా జరగాలంటే పరుల నిందాస్తుతులను పట్టించుకోకుండా, ఇతరుల హతం కోరి మాత్రమే మంచి పనులు చేస్తూండాలి.
శాస్త్ర వాసన అంటే అన్ని శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి పండితుడు అనిపించుకోవాలనే తపన కలిగి ఉండటం. చదివిన శాస్త్ర విషయాలను మన నం చేసుకొంటూ, శాస్త్ర చర్చలలో పాల్గొనటం అనే వ్యసనాన్ని పెద్దలు శాస్త్ర వాసన అన్నారు. వేదశాస్త్రాలలో నిర్దేశింపబడిన విధివిధానాలను నిష్ఠగా సాధన చేస్తూ కాలం గడపడం అనే ”అనుష్ఠాన వ్యసనం” అన్నమాట.
కర్మలనాచరించడం, వాటియందే శ్రద్ధ చూపడం అనే కర్మవ్యసనం కూడా, నిష్కామ భావం లోపించినప్పుడు, పునర్జన్మకు కారణమవుతుంది. ఎందుకంటే, శాస్త్ర వాసన మనలో దర్పాన్ని పెంచుతుంది. తత్త్వం తెలుసుకొనే వరకు శాస్త్రాలను మననం చేసుకొని, ఆచరించి, తర్వాత మౌనానికి, అంతర్ము ఖత్వానికి ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞులు అంటారు.
దేహాత్మ వాసన అంటే దేహాత్మ బుద్ధి. అంటే దేహమే నేను అనే భావన. దే#హ పోషణకు ప్రాధాన్యతనిచ్చి, అతిగా ఆహారం తీసుకోవడం, దేహ సౌంద ర్య పోషణకు అపరిమితమైన వ్యాయామాలు చేస్తూ, సుగంధ తైలాలు, వస్త్రా భరణాలు ధరించడం, పుణ్యం కోరి మాత్రమే పవిత్ర నదులలో స్నానాలు చేయడం, క్షేత్రాలుద్ధరించడం, దోష నివారణకు శౌచ ఆచమనాల ద్వారా పవిత్రతను సాధించాలనుకోవడం, అనేవి, పరిమితి దాటినప్పుడు అంతర్ము ఖులమై జ్ఞానం పొందడానికి ప్రతిబంధకం కావచ్చు. ఎందుకంటే ఈ సాధనలు నిష్కామంగా చేయ కపోతే పునర్జన్మ తప్పదుకదా!
ఈ మూడు రకాల వాసనలనూ సాధనతో తొలగించుకోవాలి. రజస్తమో వృత్తుల వలన, అంటే ఆ గుణాలతో కూడిన ఆలోచనల వలన, బుద్ధికి శుద్ధత, పవిత్రత, సూక్ష్మత్వం లభించవు. ఆలోచనలను ప్రయత్న పూర్వకంగా నిరోధిం చి, బుద్ధికి పదును పెట్టి, శుద్ధత సాధించడానికి యోగులు రెండు మార్గాలను నిర్దేశించారు. ఒకటి మనకు మనం దైవానికి సంపూర్ణంగా సమర్పించుకో వడం. రెండవది ఆత్మ విచారణ. ఆత్మజ్ఞానం పొందటానికి ఆ రెండే మార్గాలని శ్రీ రమణ మహర్షి చెప్పారు. రెండూ అంత సులభమైనవికావు. ప్రాణులు కర్మ లను ఎందుకు చేస్తాయి అనే ప్రశ్నకు భగవద్గీత ఇలా సమాధానం చెబుతుంది.
”సదృశం చేష్టతే స్వస్యా: ప్రకతే: జ్ఞాన వానపి
ప్రకృతిం యాంతిభూతాని నిగ్ర హ: కిం కరిష్యతి” (గీత- 3 అ- 33 శ్లో). సమస్త ప్రాణులు తమ స్వభావానికి లోబడి కర్మలు చేస్తుంటాయి. జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించే క్రియలు ఆచరిస్తాడు. ఎవరైనా కావాలని కర్మలను చేయకుండా ఎలా వదిలేస్తారు? అని అర్థం. మన ఆలోచనా విధానాన్ని బట్టే మనం చేసే పనులుంటాయి. మనం గత జన్మలలో, ఈ జన్మలో కూడా పొం దిన అనుభవాల ఆధారంగా కర్మలు చేస్తాము. పూర్వ జన్మల సంస్కారాలు మనలను మారనీకుండా అడ్డుపడుతుంటాయి. తేలుకు కుట్టే స్వభావం, పాముకు కాటువేసే నైజం సహజంగా ఉంటుంది. అలా వేటి స్వభావం వాటికి ఉంటుంది. అలా అని ‘నేను మారను’ అని కూర్చుంటే కష్టపడేది మనమే. జ్ఞానులు కర్మలు చేస్తున్నట్లు కన్పించినా వారికి ఆ కర్మ సంస్కారములతో ఎలాంటి సంబంధం ఉండదు. లోకహతం కోసమే వారు ఏ పనైనా చేస్తారు. వారికి కర్తృత్వ భావన ఉండదు. అందుకే వారికి కర్మబంధం ఉండదు. మనం కూడా లోకహతమైన పనులు చేస్తూ, దైవంపై నమ్మ కముంచి, జీవిస్తూ ఉంటే సత్యాన్ని తమ బోధతో ఎరుక పర చగల గురువులు తారసపడతారు గురు కటాక్షంతో సత్యం అనుభవంలోకి వస్తే కర్మ బంధం నుంచి విముక్తి లభిస్తుంది అని పెద్దల మాట.

Advertisement

తాజా వార్తలు

Advertisement