Thursday, March 28, 2024

మహాభారత యుద్ధ సన్నాహం

శ్రీకృష్ణ భగవానుని రాయబార ప్రయత్నము కూడా కురుక్షే త్ర సంగ్రామమును ఆపలేకపోయినది. విదురుడు, సంజ యుడు, భీష్ముడు మొదలగువారు ఎంత చెప్పిననూ దుర్యోధను డు వినలేదు. సంజయుడు ధృతరాష్ట్ర, నీకు శ్రీకృష్ణ భగవాను ని శక్తి గురించి పరిపరివిధాల వివరించి కౌరవులను యుద్ధ ప్రయత్న ము నుండి విరమింపచేయవలెనని కోరెను.
భస్మ కుర్యాజ్జగదిదం మన సైవ జనార్దన:
నతు కృత్మనం జగచ్ఛక్తం భస్మకర్తుం జనార్ధనమ్‌!!
యత: సత్యం యతో ధర్మోయతో హ్రీరార్జవం యత:
తతో భవతి గోవిన్దేయత: కృష్ణస్తతో జయ:

శ్రీకృష్ణ భగవానుడు తన మానసిక సంకల్పమాత్రముననే ఈ సమస్త జగత్తును భస్మము చేయగలడు. కానీ ఈ సమస్త సృష్టి, జగ త్తు కూడా ఆయనను ఏమియు చేయ జాలదు. ఎక్కడ సత్యము, ధర్మము, లజ్జ, సరళత్వము ఉండునో అటువై పున శ్రీ కృష్ణుడు ఉం డును. ఎచట శ్రీకృష్ణుడు ఉండునో అచట అందుకే విజయముం డును. అని సంజయుడు ధృతరాష్ట్రనుకి తెలియచేసెను.
చివరకు ధర్మ సంస్థాపనకు యుద్ధము అనివార్యమయినది. కౌరవ, పాండవ పక్షములు రెండుగా చీలినవి. ఇరువైపులా గూఢ చారులు పనిచేయడం ప్రారంభమయినది. పాండవ గుప్తచరులు ధర్మరాజునకు సమాచారం తీసుకువచ్చారు.
కౌరవ శిబిరంలో దుర్యోధనుడు భీష్మాచార్యుని ఈవిధంగా ప్రశ్నించాడు. పాం డవులు అసంఖ్యాకమయిన రథ, గజ, తురగ, పదాతి దళాలను మీరు ఎన్ని రోజులలో నాశనం చేయగలరు. అలాగే ద్రోణాచార్యులవారు, కృపాచార్యులు, అశ్వత్థామ, కర్ణుని కూడా ప్రశ్నించాడు. ముందు భీష్మాచార్యుల వారు ఈవిధంగా చెప్పాడు. యు ద్ధాలలో నాకు గల అనుభవం, పరాక్రమం, శస్త్రబలం, భుజబల సామర్థ్యములను బట్టి ధర్మ యుద్ధం చేసేవారిలో ధర్మంగాను, కపట యుద్ధం చేసేవారితో, కపటంతోను యుద్ధం చేయాలని యుద్ధ నీతి చెబుతోంది. ఆవిధంగా జరిగే యుద్ధంలో నేను ప్రతి రోజూ పదివేల మంది వీరులకు, వేయి మంది రథికులను సంహరించగలను. కనుక నా మహా శస్త్ర, అస్త్రాలను ఉపయోగించి ఒక నెల రోజులలో మొత్తం పాండవ సైన్యా న్ని మట్టుబెట్టగలను అని చెప్పాడు.
ద్రోణుడు, నేను వృద్ధుడనైపోయాను. అయినా కూడా భీష్మాచార్యుని లాగానే నేను కూడా ఒక నెల రోజులలో మొత్తం పాండవ సేనను భస్మీపటలం చేస్తానన్నాడు.
కృపాచార్యుడు, నాకు రెండు నెలల సమయం పడుతుంది అన్నాడు. అశ్వత్థామ మాత్రం పది రోజులలో నేను పాండవ సేనను సంహరించగలనని తెలియ చేసాడు. కర్ణుడు చాలా గంభీరంగా నాకు ఐదు రోజులలో సమస్త పాండవ సేనను సర్వనాశనం చేయగల అస్త్ర, శస్త్ర సామర్థ్యం ఉంది అని తెలియచేసాడు.
ఈ మాటలన్నీ తెలుసుకున్న భీష్ముడు దుర్యోధనునితో శ్రీ కృష్ణునితో కూడి అర్జునుడు రథములో యుద్ధభూమిలో నున్నప్పుడు మాత్రం మీన బలాబల అం చనాలను పునరాలోచించుకోవలసి అవసరం ఉంటుంది అని కర్ణుని ఉద్దేశించి హచ్చ రించాడు. అంత దుర్యోధనుడు తమ బలాన్ని, యోధులను బేరీజు వేసుకుని విజయ గర్వంతో నున్నాడని పొండవ గూఢచారులు ధర్మరాజుకు సమాచారం నివేదించారు.
అప్పుడు ధర్మరాజు తమ తమ్ములను పిలిచి ఇలా అడిగాడు. సోదరులారా! గూఢచారులు తెచ్చిన సమాచారం మీరు వినే ఉంటారు. మరి మీరు ఎన్ని రోజులలో కౌరవులను వారి సైన్యాన్ని మట్టు బెట్టగలరు తిని అడిగాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడు కూడా అక్కడే ఆసీనుడై ఉన్నారు. అంత అర్జునుడు శ్రీకృష్ణుని వైపు చూసి, జనార్థనుని సహాయంతో నేను ఒక్కడినే రథాన్ని అధిరోహంచి క్షణకాలంలో ముల్లో కాలను, దేవతలను, సమస్త జీవులను నాశనం చేయగలను. త్రికాలాలలోను శ్రీ కృష్ణుడు నాప్రక్కన ఉండే చాలు. శంకరుడు ప్రసాదించిన ప్రచండమైన పాశుప తాస్త్రం నా దగ్గర ఉంది. శంకరభగవానుడు ప్రళయకాలంలో సమస్తాన్ని లయం చేయడానికి ఆ పాశుపత శక్తినే ఉపయోగిస్తాడు. ఈ శక్తిని గురించి భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలగు వారికి తెలియదు.
కాని ఇటువంటి ప్రచండ దివ్యాస్త్రాలను రణభూమిలో ప్రయోగించి శత్రువుల ను, నాశనం చేయడం ఉచితం కాదు. భుజబలంతో, దైవబలంతో యుద్ధం చేసి శత్రు వులను జయించడమే నా ఉద్దేశం. అదేవిధంగా మనకు సహాయం చేయడానికి మన పక్షంలో సింహా పరాక్రమవంతులు ఎందరో ఉన్నారు. వారు కూడా దివ్యమైన శస్త్ర ములు, అస్త్రములు కలవారు. యుద్ధములో అపార అనుభవం గలవారు, ధర్మపరు లు. కావున విజయం మనల్ని వరిస్తుంది. మన పక్షాన నిలబడిన మహావీరులు దేవతలను కూడా జయించగలరు. శిఖండి, యుయుధానుడు, ధృష్టద్యుమ్నుడు భీమసేనుడు, నకులుడు, సహదేవుడు, యధామన్యుడు, ఉత్తమౌజుడు, విరాటుడు, (ద్రుపదుడు, శంఖుడు, ఘటోత్కచుడు. అంచనపర్వుడు, అభిమన్యుడు, ఉపపాం డవులు మొదలగు వారు ఉండగా విజయుము తథ్యం. ఇక స్వయంగా మీరు ముల్లో కాలను నిలువరించగల సమర్థులు. మీ కళ్ళలో క్రోధాగ్ని రగిలితే సమస్తాన్ని భస్మం చేస్తుంది. కాబట్టి మనం యుద్ధానికి సన్నద్దుల మవడమే మిగిలింది అంటూ శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించాడు.
తరువాత తెల్లవారింది. కౌరవ సైన్యంలోని రాజులందరూ దుర్యోధనుని ఆజ్ఞతో స్నానాలు చేసి తెల్లని వస్త్రాలు ధరించారు. అస్త్ర శస్త్రాలు ధరించి హూమాలు చేసారు. ఐదు యోజనాలు గల ఆ రణభూమిలో వేల గుడారాలు వెలిసాయి. అందరికీ ఉత్తమో త్తమమైన భోజన ఏర్పాట్లు చేయబడ్డాయి. అనేక మంది వ్యాపారులు, వీక్షకులు కూడా వచ్చారు .
ఇక పాండవుల మహాసేనల దృష్టద్యుమ్నుని అధ్యక్షతన నిండుగా ప్రవహస్తున్న గంగానదిలా ఉంది. గుఱ్ఱాలకు, ఏనుగులకు, వాహన సేవకులకు, కాల్బలానికి, శిల్పు లకు, అత్యుత్తమైన భోజనసామాగ్రి ఇవ్వాలని ధర్మరాజు ఆదేశించాడు. వీరుల హర్ష ధ్వనులు ఆకాశంలో ప్రతిధ్వనించాయి. మొదట మూడు మహాదళాలుగా పాండవ మహాసేన కదిలింది. మధ్యలో యుధిష్ఠిరుడు, శ్రీ కృష్ణుడు, అర్జునుడు తమ తమ రథా లతో కదిలారు. వెనుకగా అనేక ఎద్దు బళ్ళు, దుకాణాలు, వాహనాలు, వెళ్ళాయి. ఒక్క సారిగా రణభూమి కురుక్షేత్రంలో అమితోత్సాహంతో లక్షలనుండి వీరుల శంఖా లు, భేరీలు మ్రోగసా గాయి. ధర్మాన్ని నిలపడానికి కురుక్షేత్రం ధర్మక్షేత్రంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement