Friday, February 3, 2023

మహాసిద్ధుడు… దత్తాత్రేయుడు

శ్రీ దత్తాత్రేయుని జన్మదినం అయిన మార్గశిర పౌర్ణమి రోజున దత్తజయంతిగా సనాతన ధర్మపరులు జరుపుకుంటారు. శ్రీ దత్తుని గురు పరంపరలోని వారిని భక్తిశ్రద్ధలతో సేవించి తరిస్తారు. అవధూతను కనుగొని అర్చించి పరమానందాన్ని పొందే జ్ఞానులు ఎంతో అదృష్టవంతులు. వారు ఇహపర కోరికలన్నీ సంపూర్ణంగా పొంది చివరకు ఆనంద పరబ్రహ్మలో లీనమవుతారని నమ్మకం. ఈ కలియుగంలో స్మరిస్తే దర్శనమిచ్చే దత్తాత్రేయుని జననం స్మరించుదాం.
దత్తాత్రేయం మహం భజేత్రిలోక సంచారియైన నారద మ#హర్షి ముఖ్యమైన సమాచారములను ప్రముఖులకు ఎప్పటికప్పుడు అందించేవారు. ఆయన ఆకాశమా ర్గమున ప్రయాణించేవారు. ఒకసారి త్రిమూర్తుల నివాసాలకు వెళ్లారు అయ్యవార్లతో సంభాషణ చేయు సమయములో అమ్మవార్లయిన పార్వతి, లక్ష్మి. సరస్వతులు సహజ స్త్రీ స్వభా వంతో పతివ్రతామణుల గురించి అడిగారు. అప్పుడు నారదు డు అత్రిమహాముని భార్య అనసూయాదేవి భర్తను సర్వదా సేవిస్తూ అతిథి సత్కారం చేయడంలో ఆమెకు మించి ఎవరూ ఉండరని చెప్పారు. ఆమె పాతివ్రత్యం ఎంతో మహమను సం తరించుకున్నదని సెలవిచ్చాడు. ఈ సమాచారంతో త్రిమా తలు అసూయ చెంది అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించి, అవసరమయితే ఆమె స్థాయిని తగ్గించమని త్రిమూర్తులను వత్తిడి చేసారు. ఇక తప్పని పరిస్థితిలో వారు హమాలయ పర్వ తములలో గల అత్రి మ#హర్షి ఆశ్రమానికి బ్ర#హ్మజ్ఞాన రూప ములు ధరించి అతిథులుగా వచ్చారు. మహాసాధ్వి అనసూ య ఎదురేగి స్వాగతం పలికింది. అర్ఘ్యం, పాద్యం ఇచ్చి ”అ య్యలారా అత్రి మ#హర్షి #హమగిరులతో తపోనిష్టకు వెళ్ళారు. తమరు ఏతెంచిన కారణం ఏమైననూ మీరు ఈ ఆశ్రమంలో విశ్రమించండి” అని పలికింది. అంతవారు ”మీ భర్త వచ్చేవర కూ మేము ఆగలేము, మాకు చాలా ఆకలిగా ఉంది. మా ఆకలి తీర్చే మార్గం ఆలోచించి వెంటనే ఏర్పాట్లు చేయమని” కోరా రు. అనసూయ ఆశ్రమంలోకి వెళ్ళి వెంటనే వాళ్ళకు తగిన భో జన ఏర్పాట్లు చేసి భోజనానికి రమ్మని ఆహ్వానించింది. త్రిమూ ర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహశ్వరులు ముగ్గురూ విస్తళ్ళ ముందు కూర్చొని ”ఓ! సాధ్వీ మాకు ఒక నియమం ఉంది. ముందు మా షరతును నెరవేర్చి భోజనం వడ్డించాలి. నీవు వివ స్త్రగా పదార్థాలను వర్ణించాలి. అప్పుడు భోజనం చేస్తాము లేదంటే ఆకలితో వెళ్ళిపోతాము’ అన్నారు.
అతిథి ఆకలితో తిరిగి వెళ్ళిపోతే ఆ గృ#హము, యజమాని యొక్క సౌభాగ్యం, తపోబలం, పుణ్యఫలం ఆ ఆకలితో తిరిగి వెళ్ళిపోయే అతిథుల వెంట వెళ్ళిపోతుంది. ముఖ్యంగా గృహ యజమాని శోభా హీనుడవుతాడు. కాని వీరు విధించిన షరతు చాలా దారుణంగా ఉంది. వివస్త్రగా పరపురుషుల ముందుకు వెడితే తన పాతివ్రత్యం నాశనమయినట్లు ఏమిటీ పరిస్థితి? అని పరిపరివిధాల సతమతమవ్వసాగింది అనసూయాదేవి. కానీ వెంటనే, అసలు ఇటువంటి షరతుతో అత్రి మహాముని ఆశ్రమంలో ప్రవేశించడమే అసాధ్యం. కాబట్టి వచ్చినవారు అసమాన్యులని గ్రహించింది. లోపలికి వెళ్ళి భర్తను ధ్యానించి, నా బిడ్డలు ఆకలితో ఉన్నారు అనుకొని వివస్త్రగా వారికి వడ్డించ సాగింది. అప్పటికీ త్రిమూర్తులు ముగ్గురూ త్రి బాలలుగా క్రిం ద విస్తళ్ళముందు పడుకొని కాళ్ళు, చేతులు ఆడిస్తు న్నారు. అప్పటికే ఆమె మనోభావాన్ని బట్టి ఆమెకు స్తన్యంలో పాలు ఉదయించాయి. వెంటనే వస్త్రం ధరించి వారికి ఒకరి తరువాత ఒకరికి పాలిచ్చి వారి ఆకలి తీర్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గు రూ పసివాళ్ళై అత్రి మహర్షి ఇంట ఊయలలో విశ్ర మించసాగారు. మహాపతివ్రత అనసూయాదేవి విష యం అంతా గ్ర హించి సృష్టి, స్థితి, లయకారుల లీల లను జోలపాటగా పాడసాగింది. పసిబాలలైన త్రిమూ ర్తులు హాయిగా నిద్రపోయారు. ఈలోగా అత్రి మహర్షి వచ్చి విషయమంతా తన తపోదృష్టితో తెలుసుకుని జగన్నాటక సూత్రధారులను పరిపరివిధాల స్తుతిం చాడు. అత్రి, అనసూయల భక్తి, పాతివ్రత్య మహిమ కు పరమానందభరితులై తమ ఆకలి తీర్చిన అనసూ యాదేవిని వరం కోరుకోమన్నారు. అనుమతి కోసం భర్త వైపు చూస్తున్న అనసూయాదేవిని అత్రి మహర్షి ”ఓ సాధ్వీ అనితర సాధ్యమైన త్రిమూర్తి దర్శనం ఏకకాలంలో పొందావు. పసిపిల్లలై నీ మాతృప్రేమను పొందారు. సంకోచించక నీ కోరికను వారి ముందుం చమని తెలిపాడు. అంత అనసూయ ”స్వామీ! సృష్టిని పరిపూర్ణం చేయుచూ, విశ్వాన్ని వికాసవంతము చేయ డానికి మీరు భగవంతుని చేత సృజించబడ్డారు. కావున త్రిమూ ర్తులను పుత్రులుగా పొంది మీ ఆశయం నెరవేర్చుకోండి” అని భర్త అత్రిమహామునిని వేడుకొంది. మహదానందము తో అత్రి మహాముని ”మీరు మాకు పుత్రులుగా జన్మించి మమ్మల్ని కృ తార్థులను చేయండి” అని కోరాడు. అప్పుడు త్రిమూరు ్తలు ”ఓ పుణ్యదంపతులారా మేము ఇప్పటికే మీకు దత్తమయి పోయా ము. అపురూపమయిన మాతృత్వాన్ని రుచి చూసాము” అని వారికి తథాస్తు పలికి వారివారి లోకాలకు వెనుదిరిగారు. తదు పరి వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్రుడు, దత్తుడు, దుర్వాసునిగా జన్మించారు. అత్రి యొక్క సంతానం కనుక వారు ఆత్రేయులైనారు. వైష్ణవాంశయైన దత్తుడు దత్తా త్రేయుడైనాడు. తరువాత బ్రహ్మ అంశయైన చం ద్రుడు, శివుని అంశ అయిన దుర్వాసుడు తమ యొక్క దివ్య మైన అంశలను దత్తునియందుంచి తల్లి అనసూయాదేవి దగ్గర అనుమతి పొంది దివ్య తపస్సులో లీనమైనారు. త్రిమూర్తి అంశలతో అవ ధూత శ్రీ దత్తాత్రేయుడు నేటికీ ఈ భూలోక ములో సంచరిస్తూ ఉన్నాడు. జ్ఞానులను ఒక గురువుగా అనుగ్రహించేది శ్రీ దత్తాత్రేయుడని గురుపరంపర తెలియచేస్తోంది. త్రిగుణ రహిత భక్తులకు చాలా సులభంగా దర్శనమిస్తాడు. ఈ కలి యుగంలో భక్తులను అనుగ్రహించే మహిమాన్విత అవధూత యని గురుచరిత్ర తెలియచేస్తోంది.
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిమ్‌
సర్వరోగహరం దేవం దత్తాత్రేయం మహం భజే!!

త్రిమూర్తుల మూడు శిరసులతో, ఆరు హస్తాలతో వేదాలే నాలుగు భైరవమూర్తులుగా చేసుకొని అవతరించిన శ్రీ దత్తా త్రేయుని ఎవరైతే త్రికరణశుద్ధిగా స్మరిస్తారో వారికి దర్శన మిచ్చి అభయాన్ని చేకూర్చుతాడు. గురుపరంపరలో శ్రీ దత్తా త్రేయుడు అవధూతగా ఈ భువిలో అవతరిస్తూ ఉన్నాడని, కల్పాంతము వరకూ అలా కొనసాగుతూ ఉంటాడని జ్ఞానులు విశ్వసిస్తున్నారు. అవధూతను అన్వేషించే జ్ఞానులకు వారు లభి స్తున్నారు. వారి నుండి దివ్యానుభూతులు పొందుతున్నారు. ఈ ప్రకృతిలోని ఇరవైనాలుగు అంశలను తన గురువులుగా భావించి ఆ మహతత్త్వాన్ని మనకందించారు శ్రీ దత్తాత్రేయు లు. ప్రకృతిలో మమేకమై ఉండేవారే అవధూతలు.
”నమస్తే భగవన్‌ దేవ దత్తాత్రేయ జగత్‌ ప్రభో!
సర్వ రోగ ప్రశమనం కురు శాంతిమ ప్రయచ్ఛమే!!”

- Advertisement -
   

అంటూ మహాసిద్ధుడు అయిన దత్తాత్రేయుడిని నిత్యం స్మరిస్తే సర్వరోగ బాధల నుంచి విముక్తి పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement