Saturday, April 20, 2024

పరమ పవిత్రం… వైకుంఠ ఏకాదశి పర్వదినం

ధనుర్మాసము సౌరమానము యొక్క ప్రామాణికాను సారము కాగా, శుక్ల ఏకాదశి చాంద్రమానమైన తిథి. ప్రతి మాసమునందలి ఏకాదశులు ఎంతో పవిత్రమై నవి. ”గృహస్థో బ్రహ్మచారీ చ ఆహతాగ్నిస్థ థైవచ; ఏకాద శ్యాంశ భుంజిత పక్షయోరు భయోరపి” అని అగ్ని పురాణాదు లు వివరిస్తున్నాయి. గృహస్తులకు, బ్రహ్మచారులకు, నిత్యా గ్నిహోత్రులకు నైమిత్తిక కర్మగా ఉపవాసాద్యాచరణము విధించ బడినది. ఇట్టి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన దివ సము కావునే ఏకాదశి హరి వాసరముగా కొనియాడబడు చున్నది. అందు సౌరమానము నందలి ప్రశస్తమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశి (మార్గశీర్షము లేక పుష్య మాసం) ”వైకుంఠ ఏకాదశి”గా పిలువబడుచున్నది. సూర్య చంద్రులు నేత్రములుగా కలిగిన వైకుంఠ వాసునుకి సౌర, చాంద్రమానాలలో ప్రశస్తమైన ధనుర్మా శుక్ల పక్ష ఏకాదశి అత్యంత ప్రీతికరము.
”ధనూరాశి స్థితే సూర్యే శుక్ల ఏకాదశి తిథౌ; త్రింషత్‌ కోటి సురై: సాకం బ్రహ్మ వైకుంఠ మాగత; పాలస్త్యేనని పీడితా: సురగణా: వైకుంఠలోకం యయు: బీ ద్వారే తత్ర విషాదభావ మనసా సూక్తైర్‌ హరిం తుష్టువు: శు్లక: శ్రీహరి వాసరే ప్రభాత సమయే భానౌ ధను: సంస్థితే, తేభ్యోదాత్‌ సుఖ దర్శనం కరుణయా నారాయణో మాధవ:” రావణుని బాధలను తాళ లేని దేవతలు బ్రహ్మను ఆశ్ర యింపగా… ఆ దేవు డు ధనుర్మాస శుక్ల ఏకాదశి దినమున దేవత లందరితో వైకుంఠమును చేరి, హరి వాసరమునందు దేవతలు విషాద భావ మన స్కులై శ్రీహరిని వేదోక్తంగా స్తుతించగా, వారికి శ్రీహరి సుఖ దర్శన మును కలుగజేసెనని వివరించబడినది. శ్రీప్రశ్న సంహత (ఐదవ అధ్యాయము) నందు గల ఐతిహ్యము ననుసరించి మధు కైటభు లను భగవానుడు సంహరించినపుడు వారు దివ్య రూప ధారులై దివ్య జ్ఞానము పొందగా, బ్రహ్మాదులె వరైనను నీలోక ము వంటి మందిరమును నిర్మించి, ఏకా దశి దినోత్సవమును గావించి, నీకు నమస్కరించి ఉత్తర ద్వార మార్గమున సమీపిం తురో, వారికి వైకుంఠ ప్రాప్తి కలుగునట్లు దీనిని మోక్ష ఉత్సవ దినముగా వరమిచ్చినట్లు తెలియుచున్నది. ముక్కోటి దేవతల బాధలను నివారించినందున ‘ముక్కోటి ఏకాదశి’గాను, వైకుంఠ దర్శన ము కలిగించునది కనుక ‘వైకుం ఠ ఏకాదశి’గాను, భగవద్దర్శ నము చేయు పవిత్ర దినమైనందున భగవదవలోక దివసము’గ కొనియాడబడుచున్నది.
ధనుర్మాస ఏకాదశి కొన్నిసార్లు మార్గశిర మాసమందు, మరికొన్నిసార్లు పుష్యమాస మందు రావడం చేత రెండు మాసా ల శుక్ల ఏకాదశులు ప్రశస్తములైనవే. మార్గశిరమాస ఏకాదశిని మోక్షైకాదశి అని, పుష్యమాస ఏకాదశిని పుత్రదైకా దశి, రైవత మన్వాది దినమని పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణు వునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వం తరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు ”వైకుంఠ:” (వైకుంఠుడు) అయ్యాడు. అదేకాక జీవులకు నియం త, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛా విహారాన్ని అణచేవాడు. సూర్యుడు ధనురాశిపై నుండగా వచ్చిన తొలి ఏకాదశి (వైకుంఠ) పుణ్యదినాన తన దివ్యమంగళ రూపంతో వైకుంఠ ద్వారంవద్ద దేవతలకు శ్రీమహావిష్ణువు దివ్యదర్శనం గావించిన సందర్భంగా, కోటి తేజోమూర్తిని దర్శించిన బ్రహాదిదేవతలు, సనక సనందాది మునులు, ‘పశ్యన్‌ నిముష మాత్రేన కోటి యజ్ఞం ఫలం లభేత్‌’ అని వచించినట్లు బ్రహాండ పురాణంలో వర్ణించబడింది. ఈ పవిత్ర దినాన వైష్ణవ సంబంధ ఆలయాలలో, ఉత్తర ద్వారం వద్ద సూర్యోదయానికి పూర్వమే స్వామి దర్శనం చేసుకోవడం అనాదిగా ఆచరిస్తున్న సత్సాంప్రదాయం.

  • రామ కిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement