Thursday, April 18, 2024

మానసిక ప్రశాంతతనిచ్చే మంత్రం!

ఇదే పంచాక్షరీ మహా మంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్ప వృక్షం ఈ మంత్రం. దీని ఉచ్ఛరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞాన ప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. శైవంలో భక్తులు ధ్యానిం చే దివ్య మంత్రం. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నా యి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వది లేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.
‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవు తుంది. ఓం… మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు. ఈ మంత్రం భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశాన్ని సూచిస్తుంది. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు.
ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మం త్రోచ్ఛారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెల కుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్ఛరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మిక వేత్తలు బోధిస్తున్నారు.
ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికి నప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది. ‘న’ భూమికి సంబంధిం చిన భాగాలను, ‘మ’ నీటికి సంబంధించిన భాగాలను, ‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను, ‘వ’ గాలికి సంబంధించిన భాగాలను, ‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.
మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యా త్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు. అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుం దనడంలో ఏమాత్రం సందే#హం అక్కర్లేదని పౌరాణికులు చెబు తారు. భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్ఛరించినా తగినంత ఫలం లభిస్తుంది. శివభక్తుడైన సౌనంద గణశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మ#హర్షి.. ఓ జనులారా! ఇది ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రం దీనిని ఉచ్ఛరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.
ఆ మ#హర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించ లేదు. కానీ భక్తితో ఉచ్ఛరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్ఛరిస్తే ‘అధికస్య అధికం ఫలమ్‌’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.
వశిష్ట మహర్షి తన శిష్య బృందం చేత పలక మీద మొదటగా వ్రాయించినది ఈ శివ పంచాక్షరీ మంత్రమని పురాణాలు చెబుతు న్నాయి. పంచాక్షరి అనగా ఆదిశక్తి, ఆదిదేవుడు, ఓకారం, బిందువు, శివశక్తిల కలయికయే నాదబిందు కళోపాసన.
ప్రతి నెలా వచ్చే శివుని పండుగ మాస శివరాత్రి. ఆ రోజు ఆ భోళాశంకరుని ఉద్దేశించి చేసుకునే పూజ. ఉపవాసం, జపం, ప్రదక్షిణ లు ప్రత్యేకముగా, విశిష్టముగా ఉంటాయి.
ఈ రోజు తెల్లవారు జామునే స్నానం చేసి నిటారుగా కూర్చున కళ్లు మూసుకుని జప మాల తీసుకుని ‘ఓం నమ:శివాయ’ మంత్రా జపించాలి. అలాగే మానసిక ప్రశాంతతను ఇచ్చే ఈ పంచాక్షరీ మంత్రాన్ని ప్రతీరోజూ జపించవచ్చు. ఎంతో మహిమగల ఈ మంత్రాన్ని ఎప్పుడు పడితే అప్పడు స్మరించకూడదు అని చెబు తున్నాయి పురాణాలు. నియమంతో, నిష్టతో తెల్లవారు జామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ప్రశాంతంగా కూర్చుని జపించాలి.
భోళా శంకరుడు. నాలుగు చుక్కల నీరు పోసి, మూడు దళాలు ఉన్న బిల్వ దళం మనసారా పెడితే సంతోషించి వరాలనిచ్చే వరదుడు. కష్టపడి ఏ పూజ చేయ వలసిన పని లేదు. ఏవేవో వస్తువులు సేకరించి పెట్టు కోవలసిన పనిలేదు. జీవయాత్ర చాలించిన జీవిని అంద రు వదిలేసినా కూడా నేనున్నాను నీకు తోడు అంటూ ఆదుకునే ఆది దేవుడు. స్మశానంలో సదా నివసిస్తూ ఉండే మార్గ బంధువు. పంచాక్షరిని జపించి లోకాలలో ఏ కష్టం వచ్చినా నేనున్నా నంటూ ముందుకు వచ్చి కాపాడిన పరమా త్ముడు ఆ పరమేశ్వరుడి కృపకు పాత్రులవుదాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement