Sunday, March 26, 2023

పుణ్య‌క్షేత్రాల్లో కార్తీక శోభ‌..

ప్రముఖ ఆలయాల్లో కార్తీక మాసోత్సవాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హరహర మహాదేవ శంభోశంకర.. భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న కార్తీక మాసోత్సవాలు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆదేవాలయాల్లో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దీంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా నిబంధనలు పాటించాలని బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.

శ్రీశైలం : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భ్రమరాంభికా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి, అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వర : శ్రీకాళహస్తీశ్వరాలయంలో వేదోక్తంగా కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్దం పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
శ్రీకాళహస్తీ : వచ్చే నెల 2వ తేదీ వరకు ముక్కంటీశుని సన్నిధిలో ప్రతి రోజు లక్ష బిల్వార్చనతోపాటు కుంకుమార్చన సేవ కూడా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
కర్నూలు : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పత్తికొండలోని శ్రీ ఉరుకుండ ఈరన్నస్వామి వారి ఆలయంలో వైభవంగా కుంకుమార్చన, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అన్నవరం : సత్యదేవుని సన్నిధిలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని స్వామి వారి దర్శనార్దం భక్తులు భారీగా తరలివచ్చి మొక్కలు చెల్లించుకుంటున్నారు.
రాజమండ్రి : మార్కండేయ ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పుష్కరఘాట్‌ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి మార్కండేయ స్వామిని దర్శించుకుంటున్నారు.
ద్రాక్షారామం (తూ,గో జిల్లా) : శ్రీభీమేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాస వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటున్నారు.
యాదగిరిగుట్ట : వచ్చే నెల 4వ తేదీ వరకు యాదగిరి గుట్ట శ్రీయాద్రాద్రి లక్ష్మినృసింహ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు, అమ్మవార్లకు విషేష పూజలతోపాటు అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వరంగల్‌ : వేయి స్తంభాల రుద్రేశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు. భక్తులు రుద్రేశ్వరున్ని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు.
వేములవాడ : శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస వైభవం, భక్తులు ఆలయ ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
అలంపూర్‌ (మహబూబ్‌నగర్‌ జిల్లా) : అలంపూర్‌ జోగులాంబ ఆలయంలో కార్తీక మాసోత్సవాల వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌ : వెంగళరావు నగర్‌లోని శ్రీరామాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement