Saturday, December 7, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 37,38
37

యద్యప్యేతే న పశ్యంతి
లోభోపహతచేతస: |
కులక్షయకృతం దోషం
మిత్రద్రోహే చ పాతకమ్‌ ||
38
కథం న జ్ఞేయమస్మాభి :
పాపాదస్మాన్నివర్తితుమ్‌ |
కులక్షయకృతం దోషం
ప్రపశ్యద్భిర్జనార్దన ||

37-38 తాత్పర్యము : ఓ జనార్థనా ! లోభపూర్ణ చిత్తము కలిగిన వీరందరును కుల సంహారమునందు గాని, బంధువులతో కలహమునందు గాని దోషమును గాంచకున్నను, వంశనాశనము నందు దోషమును గాంచగలిగిన మేమెందులకు ఇట్టి పాపకార్యమందు నియుక్తులము కావలెను?

భాష్యము :ప్రత్యేర్థి యుద్ధమునకు గాని లేదా జూదమునకు గాని ఆహ్వానించినపుడు ఒక క్షత్రియుడు అకారణముగా దానిని తిరస్కరించరాదు. దుర్యోధనుడు యుద్ధానికి కాలు దువ్వెను గనుక పాండవులకు గత్యంతరము లేక యుద్ధమునకు అంగీకరించిరి. అయితే దుర్యోధనాదులకు యుద్ధపు పర్యవసానాలు అంతగా తెలియకపోవచ్చును. ఫలితము శుభకరమైనచో నియమమును ఖచ్చితంగా పాటించవలెను. అట్లు కానిచో నియమమునకు కట్టుబడి ఉండవలసిన అవసరము లేదు. కానీ అర్జునుడు, అన్నింటినీ సమీక్షించి పర్యవసానాలు దారుణంగా ఉన్నాయని భావించి తాను యుద్ధము చేయరాదనే నిర్ణయానికి వచ్చెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement