Friday, October 11, 2024

పరమ పావన క్షేత్రం… అరుణాచలం

శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణా చలం. శివునికి అంకితం చేయబడిన ముఖ్యమైన శైవ దేవాలయం అరుణాచల దేవాలయం. తమిళనాడులోని తిరు వణ్ణామలైలో ఉన్న ఈ ఆలయం పంచభూత స్థలం. (ప్రకృతి లోని అయిదు అంశాలకు అంకితం చేయబడిన ఐదు శివాల యాల)కు చెందినది. అధిష్టానం అగ్నిలింగం (అగ్ని మూలకం) రూపంలో ఉంటుంది. అరుణాచలం అనగా అరుణ- ఎర్రని, అచలము- కొండ- ఎర్రని కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్థము. అరుణాచలం చాలా గొప్ప పుణ్యక్షేత్రం. వేద, పురాణాలలో కొనియాడబడిన
క్షేత్రము.
అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మిం పబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురము నిర్మింపబడిన దనీ అరుణాలచల మహాత్మ్యం తెలుపుతున్నది. స్మరణ మాత్ర ము చేతనే ముక్తినొసగే క్షేత్రము. అందుకే ఒక్కసారి అరుణా చలంలో ప్రవేశించిన తర్వాత… పాటించవలసిన నియమాల ను చెబుతారు. మౌనం పాటించాలని, మాట్లాడితే మనసు శివుని మీద ఉండదని, శివ నామస్మరణ చేస్తూనే వుండాలని, లేదంటే నాలుకకు హద్దు ఉండదని చెబుతారు. శివునిమీద మనసు నిలవాలంటే అరుణాచలంలో వీలైనంత వరకు మితా హారం తీసుకోవాలి. శివుడు మనతోనే వుండాలంటే సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌చేయాలి. అరుణాచలంలో శివుడే సుప్రీమ్‌. అందుకే అక్కడ ఎవరూ తమ దర్పాన్ని చూపించకూడదు.

కోరికలు దగ్ధం చేసే అరుణాచలంలో…. శారీరక కోరికల ను తీర్చుకోకూడదు. మోక్షానికి దగ్గర కావడానికి వీలైతే అన్నదానం చెెయాలని అంటారు.
అరుణాచల క్షేత్రంలో ఎవరిని దూషించకూడదు. అక్కడ శివపార్వతులు సిద్ధుల రూపంలో… సాధారణ రూపంలో మన మధ్యలోనే వుంటారు.
తప్పదు కాబట్టి.. బస చేసిన హోటల్‌ రూమ్‌లో తప్ప… అరుణాచల క్షేత్రంలో ఎక్కడా.. ఉమ్మి వెయ్యకండి, మూత్ర మల విసర్జన చేయకూడదు. అరుణాచలం సాక్షాత్తూ శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం. ఆయనకు అసౌకర్యం కలి గించకూడదు. సాధారణ పుణ్యక్షేత్రంలా… కేవలందర్శనం నిమి త్తం అరుణాచలం వెళ్ళకూడదు. ఇది పరమ పావన ఆవిర్భావ అగ్నిలింగ క్షేత్రం. మనసా వాచా కర్మణానా శివ స్పృ#హతో చేసే యాత్ర… ఒక్కసారి అర్హతతో కూడిన అరుణాచల దర్శనం చెయ్యగలిగితే… ఇక మరొక జన్మ ఉండదు!
గిరిప్రదక్షిణ ఎలాచేయాలి?

మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజించదగిన సమ యం- అరుణాచల ప్రవేశం. ఇందులో శివ స్పృహతో, నియమ నిష్టలతో గిరి ప్రదక్షిణ చెయ్యడం అనేది, కేవలం పుణ్య కార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహా ఘ ట్టం అవుతుంది.పున్నమినాటి రాత్రి గిరి ప్రదక్షిణ అత్యం పుణ్య ప్రదమని, గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సం పూర్ణం అవుతుందని మర్చిపోకూడదు. అరుణాచలంలో ఉన్నం తసేపు మరియు గిరి ప్రదక్షిణలో అనుక్షణం అందరూ గిరి వైపు చూస్తూ శివ నామస్మరణ చేస్తూనే ఉండాలి. అది కేవలం కొండ కాదు. ఆ కొండ మొత్తం యోగనిద్రలో దక్షిణామూర్తి స్వరూ పంలో నంది, గౌరీ, గణశా, కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చుని ఉన్న ఆ మహాశివుడే ఆ అరుణ గిరి (అరుణ గిరి వాడుకలో తిరువణ్ణామలై అయినది. తిరు అరుణ-మలై తిరు వణ్ణామలైగా మారింది.)
గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక చింతనతో చేయాలి. కాళ్ళకు చెప్పులు లేకుండా చేయాలి. సాయంత్రం నుంచి ఏసమయంలో మొదలుపెట్టినా ఉదయం తొమ్మిదిగంటలలోపుగా పూర్తిచేయాలి. కాళ్ళకు చెప్పులు వేసుకోకూడదు. గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలామంది వారివారి వ్యాపార కు టుంబ, ఇతర అనుభవాల గురించి మాట్లాడుకుంటూ, నవ్వు కుంటూ, ఏవి పడితే అవి తింటూ, ఒక విహారయాత్రలాగా, నడుస్తున్న ఆ17 కిలో మీటర్లు ఎలా టైం పాస్‌ చెయ్యాలి అను కుంటూ, ఎన్ని లింగాలు పూర్తి అయ్యాయి, ఇంకా ఎంత దూరం వుంది, మరో గంటలో అయిపోతే హాయిగా పుణ్యం తో పాటు రూమ్‌ వెళ్లి, వెంటనే తిరుగు ప్రయాణం చేసి, రేపు వ్యాపారంలో లేదా వుద్యోగంలో ఏమేం పనులు చేసుకోవాలి అనుకుంటూ… ఇదే స్పృ#హతో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళను ఎక్కువమందిలో గమనించవచ్చు. అతికొద్ది మంది మాత్రమే మౌనంగా, శివనామ స్మరణతో తాదాత్మ్యం చెందుతూ, ప్రద క్షిణ చేస్తుండడం సులభంగా గమనించవచ్చు. తరువాతి యాత్రలో నైనా గిరి ప్రదక్షిణ చేసే విధానాన్ని మార్చుకుంటే ఆ యాత్ర ఫలం దక్కుతుందని మరవద్దు.
అరుణాచలంలో… దక్షిణా మూర్తిగా… స్థూల రూపంలో కొలువైయున్న ఆ మహా శివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏమి కోరుతారో ఆయనకి తెలియదు గాని… ఆయన మాత్రం ఒక్కటే కోరుతాడు…. భక్తి పేరు చెప్పినా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా…. మోసం చేసినా…. శివుని రుద్ర రూపం మీరు చూ స్తారు అని…అంటే నేనుఎంత కారుణ్యమూర్తినో…. అంతటి కఠి నాత్ముడను శిక్షల విషయంలో అని…. కనుక శివ దర్శనం కావాలి అంటే…. తొలుత శివ సమ్మతం సాధించండి.
అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి… మాహా ప్రభో… అని మన పూర్వ ఋషులు, మహర్షులు బ్రహ్మ ను, విష్ణువు, శివుని కోరినప్పుడు… వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి, ఎంతోమంది ఋషులు తిరిగి,, తిరిగి జన్మిస్తూనే వున్నారు…. కాశీలో మరణం కన్నా… అర్హత తో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలంలో వాన ప్రస్థాశ్ర మాన్ని గడిపారని… స్థాయిని, వేల కోట్లా ఆస్తులను వదిలి, ఇప్పటికీ అక్కడే గడుపుతున్నారు. అర్హత వుంటేనే అరుణాచ లేశ్వర యాత్ర పరిపూర్ణంగా చేయగలరు. అలా చేయగలిగితే తప్పకుండా శివుని అనుగ్రహం పొందినట్లే!

Advertisement

తాజా వార్తలు

Advertisement