Saturday, April 20, 2024

ఓ తత్త్వ వివేచన… నాసదీయ సూక్తం!

మానవజాతి ప్రాచీనమైన, మొదటి జ్ఞాన, విజ్ఞా న, ప్రజ్ఞాన వాఙ్మయం వేదము. సుమారు 6000 క్రితమే హందూ సనాతన ధర్మం లోని ఋషులు విశ్వం, సృష్టి, ఆత్మ పరమాత్మ ల గురించి, దివ్యదృష్టితో ఆలోచించి, శోధించి చెప్పి నవి, ఆపై వ్రాయబడినవి మన వేదాలు అని చెప్ప వచ్చు. ఇవి మన మునుల మనోనేత్ర దర్శనముతో, పొందిన దివ్యానుభూతుల సమాహారాలు.
‘విధ్‌’ (తెలుసుకోవడం) అనే ధాతువు నుండి వెలు వడినదే ‘వేదం’ అనే మాట. దీనికి అర్థము తెలి యజేసేది అని భావం. ఇది మానవుల చేత రచించ బడలేదని విశ్వాసము. వీటిని దేవుడు నుండి విని గానం చేశారని అందుకే వీటిని శ్రుతులు (వినబడినవి) అని కూడా అంటారు. అయితే కొందరు ఇవి మునులే తెలుసుకొని, ఒకరి నుండి ఒకరికి, గురువుల నుండి శిష్యులకు పరంపరగా, శతాబ్దాలుగా కంఠస్థం చేయిస్తూ, నేటితరానికి అం దించారని అంటారు. ఈనాడు ఆధునిక యంత్రాల సహాయంతో, విజ్ఞాన శాస్త్రాల సహకారంతో, కనుగొన్న అనేక పరిశోధన ఫలితాలను, ఆనాడే దివ్య తపస్సు శక్తితో, ఆ మహా ఋషులు తెలుసుకొని, వేదాలలో పొందుపరిచారని ఉవాచ.
ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం, అర్థశాస్త్రం, గణిత, ఖగోళ, నక్షత్ర, వ్యవసాయ, రసాయన, వృక్ష, కిరణ, లోహ, యంత్ర, తంత్ర, మంత్ర, పశు, వాస్తు, కామ శాస్త్రాల వంటి అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలను వేదాలలో పొందుపరిచారు. నేడు మనము ఆధునికమని కనుగొన్న అనేక విషయాలను, విశేషాలు అనేకం మన వేద ఇతిహాస పురాణ కావ్యాలలో ఉన్నాయి. అనడంలో ఎలాంటి సందేహంలేదని ఎక్కువమంది అభిప్రాయం.
అనేక ఊహకందని శాస్త్రీయ విషయాలను, ఆనాడే వెల్లడించిన, మన రుషుల నుండి విన్న ‘నాసదీయ సూక్తం’గురించి వివరంగా తెలుసుకుందాము.
వేదాలలో మొదటిది ఋగ్వేదం ఇది వేద వాఙ్మయానికి తలమానికం. ”ఋక్‌” అనగా దేవతలను పొగడుతూ చెప్పే మంత్రం. ఋగ్వేదంలో ఆనాటి ఆర్యులు అనేకమంది దేవతలను స్తుతిస్తూ సాగిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో విశిష్టమైన ఒక గొప్ప సూక్తం, పదవ మండలంలోని 129వ సూక్తం, అదే సృష్టి సూక్తం లేదా ‘నాసదీయ సూక్తం’ అంటారు. దీనిలో 7 మంత్రాలు ఉన్నాయి ఈ సూక్తం ‘నసదా సీత్‌’ (అప్పుడు ఉండటం అక్కడ లేదు) అని మొదలవుతుం ది. అందుకే దీని ని ‘నాసదీయ సూక్తం’ అన్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన ఆలోచన. ఈనాటికీ అచ్చెరువు పొందేటంత గొప్ప తత్వ వివేచన. అంత గంభీరమైన, అనిర్వచనీయమైన మనోభావన, ఆనాటి మన మునులు ఆ ఆశ్రమ వాటికలలో సూర్యునికి నమస్కరిస్తూ, విశ్వ రహస్య ద్వారాలు తెరవడా నికి తెరమరుగున దాగిన సత్యాలను కనుగొనడాని కి ఎంత తహతహలాడారు.
యజ్ఞయాగాదులు, పశుబలులు, సోమపానాలు, దేవతా స్తుతులు జరుగు తున్న కాలంలోనే, ఇంత విచిత్రమైన ఊహ ఆ మునులకు ఎలా స్ఫురించిందోనని ప్రపంచ మేధావులను ఆశ్చర్యపరచిన ప్రశ్నలివే!
మొదటి మంత్రం

”నాసదాసీన్నో సదాసీత్త దానీం
నాసీద్ర జోనో వ్యోమాప రోయత్‌
కిమావరీవ: కుహకస్య శర్మ న్నంభ:
కీమాసీద్గ హనంగభీరం”
”అప్పుడు సృష్టికి పూర్వం సత్తు (ఉండడం) లేదు. అసత్తు (ఉండకపోవ డం) లేదు. భూమి లేదు. సమున్నత ఆకాశము లేదు. మూత వంటిది ఒకటి ఉం ది. అది ఎక్కడ ఉంది? దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది? సుఖదు:ఖాల అనుభవం ఎవరికి? అక్క డ గంభీరమైన అగాధమైన కొలవలేని ఈ జలరాశి (వెల్లువ) అప్పుడు ఉన్నదా?” అని అర్థం.
అలాగే మిగిలిన ఆరు మంత్రాల అర్థాలు ఈవిధంగా చెప్పారు.

2వ మంత్రం: అప్పుడు చావు (మృత్యువు) లేదు. అమృత తత్వం (మిత్తి డి) లేదు. రాత్రి- పగలు లేవు. అద్వితీయమైన ‘అది’ తన స్వశక్తి చేత, తన స్వభా నుసారం గాలి లేకుండా శ్వాసిస్తుంది. ‘అది’ తప్ప మరేది అప్పుడు అక్కడ లేదు.

3వ మంత్రం: అప్పుడు మొదటగా చీకటి చేత ఆవరించబడిన చీకటి మాత్రమే ఉంది. ఈ సమస్తం అంతరాయంలేని నిరంతర ద్రవం (సలిలం) ఉంది. చివరికి వేడిమి శక్తి చేత ఏమీలేని (చుట్టూరా) దాని నుండి అది జన్మించింది.

4వ మంత్రం: అన్నింటికంటే ఆదిలో సృష్టించాలని కోరిక ఉన్నది. అదే మనసులో భావి సృష్టి కి ప్రధమ బీజం. మునులు వారి హృదయాలను శోధించి, జ్ఞానంచేత సత్తుకు అసత్తుకుగల అవినాభావ సంబంధాన్ని తెలుసుకున్నారు.
5వ మంత్రం అర్థం: సూర్యుడు ఉదయించిన తక్షణమే కాంతి ప్రసరిం చినట్లు, క్షణంలో వాటి వెలుగు మధ్యంతరాళంలో వ్యాపించింది. దానికి కింద ఏది ఉన్నది? పైన ఏది ఉన్నది? అది సృష్టికి బీజమైనది. సృష్టికి కారణమైన శక్తి. దిగువ బలీయమైనది. ఎగువ ఉత్తేజితమైనది.
6వ మంత్రం అర్థం: సృష్టి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగ లరు! ఎవరు వివరించి చెప్పగలరు? ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా జన్మిం చింది? ఈ జగత్‌ పుట్టుక తర్వాతనే కదా దేవతలందరూ పుట్టినది. అందుచేత వారికి కూడా విశ్వ సృష్టి ప్రక్రియ తెలియదు. మరి ఇదంతా ఎలా ఏర్పడింది?
7వ మంత్రం అర్థం: ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకోగల వారు ఎవరూ లేరు. అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడో లేదో ఎవరికి తెలియదు. పరమాకాశానికి ఆద్యుడైన పరమాత్మకు మాత్రమే బహుశా ఈ సృష్టి ప్రారంభ రహస్యం తెలిసి ఉంటుంది. బహుశా అతనికి కూడా తెలియదేమో!?
ఈ నాసదీయ సూక్తాన్ని ‘బిగ్‌ బ్యాంగ్‌’ సిద్ధాంతంతో పోల్చి చూడండి. కొన్ని అంశాలలో ఎంత పోలిక కనిపిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విశ్వాన్ని నడిపించే మూల సూత్రం ఏది? విశ్వం దేనితో ఏర్పడింది. మొదట్లో సృష్టికి ముం దు నీరు ఉందని ఎలా ఊహంచారు. ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం, బ్లాక్‌ హోల్స్‌ ఉనికి, స్టీఫెన్‌ హాకింగ్‌ రేడియో ధార్మికత వివరణలపై ఏడు ప్రశ్నలు సృజించాయి. నిజా నికి జీవం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో తెలియదు.? ఒకరకంగా పరిశీలిస్తే సృష్టికి ముందు ఉండే ‘ఏమీ కాని స్థితికి’, సృష్టికి చివర ఉండే ‘ఏమీ లేని స్థితికి’ పోలికలున్నాయి. ఈ విషయాలను భారతీయ తాత్విక చింతనలోని భావాలతో పోలిస్తే సారూప్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే జర్మనీ శాస్త్రవేత్త నోబుల్‌ బహుమతి గ్రహత హజన్బర్గ్‌ ”భారతీయ తత్వ శాస్త్రానికి, క్వాంటం సిద్ధాంతానికి చాలా పోలికలు ఉన్నాయి. నా శాస్త్ర పరిశోధనలను భారతీయ తత్వ శాస్త్రం ఎంతో ప్రభావితం చేసింది” అన్నాడు. ఇలా అనేకమంది విదేశీ శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు మన హందూ ధర్మాన్ని గురించి, వేదాల గురించి చాలా గొప్పగా చెప్పినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మన వేద ఋషులు సత్‌, అసత్‌ లేని పరిస్థితిని, స్థల, కాల రాహత్యాన్ని, జీరో స్పేస్‌, జీరో టైం, ఎలా ఊహంచారో క దా! అదో అద్భుతం.

Advertisement

తాజా వార్తలు

Advertisement