Friday, March 29, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

4వ మంత్రము :

సుషుప్తస్థాన: ప్రాజ్ఞ: మకార: తృతీయామాత్రా మితేరపీతేర్వా
మినోతిహవా ఇదం సర్వం అపీతిశ్చ భవతి య ఏవం వేద|

సుషుప్తి స్థానమైనవాడు పరమాత్మయేకదా! ఆతడే ప్రాజ్ఞుడు, సంకర్షణుడు, అతడే మకార స్వరూపుడిగా ఈ మంత్రములో పేర్కొనబడుచున్నాడు. ఎందుకంటే రెండు
హేతువులు చెప్పబడుచున్నవి. (1)మితి అనగా తనలో ఇముడ్చుకొనుట, (2)అపీతి అనగా అప్యయము(లయము).

1) ఈ సర్వప్రపంచమునూ తనలో ఇముడ్చుకొనగలవాడు సంకర్షణుడు. అలాగే మకారము కూడా తనయందు అకార, ఉకారములను ఇముడ్చుకొనును. అనగా అకార, ఉకారములకు అవధి అయినది మకారము అని తాత్పర్యము, 2) ప్రాజ్ఞనియందే(సుషుప్తిదశలో ఈ జగత్తంతా లయించుచున్నది. అలాగే మకారమునందే అకార, ఉకారములు లయించుచున్నవి.

- Advertisement -

ఉకారములకంటే మకారమే చివరిదయినందువలన లయ స్థానమని తాత్పర్యము. ఈ విధంగా మితి, అపీతిలను బట్టి మకారమును ప్రాజ్ఞుడు అనవచ్చును. ఎవరైతే ఈ విషయమును తెలుసుకొందురో వారు ఈ ప్రపంచమునంత టినీ బాగుగా తెలుసుకొందురు(అనగా యదార్థ జ్ఞానమును పొందుదురు)అని అర్థము. వీరు తాపత్రయాది దు:ఖము కలిగి పరమాత్మయందే లయము చెందుదురని తాత్పర్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement