Thursday, September 21, 2023

నమ్మిన భక్తులను నడిపించే సాయి

మహారాష్ట్రలోని అకోలా గ్రామంలో నివసించే ఒక వైశ్యునికి లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది. వారు ఆ అమ్మాయిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. దురదృష్టవశాత్తూ ఆ అమ్మాయికి ఒక విషపు జ్వ రం సోకి రెండు కాళ్ళూ చచ్చుబడిపోయాయి. లేచి నిలబడ లేక ఆ అమ్మాయి మంచానికే పరిమితమైపో యింది. ఎంతమంది ప్రముఖ వైద్యుల చేత ఖరీదైన వైద్యం ఇప్పించినా ప్రయోజనం లేకపోయింది. అం తలో ఆ వైశ్యుల కుటుంబానికి తెలిసిన వారు వచ్చి రోగ నివారణార్ధం శిరిడీలోని సాయిని శరణు పొందమని సలహా ఇచ్చారు. ఆఖరు ప్రయత్నంగా ఆ వైశ్యుడు తన కుమార్తెను శిరిడీకి మోసుకు వచ్చి శ్రీ సాయి కాళ్ళ వద్ద వుంచాడు. తన కుమార్తెకు స్వస్థత చేకూర్చమని హృదయపూర్వకంగా ప్రార్ధించాడు. దయామయు డైన శ్రీ సాయి ఆమెను ఆశీర్వదించి కొద్దిరోజులు శిరిడీలోనే వుండమన్నారు. ఆశ్చర్యాలలోకెల్లా ఆశ్చర్యం! ఆ రోజు నుండే ఆమె కాళ్ళలో కదలికలు ప్రారంభ మయ్యాయి. మూడవ రోజుకల్లా ఆమె ఎవరి సహా యం లేకుండా నడవసాగింది. వారం రోజులలోపే పరుగులు తీసే శక్తి లభించింది. అందరికంటే గొప్ప వైద్యుడైన శ్రీ సాయికి సాధ్యం కానిది ఏముంది?
1914వ సంవత్సరంలో మహా శివరాత్రి పర్వ దినం ముందురోజున హార్ధా అనే గ్రామంలో మేజి స్ట్రేట్‌గా పని చేసిన చోటా భయ్యా తన కుటుంబంతో హఠాత్తుగా శిరిడీ ప్రయాణం కట్టాడు. వారు టాంగా లో నేమేవర్‌ అనే నది ఒడ్డుకు చేరేసరికి చీకటి పడి పోయింది. పడవ నడిపేవారు తమ పడవల న్నింటినీ కట్టేసారు. ఎంత డబ్బిస్తామన్నా పడవ వేయడానికి వారు ససేమిరా ఒప్పుకోలేదు. ఇక ఆ నది ఒడ్డునే తమ కు రాత్రంతా గడపక తప్పదని ఆందోళనపడిన చోటా భయ్యా తమను కరుణించమని శ్రీ సాయిని హృదయపూర్వకంగా ప్రార్ధించాడు. ఇంతలో హఠాత్తుగా సాయి వలే తలగుడ్ద, కఫ్నీను ధరించిన ఒక ముదుసలి వ్యక్తి వీరి వద్దకు వచ్చి ”ఆడవారిని, చిన్నపిల్లలను తీసుకొని ఇంత పొద్దుపోయి వచ్చారేమి? అయినా ఏం భయపడవద్దు. కొద్దిసే పట్లో ఈ పడవ వారే మిమ్మ ల్ని నది దాటిస్తారు” అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా కొద్దిసేపటికే ఆ పడవ నడిపేవారు వచ్చి సామాను లన్నింటినీ పడవలలో సర్ధి అందరినీ పడవ ఎక్కమన్నారు.” మీకు పడవ వేయ నందుకు మా పై ఆఫీసరు గారు మమ్మల్ని పిలిచి తిట్టారు. మీరు బాడుగ ఇవ్వకపోయినా ఫరవాలేదు, మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాం” అని చెప్పి ఆ బెస్తవారు చోటాభయ్యా పరివారమంతటినీ సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేర్చారు. ఆ మర్నా డు శిరిడీ చేరాక తమను దర్శించిన చోటాభయ్యా పరివారంతో శ్రీ సాయి ”చూడండి! నేను కల్పించుకోక పోయినట్లయితే మీకు ఎంత ఇబ్బంది ఎదురయ్యేదో?” అని క్రితం రోజు జరిగిన సంఘటననంతటినీ వర్ణిం చి చెప్పారు. తనను నమ్మి కొలిచే భక్త జనావళిని సాయి సురక్షితంగా ఈ భవ సాగరాన్ని దాటిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement