Sunday, March 26, 2023

నవరసాల సమ్మేళనంమానవ జీవితం

నవరసాల సమ్మేళనం మానవజీవితం. మిగిలిన జీవులకు మనిషికి ఉన్న బేధం అనుభూతిని అనుభవించడం. అయి తే పశుపక్ష్యాదులు, కీటకాలు కూడా అనుభూతిని ఆస్వాదిస్తా యి. వ్యక్తపరచే అదృష్టం మాత్రం మానవులకే దక్కింది. ఈ రసాలు తొమ్మిదిగా విభజించి భావానుభవాన్ని నిర్వచించడం జరిగింది. అక్షరాస్యుడైతే నవరసాలను ఆస్వాదించి తనలో తాను రమిస్తాడు. తెలిసినా, తెలియకపోయినా ప్రతివ్యక్తి ఏదో ఒక సమయంలో ఈ నవరసాలను అనుభవించినవాడే!
ప్రకృతిలో భాగమైన మనిషి త్రిగుణాల యొక్క ప్రేరణ వల్ల రసానుభూతిని అనుభవించక తప్పదు. వీటిలో ముఖ్యమైనది శృం గారం. కాలప్రేరణ వల్ల ప్రతి జీవి శృంగార భావాన్ని అనుభవిస్తాయి. అయితే ఆ రసాన్ని ఆస్వాదించి ఆనందడోలికల్లో మునిగేది మాత్రం మనిషి. అందుకే దీనికి అంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాని శృంగార రసానుభూతిని పొందడానికి దానికి పవిత్రతను జోడిస్తేనే సాధ్యమవుతుంది. ఆ పవిత్రతను సమ్మిళితం చేసుకొన్నదే సనాతన హిందూ వివాహ వ్యవస్థ. భార్యాభర్తల పేరుతో తమ జీవనయానాన్ని శృంగార రససంధ్రంలో విహరించే యోగం కలిగించింది. ఈ పవిత్ర యోగానికి విరుద్ధంగా అక్రమ మార్గంలో వెళ్ళే వారికి ఈ రసానుభూతి సాధ్యం కాదు.
ఇక వీరత్వం ఒక గొప్ప రసభావం. ముఖ్యంగా దేశ, సమాజ రక్షకులకు ఈ వీరరసం ఒక ఆభరణంగా కలిగి ఉంటుంది. ఈ వీరరసభావం ఉన్నవారే రక్షక భటులుగా, సైనికులుగా, అధికారులుగా తమ జీవన యానాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో వీరరసభావంతో ఆవేశానికి లోనయినవారే!
వీర రసానికి భావం ఆవేశం. కానీ ఆవేశం అనర్థదాయకం కాకూడదు. ఆవేశంతో చేసే కర్మలు దుష్కర్మలుగా వ్యక్తమవడం సాధారణంగా మనం సమా జంలో చూస్తున్నాము. మత్తుకు బానిసలుగా మారిన వారు చేసే పనులు వీరత్వం అనిపించుకోదు. క్రోధంతో చేసే ఆవేశపుదుర్మార్గ చర్యలు వీరరసానికి గుర్తుకాదు. త్యాగానికి చిహ్నంగా కనిపించే రసానుభూతినే వీరత్వం అంటారు. తన దేవం కోసం, సమాజ శాంతి స్థాపన కోసం తన ప్రాణాలనే త్యాగం చేసే వీరసైనికులు రక్షక భటులు ఈ వీరరసానుభూతిని ఆస్వాదిస్తారు. అటువంటివారే స్వర్గాన్ని అలంకరిస్తారు.
ఎవరైతే కరుణ రసాన్ని కలిగి ఉంటారో వారు దు:ఖభావాన్ని అనుభవిస్తారు. మానవ జీవితంలో అత్యంత అవశ్యమైనది ఈ కరుణ రసం. ఇది కూడా పాషాణ హృదయులు పైతం ఏదో ఒక సంఘటనలో ఈ కరుణ రసానుభూతిలో దు:ఖాన్ని అనుభవించినవారే!
కరుణ రసాన్నుండి వచ్చిన దు:ఖం చాలా సందర్భాలతో శ్రేయోదాయకంగా మారుతుంది. దీనులను, ఆర్తులను అక్కున చేర్చుకొని ఆదరించేవారు ఈ కరుణ రసాన్ని ఆస్వాదిస్తారు. ఆపదలలో ఉన్న వారికి తమ సర్వస్వాన్ని అర్పించి ఆదు కునే వితరణ శీలురు ఈ కోవకు చెందినవారు. కరుణ లేని వారు మనిషిగా జీవించడాన్ని చూస్తుంటాం. అటువంటి వదాన్యుల వల్ల ఈ కరుణపసం కమనీ యంగా గోచరిస్తుంది.
అద్భుత రసం ఆశ్చర్యభావాన్ని వ్యక్తపరుస్తుంది. ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో ఈ అద్భుత రసానుభూతిని పొందినవారే ప్రస్థుత విజ్ఞాన శాస్త్ర పరిక రాలతో ఎన్నో అద్భుత ఖగోళవింతలను, రహస్యాలను తెలుసుకొని అందరూ ఆశ్యర్యానికి లోనవుతున్నవారే! ఆ అద్భుత రసానుభూతి స్వల్పకాలం నిలిచి ఉన్నా జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటుంది. గుర్తుకు వచ్చినప్పుడల్లా ఆశ్చ ర్యానికి గురవుతూనే ఉండడం సహజం. కారణజన్ములు మాత్రమే ఈ అద్భుతా లను సృజిస్తూ ఉంటారు. సామాన్యులు ఆశ్యర్యంతో ఆశ్యర్య రసభూతిని ఆస్వా దిస్తారు. ప్రస్థుత ఆధునిక యుగంలో రోదసే యాత్ర, అంతర్జాలం, చరవాణి ఈ అద్భుత రసానుభూతికి ప్రేరణ కల్పిస్తున్నాయి. అయితే భగవంతునితో మమే కమైనవారు పొందే అద్భుత రసానుభూతి ఉన్నతమైనది, సాటిలేనిది. ఇక హాస్య రసం యొక్క భావం నవ్వు. ఎవరైతే హాయిగా, నిండుగా నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారో వారు ఈ హాస్యరసాన్ని ఆస్వాదిస్తారు. నవ్వు నలభై రకాల లాభాలను కలిగిస్తుంది. వాటిలో ముఖ్యమైన లాభం ఆరోగ్యం. హాస్యం వెకిలిదైతే రసాను భూతి రసభాసగా మారుతుంది. ఇది ప్రమాదం. అందుకే అప్పుడు నవ్వు నాలు గు విధాలుగా చేటును కలిగిస్తుంది.
స్వార్థం నుండి భయం జనిస్తుంది. భయానక రసానికి భావ వ్యక్తీకరణ భయం. ప్రస్థుత సమాజం ఈ భయానక రసానుభూతిలో పడి సతమతమవుతు న్నారు. నిత్యం జరిగే అకృత్యాలు మొత్తం సమాజాన్నే భయంలో ముంచివేస్తుం ది. మనిషి స్వార్థ చింతనతో ఈ రసానుభూతిని అనుక్షణం సృజిస్తున్నాడు. ఈ భయానక వాతావరణాన్ని ఉక్కుపాదంతో అణచివేసే బాధ్యత పాలకులదే! ఈ రసాన్ని మనిషన్నవాడే కావాలని కోరుకోడు.
ఈ భయానక పరిస్థితికి తోడు బీభత్సరసం తోడయితే మనిషి మనుగడ ప్రమాదంలో పడ్డట్లే! బీభత్సాన్ని కలిగించే వారు జుగుప్స భావానికి లోనవుతారు. ప్రస్థుత సమాజం ఈ బీభత్స రసానుభూతికి లోనవడం చూస్తున్నాం. మానభం గాలు, హత్యలు, ఖండఖండాలుగా దేహాన్ని వేరు చేయడం సమాజంలో జుగుప్స ను కలిగిస్తున్నాయి. ఈ బీభత్సాన్ని ఎవరూ వాంఛించరు.
లోభం, స్వార్థం, అసూయ, మనిషిలో రౌద్ర రసాన్ని ప్రేరేపిస్తాయి. ఈ రౌ ద్రం యొక్క భావవ్యక్తీకరణ కోపం. కోపం సర్వసమస్యలకు కారణమవుతుంది. ఈ కోపం వలననే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఆహారం కంటే ఆయుధాలనే ఎక్కువ ఉత్పత్తి చేసి మనిషి అన్న పదానికి అర్థాన్ని మార్చేస్తున్నారు.
అందుకే నవరసాలో ఆణిముత్యం శాంతరసం. ఇది ఓర్పు అనే భావం ద్వా రా వ్యక్తమవుతూ ఉంటుంది. ఓర్పు సహనానికి నాంది.
మనిషి ఓర్పుతో ఆలోచన చేస్తే ఈ భువి శాంతిథామం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement