Saturday, April 20, 2024

”మాసానాం మార్గశీర్షోహం”

బృహత్సామ తథా సామ్నాం
గాయత్రీ ఛంద సామహమ్‌
మాసానాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసు మాకర:

వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును” అంటూ సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతి యో గంలో చెప్పిన శ్లోకమిది. కార్తికేయుడు, కాల భైరవుడు, దత్తాత్రేయుడు, వంటివారితో పా టు స్వయం భగవాను ముఖత: ప్రకటితమైన శ్రీమద్భగవద్గీత అవతరించిన మాసం.
విభూతి యోగంలోనే ”నక్షత్రాణ మ హం శశీ” అన్నారు. చంద్రుడు తారానాధుడు. ”మాసాలలో మార్గశీర్షం- నక్షత్రాలలో చం ద్రుడు”- మృగశిరా నక్షత్రయుక్త పౌర్ణమాసి మార్గశీర్షం- ఈ మాసమునకు అధినాధుడు చంద్రుడు. మృగశిరా నక్షత్రమునకు కూడ చంద్రుడే అధినాధుడు. ఇంకే నక్షత్రానికి చం ద్రుడు ఆధినాధుడు కాడు. నక్షత్రములు మృ గశిరాదిగ నెలలు, మార్గశీర్ష మాదిగా లెక్కిం చెడివారు. అందువలన మార్గశిర మాసము నకు భగవానుడు ప్రాధాన్యత కలిగించారు.
విషవత్తు అంటే రాత్రి దివసముల సమా న కాలము. మృగశిరా నక్షత్రముతో మన పూ ర్వ రుషులు విషువత్తు నిర్ణయించారు. మృగ శిరా విషువత్తుతో మొదలయ్యే కాలం.
మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన పాశురము లను అనుగ్రహంచినది. ”మార్గళంగల్‌ మది నిజైన్ద నన్నాళాల్‌ మార్గశిరము వచ్చినది. పూ ర్ణచంద్రునితో కూడిన శుక్లపక్షము- వైష్ణవ మాసము- మార్గశీర్షము అనగా భగవంతుని పొందుదారి- ”నారాయణనే నమక్కే” అని శరణాగతి. భాగవతం దశమ స్కంధంలోనే భగవంతుని వెదకెడి ద్రోవలో హమంతంలో ప్రధమమాసంలో నందప్రజకుమారికలు భగ వత్‌ ప్రసాదం ”హవిష్యం భుంజాన:” కాత్యా యనీ వ్రతం చేయుటకు పూనుకొన్నారు.
మార్గశీర్షం పరమ పవిత్రం. నక్షత్ర మం డలంలో మూడు నక్షత్రాలు శీర్షాకృతిని పోలి ఉన్నందున ”మృగశీర్ష” అని పేరువచ్చింది. రాశి అధిపతి గురుడు, సూర్యచంద్రుల సమా గమమును సంతరించుకున్న ఈ మా సం విష్ణు ఆరాధనతో మోక్షదాయిని అయింది. ఒకప్పు డు మార్గశిరంలోనే సంవత్సరారం భం ఉండి నట్లు వాడకంలో ఉంది. భాగవత దశమ స్కం ధంలో బమ్మెర పోతనామాత్యుడు, గోపభామ లు ”మార్గశీర్షవ్రతం” జరిపారని పేర్కొన్నా డు. కోటి సూర్యగ్రహణ స్నానతుల్య ఫలాన్ని ఇచ్చే మార్గశిర శుక్ల ప్రతిపద, ఉమాహశ్వ ర, అనంత తృతీయ, యోగ తృతీయ, నామ తృతీయ, అనబడే శుక్ల తృతీయ నాడు రంభా వ్రతం, చవితి నాడు వినాయ క చతుర్థి వ్రతం, పంచమి నాడు దక్షిణాత్యుల నాగపూజ, శివుని రెండవ కుమారుడు, కుమారస్వామి, కార్తికే యుడు స్కంధేడు, గుహుడు, షణ్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలిచే సుబ్బారాయుడి షష్టినాడు స్కందవ్రతం, బ్రహ్మచారి పూజ, సర్పపూజ, సప్తమి సూర్య ఆరాధన, నందా సప్తమీ వ్రతం, అష్టమి నాడు కాల భైరవ పూజ, నవమి నాడు నందిని దేవి పూజ, దశమి నాడు ఆరోగ్య వ్రతం, మోక్షదైకాదశి, సౌఖ్య దైకాదళి అని పిలువబడే ఏకాదశి విష్ణు ఆరాధన, త్ర యోదశి హనుమత్‌ వ్రతం, ద్వాదశి నాడు తె లుగు వారి ఇలవేలుపు అయిన వేంకటేశ్వరుని పుష్కరిణికి తీర్ధదినంగా, త్రయోదశిన గోదావ రి ప్రాంత హనుమజ్జయంతిగా, చతుర్దశి దత్తాత్రేయ ఆరాధన పౌర్ణమి నాడు దత్త జయంతి, చంద్రపూజ, యమారాధన, కృష్ణ పక్ష ద్వాదశి మల్లన్న ద్వాదశిగా, చతుర్ధశి మాస శివరాత్రి, వ్రత నిష్ణాపరులకు ఆచరణ లో ఉన్నాయి. కార్తిక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు కోరలు తెరు చుకొని ఉంటాడు, ఈ రోజుల్ని యమ దంష్ట్రు లుగా చెబుతారు. మార్గశిర పౌర్ణమితో అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి కాబట్టి యముని పట్ల కృతజ్ఞత పూర్వకంగా మార్గశిర పౌర్ణమినాడు యమ ధర్మ రాజుని ఆరాధిస్తారు. ఈ పౌర్ణమి కోరల పున్నమి, నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహర్షి అత్రి, మహా పతివ్రత అనసూయలకు మార్గశీర్ష పౌర్ణమినాడు గురు స్వరూపంగా త్రిగుణాత్ముడు, త్రిముఖదేహుడు దత్త రూపం లో జన్మించిన ”దత్తాత్రేయుని జయంతి”ని మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలలో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవికాకుండా జ్ఞానమును పెంపొందించే ధనుర్మాసంలో ఓం కారాన్ని ధనువుగా, ఆత్మను బాణంగా, బ్రహ్మ మును లక్ష్యంగా చేసుకుని, సాధకులు నిశ్చల మనస్కులై ఏకాగ్రత చిత్తంతో ధ్యానం చేస్తే, త్వరగా లక్ష్య సిద్ధి కలుగుతుందనేది విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement