Friday, December 1, 2023

పరమాత్మ వైపుగా…

నిద్రలేస్తూండగానే సాధారణంగా మన చూపు గోడకు వ్రేలాడుతున్న పర మాత్మ వైపు వెడుతుంది. ఎందుకంటే రోజంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కార్యసిద్ధి కలగాలనే సదుద్ధేశ్యంతో. విద్యార్థి సంవత్సరం అంతా జ్ఞానాన్ని బుర్రకెక్కించుకొన్నా, తనపై తనకు విశ్వాసం ఉన్నా, పరీక్షలకు వెళ్ళే ముం దు. భగవంతుని ఆలయాన్ని దర్శించకుండా ఉండలేడు. చివరకు. శ్రీహరి కోట లోని, తిరువనంతపురంలోని అంతరిక్షపరీక్షా కేంద్రాల శాస్త్రవేత్తలు కూడా, ఉప గ్రహ ప్రయోగాల ముందు దగ్గరగా ఉన్న దేవాలయాల్లో పూజలు చేస్తూండడం మనం గమనిస్తున్నాం. అయితే, ప్రతీ వారికి తమ సామర్ధ్యం తెలుసున్నా, ఎందు కు మనం చూపులన్నీ పరమాత్మ వైపు ఉంటున్నాయి? అంటే మనల్ని నడిపిస్తున్న శక్తి ఏదో కనపడకుండా ఉందని తెలుస్తోంది కదా!
అందుకే ఏమో? 1971 సం.రం.లోనే ఆచార్య ఆత్రేయ ”కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం. ఆ నాటకాన నువ్వు- నేను ఆటబొమ్మలం, కీలుబొమ్మలం” అంటూ భగవంతునికి మనకు మధ్య ఉన్న జీవన వేదం ఒక పాటలో గుమ్మరించా రు. అలాగే గాంధీ మహాత్ముడు ”హర్‌ ఏక్‌ ఆద్మీకో ప్రార్థనా కర్‌ నేకీ ఆవశ్యకతా హ!” అన్నారు. అంటే ప్రతీ మనిషికి ప్రార్థన అవసరం. దానివల్ల మనసు నిర్మలత్వా నికి, కర్తవ్య సాధనకు భగవంతుని ఆశీస్సులు అవసరం అని. ఎలాగంటే ఏడుస్తున్న పిల్లవాడికి బొమ్మలతోబాటు, అమ్మ కూడ అవసరమైనట్లే. అయితే ”పరమాత్మ” ఎవరు? అని సందేహం కలుగుతుంది.

- Advertisement -
   

పరమాత్మ స్వరూపం
ఒక సంస్థను నిర్వహించాలంటే ఒక నాయకుడు (యజమాని) ఉండాలి. అలాగే సృష్టిలోని అన్ని భూతాలను నడుపుతున్న శక్తే పరమాత్మ. ఆ పరమాత్మ ఆత్మ రూపంలో నీలో, నాలో కొలువై ఉండి, మనలను చైతన్య పరుస్తున్న శక్తే పరమాత్మ. మనం జీవించినంత కాలం బంధాలు అనుబంధాలు పెంచుకొంటూ, మోహావేశం లో జీవించి, ఆఖరుకు శ్మశానం విగతుడుగా చేరిన సమయంలో ”నీకు తోడుగా నేను ఉన్నాను. నీ బంధువులు వదిలేసినా, ధైర్యం చెప్పే శక్తే పరమాత్మ. భగవంతుని సాక్షిగా అంటుంటాం. ఆయన మనం చేసే ప్రతీ పనికి సాక్షిగా ఎలా ఉంటాడు? అంటే సర్వ వ్యాపకమైన పరమాత్మ స్వరూపం (తత్త్వం) మనలో అంతర్గతంగా ఉండబట్టే సాక్షి అని గొప్పగా చెప్పుకొంటుంటాము.
విష్ణు సహస్రనామాల్లో ”విష్ణుం విష్ణుషట్కారో భూత భవ్య ప్రభు:” అంటూ శ్లోకం ఉంది. మన జీవన సాఫల్యతకు, లక్ష్య సాధనకు ఆ భగవంతుని కృప, దయ అవసరం. ఈ జీవన గమ్యంలో ఎన్నో సుఖాలు ఎన్నో దు:ఖాలు కలుగుతుంటాయి. ఈ సుఖ దు:ఖాలనేవి మనసుకు సంబంధించినవే. అంటే మనస్సే ప్రేరేపితమవు తుంది. ప్రతీవారు సుఖమే కావాలని ఆశిస్తూంటారు. దు:ఖం ఎవరూ కోరుకోరు కదా! దు:ఖం కాని, కష్టం కాన సంభవించిన సందర్భంలోను, ప్రతికూల పరిస్థి తుల్లో మనకు పరమాత్మ కనపడతాడు. భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ సుఖ దు:ఖా ల గురించి చెపుతూ ఆ రెండింటిని సమానంగా భావించేవారు స్థిత ప్రజ్ఞులంటారని వివరించారు. ”సుఖస్యానంతరం దు:ఖం, దు:ఖ స్యానంతరం సుఖం
ద్వయమే తద్ది జంతూనా మలం ఘ్యం దివరాత్రి వత్‌|”
రాత్రి పగలు ఎలా ఏర్పడతాయో, అదేవిధంగా సుఖదు:ఖాలు రెండు కూడా ఒకదాని తరువాత మరోటి సంభవిస్తుంటాయి. ఇదంతా మనం ఎన్నో జన్మల నుండి చేస్తూ వస్తున్న కర్మల ఫలితమే. అందుకే ఆది శంకరాచార్య తమ ఆత్మబోధలో ”సుఖదు:ఖాలు ఒకదానికొకటి పొసగకుండా, విరుద్ధంగా ఉంటూ, కలుషితమైన ఈ సంసారం లేక ప్రపంచం కల లాంటిది. సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తాడో, అపుడు ఇవన్నీ అసత్యాలే!” అని తెలుసుకొంటాడు. అయితే వీటినుండి బయట పడాలంటే మార్గాలు ఉన్నాయి. అవే ఆధ్యాత్మిక చింతన. నిర్గుణోపాశన. వాటి గురించి తెలుసు కుందాం.

ఆధ్యాత్మిక చింతన

తల్లి తన నలుగురి బిడ్డల ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని అందిస్తుంది. ఆ విధంగానే మన పరిస్థితులు బట్టి, మనం చేసుకున్న కర్మలు ఆధారం గానే, మనలోని వ్యాకులతను గమనించి పరమాత్మ ఫలితాలు అందిస్తాడు. ”సర్వ కర్మాఖిలం పార్థజ్ఞానే పరి సమాప్యతే” అంటే రాగద్వేషాలు ఎప్పుడైతే తగ్గిపోతా యో, అపుడు అంతరంగం సుఖ సంతోషాల వైపు, పరిగెడుతుంది.
దీనికి మనకు ఆధ్యాత్మిక చింతన అంటే భగవంతుని నామం ఉచ్చరించడం, నిత్యానుష్టానం త్రికరణ శుద్ధిగా చేయడం, భగవంతునిపై ప్రేమను పెంచుకోవడం, శరణాగతి పొందడం చేయడమే. విత్తనం నాటిన తర్వాత రైతు అంకితభావంతో పని చేసిన విధంగా, చిన్నప్పట్నుంచీ, ఆధ్యాత్మిక భావన కలిగించాలి.

నిర్గుణోపాశనం

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పరమాత్మ సగుణ రూపాన్ని పూజించాలా? నిర్గుణ (నిరాకార) రూపాన్ని ఆరాధించాలా? అనే ప్రశ్న వచ్చే ఉంటుంది. ఈ ప్రశ్న ఎటువంటిదంటే మన దొడ్లోని బావిలో నీరు మంచిదా? గ్రామ పొలిమేరలో వెడుతున్న నది నీరు మంచిదా? అన్నట్లుంది. పరిశుభ్రమైన జలం ఏదైనా ఒక్కటే దాహం తీర్చడానికి. అలాగే పరిశుభ్రమైన మనసుతో ప్రేమా త్మను ఆరాధించడం ముఖ్యం. భగవద్గీతలో కష్ణ పరమాత్మ ఏ ఉపాసన చేసినా భగ వంతుని కృప ఉంటుంది అని చెప్పాడు. ఉపాసనలో మనసు లగ్నం చేయాలి. మనం మన ఇంద్రియాలను నియంత్రించాలి. సాధన ద్వారా మాత్రమే ఇది సాధ్య మవుతుంది. పిల్లవానికి అక్షరాలు నేర్వడానికి సాధన ఎంత ముఖ్యమో, అంతే సాధ న భక్తులకు అవసరం. శత్రువులు మనలను వెంబడిస్తుంటే తొందరగా వదలనట్లే మనలోని అంతర్గత శత్రువులు పట్ల జాగ్రత్త అవసరం. కాబట్టి మనం ఆశించిన విధంగా సుఖమే పొందాలని అనుకొన్నప్పుడు, అంతర్గత శత్రువులు పట్ల అప్రమత్త తతో ఉంటూ మనం మన దృష్టిని పరమాత్మ వైపు ఉంచి ముందుకుసాగాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement