Saturday, March 23, 2024

పంచాయుధాలు

శ్రీమన్నారాయణుని లీలావిభూతులు పంచాయుధా లు. వాటిలో మొదటి ఆయుధము అయిన శంఖం, రెండవ ఆయుధం అయిన చక్రం గురించి గతవారం తెలుసుకున్నాం. ఈవారం మిగిలిన మూడు ఆయుధాల గురించి తెలుసుకొందాం.
శ్రీ మహావిష్ణువు మూడవ ఆయుధమైన గద పేరు కౌమోదకి. ఇది వరుణుని చేత శ్రీకృష్ణునికి ఇవ్వబడింది అని మహాభారతం చెబుతోంది. ఈ గద ఉరుములు, మెరుపులు పుట్టించి, ఎటు వంటి గొప్ప యోధులనైనా సంహ రించే సామర్థ్యం కలిగినది. సాళ్వుడనే రాక్షసుని సంహరించే సందర్భంలో శ్రీకృష్ణుడు ఈ కౌమోదకిని ఉపయోగించినట్లు భాగవతంలోచెప్పబడింది. పూదత్తాళ్వార్‌ అనే సుప్రసిద్ధ వైష్ణవోత్తముడు ఈ కౌమోదకి అంశతోనే జన్మించారట.
”హరణ్మ యీం మేరు సమాన సారాం కౌమోదకీం దైత్యకులైక హం త్రీం

వైకుంఠ వామాగ్ర కరాగ్ర మృష్టాం గదాం సదాహం శరణం ప్రపద్యే.” బంగారు కాంతి కలిగి, మేరుపర్వతమం తటి శక్తితో విరాజిల్లుతూ, రాక్షస వంశ నిర్మూలనం చేయడా నికి శ్రీమన్నారాయణుని ఎడమచేతిలో నిత్య భూషితమై అలరారు కౌమోదకి అనే గదను నేను శరణు వేడుతున్నా ను” అంటూ పంచా యుధ స్తోత్రం ఈ ఆయుధాన్ని ప్రస్తుతించింది.
ఆ దేవదేవుని నాల్గవ ఆయుధం ఖడ్గం. దీనిని నంద కం అంటారు. నందకం అంటే ఆనందం కలిగించేది అని అర్థం. రాక్షసులను సంహరించి దేవతలకు ఆనందం కలి గించేది కనుక దీనికి ఆ పేరు కలిగింది. బ్రహ్మదేవుని తప స్సుకు భంగం కలిగించే లోహాసురుడనే రాక్షసుని నిరో ధించేందుకు బ్రహ్మ సృష్టించిన ఒక పురుష శక్తి నంద కంగా మారిందని, విష్ణువు దానిని ధరించి లోహాసురుని వధిం చాడని బ్రహ్మవైవర్త పురాణం చెప్పింది.

దీని ‘ఒర’ అజ్ఞానానికీ, కత్తి జ్ఞానానికీ చిహ్నాలు. అజ్ఞానం తొలగితేనే జ్ఞానం ప్రకా శిస్తుందని దీని అర్థం. పేయాళ్వార్‌, అన్న మాచార్యులు ఈ నందకాంశతో అవతరించారని ప్రతీతి. ”రక్షోసురాణాం కఠినోగ్ర కంఠచ్చే éదక్షరత్‌ క్షోణిత దిగ్ధసారామ్‌
తం నందకం నామ హరే: ప్రదీప్తం ఖడ్గం సదాహం శరణం ప్రపద్యే.”
”రాక్షసుల కఠినములైన కంఠాలను ఛేదించడం వలన శోణితా లంకృతమైన నందకమనే ఖడ్గాన్ని నేను శరణు వేడు తున్నాను అంటూ పంచాయుధ స్తోత్రంలో నందకం ప్రస్తుతించబడింది.
నారాయణుని పంచాయుధాలలో ఐదవది, చివరిదీ ధనుస్సు. బ్రహ్మచేత నిర్మితమైన ఈ ధనుస్సుకు శార్గ్ఞమని పేరు. కౌరవసభలో శ్రీకష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి నప్పుడు ఆయన చేతులలో ఒకదానిలో శార్గ్ఞ ధనుస్సు ఉందని మహాభారతం లో చెప్పబడింది.
చివరి ఆళ్వారైన తిరు మంగ యాళ్వారు ఈ శార్గ్ఞ అంశతో జన్మిం చారంటారు.
”యజ్జ్యా నినాద శ్రవణాతు రాణాం చేతాంసి నిర్ముక్త భయాని సద్య:
భవంతి దైత్యాశని బాణవ్షం: శార్గ్ఞం సదాహం శరణం ప్రపద్యే”.
”ఏ వింటినారి మ్రోతచేత దేవ తల మనసులలోని భయం తొలగి రాక్ష సులపై పిడుగుల వంటి బాణ వర్షం కురు స్తుందో అటువంటి శార్గ్ఞ ధనువును నేను శరణు వేడుతున్నాను” అంటుంది పంచా యుధ స్తోత్రం.
వేదాంతదేశికులు చెప్పినట్లు పంచాయు ధాలు భగవంతునికి అలంకారాలు. చక్రం మనస్త త్వాత్మకం, శార్గ్ఞం గుణ తత్వాత్మకం, కౌమోదకి బుద్ధి త త్వాత్మకం, నందకం జ్ఞానతత్వాత్మకం, ధనువు అహం కార తత్వాత్మకం.
వీటితో భూషితుడైన సర్వప్రహరణాయుధుడు ఆ శ్రీహరి సర్వ జగద్రక్షకుడై ఉండగా లోకులకు భయమేల!

Advertisement

తాజా వార్తలు

Advertisement