Saturday, November 26, 2022

పరమశివుని అరుదైన రూపం

తమిళనాట విల్లుపురం జిల్లా. ఆ జిల్లాలో తిరు వక్కరై అనే చిన్న గ్రామం. అవడానికి చాలా చిన్న ఊరే! కానీ ఆ ఊరిలో ఉన్న చంద్రమౌళీశ్వరుని ఆ లయం చాలా ప్రసిద్ధమైంది. పరమశివుడు అత్యంత అరుదైన రూపంగా చెప్పుకునే ముఖలింగం వుంటుం ది. తిరువక్కురైలో వరాహ నదీతీరాన వెలసిన చంద్ర మౌళీశ్వరుడు గురించి రెండువేల సంవత్సరాల నుంచే గాథలు ప్రచారంలో ఉన్నాయి.
తమిళనాట ప్రముఖ శైవభక్తులైన నయనార్ల రాత లలో ఈ స్వామివారి గురించి ప్రసక్తి కనిపిస్తుంది. వైష్ణవు లకు 108 దివ్యదేశాలు ఎలా ఉన్నాయో… నయనార్ల పద్యాలను అనుసరించి శైవులు 275 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిని ‘పాడల్‌ పెట్ర స్థలం’ (పాటలలో పేర్కొ న్న స్థలాలు) అంటారు. వాటిలో తిరువక్కరై ఆలయం ఒకటి!
ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆలయాన్ని 9వ శతాబ్దంలో ఆదిత్యుడనే చోళరాజు నిర్మించినట్లు తెలుస్తోంది.
ఏడంతస్తుల రాజగోపురంతో విశాలమైన ఈ ఆల యంలో అడుగడుగునా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడి ఈశ్వరుడిని చంద్రమౌళీశ్వరుడనే పేరుతో కొలుస్తారు. లింగ రూపంలో వెలసిన ఆ పరమ శివుడు మూడు ముఖాలను కలిగి ఉంటారు. లింగం అ రుదైన త్రిమూర్తుల రూపంలో ఉంటుంది. తూర్పువై పున ఉన్న ముఖాన్ని తత్పురుష లింగం అనీ, ఉత్తరం వైపుగా ఉన్న లింగాన్ని వామదేవ లింగమనీ, దక్షిణం వైపుగా చూసే ముఖాన్ని అఘోర లింగమనీ పిలుస్తారు.
ఈ ఆలయంలోని చంద్రమౌళీశ్వరుని దర్శించుకొ వడమే ఓ అద్భుతమైతే… ఆలయంలో విష్ణుమూర్తి, ఆదిపరాశక్తికి ప్రతిరూపమైన కాళికా అమ్మవార్లకు కూడా ఉపాలయాలు ఉండటం మరో విశేషం. ఒకప్పు డు వక్రాసురుడనే రాక్షసుడు ముల్లోకాలనూ పీడించ సాగాడు. ఆయన శివభక్తుడు కావడంతో, తన చేతులతో అతనిని వధించలేననీ… వెళ్లి విష్ణుమూర్తినే అర్థించమని పరమేశ్వరుడు చెప్పాడు. అంతట విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ వక్రాసురుని వధించాడు. అందుకే ఇక్కడి ఆలయంలోని విష్ణుమూర్తి విగ్రహం ‘ప్రయోగ చక్ర’ అనే భంగిమలో కనిపిస్తుంది. అంటే సుదర్శన చక్రాన్ని సంధిస్తున్న భంగిమలో విష్ణుభగవానుడు ఉంటాడు.
విష్ణుమూర్తి వక్రాసురుని వధించే సమయంలో ఆ రాక్షసుని నెత్తురు నేల మీద పడినప్పుడల్లా… ప్రతి రక్తపు బొట్టు నుంచీ వేలమంది రాక్షసులు పుట్టుకురాసాగారు. దాంతో వక్రాసురుని రక్తం నేల మీద పడకుండా తన నాలికతోనే దాన్ని ఒడిసిపట్టేందుకు కాళికా అమ్మవారు అక్కడకు చేరుకున్నారు. అంతేకాదు! వక్రాసురుని చెల్లె లైన దున్ముఖి అనే రాక్షసిని కూడా వధించారు. దాంతో ఇక్కడి కాళికా అమ్మవారికి ‘వక్రకాళి’ అన్న పేరు స్థిరప డింది. ఈ వక్రకాళి అమ్మవారి ఉగ్రతత్వాన్ని శాంతింప చేసేందుకు ఆదిశంకరులు అమ్మవారి కాలికింది శ్రీచ క్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు.
అటు శివుడు, ఇటు విష్ణుమూర్తి… వారికి తోడుగా కాళికా అమ్మవారు. ఇంతమంది కొలువైన ఆలయం కనుకనే ఈ చంద్రమౌళీశ్వర ఆలయాన్ని దర్శించేందు కు భక్తులు ఉబలాటపడుతూ ఉంటారు. ముఖ్యంగా శి వరాత్రి, విజయదశమి, కార్తిక పౌర్ణమి, చైత్ర పౌర్ణమి వంటి సందర్భాలలో అయితే వేలమంది భక్తులతో ఈ చిన్న గ్రామం కిటికిటలాడిపోతుంటుంది. ఇక ప్రత్యే కంగా ఇక్కడి వక్రకాళి అమ్మవారిని దర్శించేందుకు వ చ్చే భక్తులకు కొదవ ఉండదు. శని వక్రదశలో ఉన్నప్పు డు ఈ అమ్మవారిని కనుక కొలిస్తే ఉపశమనం లభిస్తుం దని చెబుతారు. అంతేకాదు! ఈ అమ్మవారి ఆశీస్సులు కనుక ఉంటే ఎంతటి శత్రువునైనా జయించవచ్చని, ఎలాంటి ఆపదనైనా దాటవచ్చని తమిళనాట నమ్మ కం. అందుకనే రాజకీయ నాయకులు ఇక్కడికి తరచూ వస్తుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement