Friday, October 11, 2024

Odissa – పూరీ ఆల‌యానికి ఎపి సెగ – నెయ్యి నాణ్య‌త త‌నిఖీకి నిర్ణ‌యం

భువ‌నేశ్వ‌ర్ – ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి దేవస్థానంలో క‌ల్తీ ప్రసాదం వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ఈ నేప‌థ్యంలో పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించనున్నారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి దేవస్థానంలాగా ఇక్కడ ఎలాంటి ఆరోపణలు చేయలేదని పూరీ డీఎం సిద్ధార్థ్ శంకర్ స్వైన్ తెలిపారు. ఇక 12వ శతాబ్దానికి చెందిన ఆలయంలో భోగ్ (బోగ్) తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను అధికారులు తనిఖీ చేస్తారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఒడిశా మిల్క్ ఫెడరేషన్ పూరీ ఆలయంలో ఉపయోగించే నెయ్యి సరఫరాదారు.

ఆలయ సేవకులతో కూడా చర్చలు
సిద్ధార్థ్ శంకర్ స్వైన్ మాట్లాడుతూ.. కల్తీకి సంబంధించిన ఏదైనా అవకాశాన్ని తొలగించడానికి, ఒడిశా మిల్క్ ఫెడరేషన్ ద్వారా సరఫరా చేయబడే నెయ్యి ప్రమాణాన్ని తనిఖీ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘ప్రసాదం’ సిద్ధం చేసే ఆలయ సేవకులతో కూడా దీనిపై చ‌ర్చిస్తామ‌న్నారు. అలాగే బోగ్ – ప్ర‌సాదం తయారీకి వినియోగించే అన్ని ప‌దార్ధాల నాణ్య‌త కూడా ప‌రిశీలిస్తామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement