Sunday, September 24, 2023

మహావీరా… నవెూనమ:

పరిపూర్ణతకు… పవిత్రతకు… విజయానికి మారు పేరు అయిన వినాయకుని జన్మదినం నేడు. ఆయన పుట్టిన భాదప్రద శుక్ల చవితి రోజున వినాయక చవితి పండుగను చేసు కుంటాం. హిందువుల సనాతన పండుగల్లో వినాయక చవితి గొప్ప పండుగ. దేశవ్యాప్తం గా వాడవాడలా వెలిసే దైవం గణాధీశుడు. ప్రజలందరూ సంఘటితమై అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుపుకునే గణపతి నవరాత్రోత్సవాల ప్రారంభోత్సవ శుభదినం సందర్భంగా….

శివపార్వతుల ప్రియపుత్రుడు వినాయకుని పవిత్ర జన్మదినమైన భాద్రపద శుక్ల చవితి ఎంతో ప్రత్యేక మైన రోజు. వినాయకుని ప్రీతిని పొందితే తాము తలపెట్టిన అన్ని కార్యములు నిర్విఘ్నంగా జరు గుతాయన్నది ప్రతీ హందవుడి నమ్మకం. అందుకే వినాయక చవితి రోజు భక్తితో గణశుని పూజిస్తారు. ఈ నేపథ్యంలో వినాయక చవితి పర్వదినం విశిష్టతను తెలుకోవాల్సినా అవసరం ఉంది. వినాయక వ్రతం ఆచ రించినవారు శుభ ఫలితాలను పొందినట్లు పురాణగాథలు చెబుతుండడంవల్ల… భారతదేశంలో సనాత నంగా ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

- Advertisement -
   

శ్రీ వినాయకుని జననం

పార్వతీదేవి ఒకరోజు స్నానమాచరించే క్రమంలో తన శరీరానికి రాసుకున్న నలుగుపిండితో బాలుడి బొమ్మ తయారుచేసి తన దివ్యశక్తితో ప్రాణం పోసింది. దీంతో అఖండ దివ్యతేజో విరాజితుడిగా, మహోజ్వ లంగా వెలిగిపోతున్న ఆ బాలునికి గొప్ప శక్తి సంపన్నమైన దండానిచ్చి ద్వారం వద్ద కాపలా ఉంచి, ఎవరినీ లోనికి రానీయరాదని ఆదేశించింది. దీంతో ద్వారం వద్ద బాలుడు పట్టుదలగా కాపలా ఉన్నాడు. ఇంతలో పరమ శివుడు వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళబోయాడు. అతన్ని బాలుడు అడ్డుకున్నాడు. దీంతో శివుడు తనను ఇంట్లోకి పోనియ్యమని బ్రతిమిలాడాడు. బుజ్జగించాడు. బాలుడు ఎంతకూ వినలేదు. అప్పుడు శివుడు ఆగ్రహోదగ్రుడై తన త్రిశూలంతో బాలుని శిరస్సును ఖండించాడు. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి జరిగిన ఘోరాన్ని చూసి విలపించింది. కుమారున్ని బ్రతికించమని శివున్ని వేడుకుంది. శాంతించిన శివుడు తెగిన శిరమును అతికించి బ్రతికించాలనుకుంటే… త్రిశూలఘాతంతో ఛిద్రమై తల ఎక్కడో పాతాళలోకం లో పడిపోవటం వల్ల… ఉత్తరం దిక్కున శిరస్సును పెట్టి ఉన్న ఏ జీవి తలనైనా నరికి తేవాలని ప్రమథ గణా లను ఆదేశించాడు. ఒక అడవిలో శివనామాలు కలిగిన ఒక పెద్ద ఏనుగు (శివ భక్తుడు గజాసురుడనే రాక్ష సుడు ఏనుగు రూపం ధరించి) శివభక్తితో నదిలో స్నానంచేసి వచ్చి ఒక మహావృక్షం నీడన ఉత్తరం దిక్కు తలవాల్చి నిద్రపోయింది. ఇది మహాశివుని దివ్య సంకల్పంగా భావించి ఆలస్యం చేయకుండా ప్రమధ గణా లు ఏనుగు తలను నరికి కైలాసానికి తెచ్చారు. శివపార్వతులు తమ దివ్యశక్తితో బాలుని మొండానికి ఏనుగు తలను అంటించారు. దీంతో బాలుడు పునర్జీవుడైనాడు. గజాసురుని శిరస్సును అతికించినందున ‘గజాన నుడు’, ‘గణశుడు’…ఇలా వెయ్యి పేర్లు పెట్టారు. భాద్రపద చవితి పవిత్ర శుభదినాన బాలుడు తిరిగి బ్రతికి నందున ఈ దినాన్ని ‘వినాయక చవితి’ పర్వ దినంగా సకల లోకాలు ఘనంగా జరుపుకోవాలని దేవతలంతా ఆదేశించారు. గజాననుడు వినయ, విధేయతలు కలిగి సకల వేద విద్యాపారంగతుడైనందున ‘వినాయకు డు’ అని పేరు పెట్టి, సులభంగా ఎక్కి తిరగడానికి ‘అనింద్యుడు’ అనే ఎలుకను వాహనంగా తల్లిదండ్రులు సమకూర్చారు.
విఘ్నాలకు అధిపతి

దేవతలు, మ#హర్షుల వినతితో విఘ్నాలకు అధిపతిని నియమించడానికి అన్నదమ్ములైన వినా యకునికి, కుమారస్వామికి పరమశివుడు పరీక్ష పెట్టాడు. ఎవరు ముందుగా ముల్లోకాల్లోని నదు లన్నింటిలో స్నానం చేసి వస్తారో వారే విఘ్నాలకు అధిపతిగా నియమించబడతారు. అతనే సర్వ లోకాలు తొలి పూజనీయుడవుతాడు అని చెప్పాడు శివుడు. దీంతో అ#హంకరించిన కుమారస్వా మి… తన అన్న వినాయకుడు.. మరుగుజ్జుడు, అసమర్ధుడు, అతడు అడుగు తీసి అడుగు వేసేలోగా తాను ముల్లోకాలను చుట్టివచ్చి విఘ్నాధిపతినవుతానని తన మయూర (నెమలి) వాహనాన్ని ఎక్కి వెళ్ళాడు. వివేకం, బుద్ధి, వినయశీలుడైన వినాయకుడు మాతా, పితరులపై అపారభక్తితో వారికి ప్రదక్షిణం చేసి నిలబడ్డాడు. దీంతో శివ, పార్వతులు పరమానంద భరితులై అతనికి నారా యణ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్ర ప్రభావం ఎంతటిదంటే… ఒక్కసారి నారాయణ మంత్రాన్ని పఠిస్తే 300ల కల్పాల కాలం పుణ్యనదులలో స్నానమాచరించిన మహత్తర పుణ్య ఫలితం పొందుతారని వరాన్ని ప్రసాదించారు. దీంతో కుమారస్వామి ముల్లోకాల్లోని ఏ నదికి స్నానమాచరించడా నికి వెళితే… అక్కడ అతనికంటే ముందుగానే స్నానాదులు ముగించుకొని తిరిగి వస్తున్న వినాయకుడు కని పించాడు. దీంతో కుమారస్వామి తన ఓటమినీ, అహంకారాన్నీ అంగీకరించాడు. బుద్ధి, వినయము, వివేక ము, మాతాపితరులపై ఉన్న అమేయ భక్తితో తన మాదిరిగా తొందరపడకుండా స#హనంతో, ముల్లోకాధిప తులైన తల్లిదండ్రులైన శివ, పార్వతులకు ప్రదక్షిణ చేసిన అన్న విధానమే సరియైనదని కుమారస్వామి అంగీకరించాడు. దీంతో గజాననునికి శంకరుడు భాద్రపద శుద్ధ చవితినాడు విఘ్నాధిపత్యం ఇచ్చాడు.
బ్ర#హ్మ కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలతో వినాయకునికి ముక్కోటి దేవతలు అంగరంగ వైభవంగా వివా #హం జరిపారు. భవిష్యత్‌లో మానవుడు సిద్ధి, బుద్ధిసమేతుడైన వినాయకున్ని ఆరాధిస్తే తలపెట్టిన కార్యాల విఘ్నాలు తొలగి సుఖ శాంతులతో జీవిస్తారని, గణశుని కల్యాణ కథలోని ఆంతర్యంగా చెబుతారు. సిద్ధి, బుద్ధిలకు లాభం, క్షేమం అనే ఇద్దరు కుమారులు, సంతోషిమాత కుమార్తెగా జన్మించిందని పురాణకథనం.

చంద్రుని శపించిన వినాయకుడు

ఒక చవితి రోజు వినాయకుడు తనకు ప్రీతికరమైన ఉండ్రాళ్ళు, పాయనం ఇతర నైవేద్య పదార్థాలు కడు పార తిని భుక్తాయాసంతో ఇబ్బందిగా వేలాడుతున్న పొట్టను సవరించుకుంటూ మెల్లమెల్లగా నడుస్తున్నా డు. అది చూసిన చంద్రుడు గణశుని గేలిచేశాడు. అవమానించాడు. కోపించిన వినాయకుడు ”చంద్రా! నీవు నీ రూపాన్ని చూసుకొని గర్వంతో మిడిసిపడుతున్నావ్‌! ఈరోజు నుంచి నీ రూపమును ఎవ్వరూ చూడకుం దురుగాక! చూసినవారు మహాపాపులై, కార్యబ్రష్టులై, నికృష్టులై, నీచాతి నీచంగా జీవింతురుగాక!” అని శపించాడు. చంద్రుడు గర్వభంగుడై శాపవిముక్తి చేయమని వేడుకున్నాడు. దీంతో గణశుడు జాలిపడి శాపా న్ని సవరించుకున్నాడు. కేవలము వినాయక చవితినాడు మాత్రమే చంద్రబింబమును చూసినవారు అప నిందలకు గురవుతారని, వినాయక వ్రతమును భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే అపనిందలు నివృత్తి అయి సంతోషంగా ఉంటారనీ చంద్రునికి ఊరట కలిగించాడు. ఈ నేపథ్యంలో శ్రీకృష్ణ భగవానుడు వినాయక చవితినాడు చం ద్రుడిని చూశాడు. దీంతో శమంతకమణిని తస్కరించాడని నిందారోపణకు గురయ్యాడు. శ్రీ వినాయక వ్ర తాన్ని ఆచరించి శమంతకమణిని సంపాదించి సత్రాజిత్తుకు ఇచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడు.
శ్రీ వినాయక వ్రతం ఇంత మ#హత్తు కలిగినందున మునులు ప్రతీ పనిని తలపెట్టినప్పుడు విఘ్నములు కలుగకుండా వినాయకునికి తొలి పూజలు ప్రవేశపెట్టారు.
– తాళ్ళపల్లి యాదగిరి గౌడ్‌
9949789939

Advertisement

తాజా వార్తలు

Advertisement