Thursday, September 21, 2023

జ్యోతిర్వేదం…విఘ్నేశ్వర నక్షత్రాలు

భారతీయుల అతిముఖ్య పండుగలలో ఒక పండగ వినాయక చవితి. పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితి.
సూర్యుడు అస్తమించగానే తూర్పున కొన్ని చుక్కలు ఉదయించును. ఆ చు క్కలు రాత్రియంతయు ఆకాశాన మెరసీ, సూర్యోదయమగు వేళకు పడమట అస్త మించును. అదే వేళకు మరికొన్ని చుక్కలు తూర్పున ఉదయించును. పున్నమి నాడు సూర్యుడస్తమించే వేళకే చంద్రుడు తూర్పున ఉదయించును. ఆవేళ చంద్రోదయమ ప్పుడు తూర్పున ఏ చుక్క ఉదయించునో ఆ చుక్కను బట్టి ఆ నెలకు పేరు ఏర్పడింది. ఈవిధంగా ఆయా మాసములను బట్టి, కాలగతులను బట్టి చుక్కలు మన భూమి చుట్టూ తిరుగుతున్నట్లు కనబడును. ఈ పరిభ్రమణ సందర్భాలలో కొన్ని చుక్కలు సుమారు రెండు వారాల కాలం సూర్యునితోనే ఉదయించి, సూర్యునితోనే అస్తమి స్తూ, రాత్రులు ఏ వేళప్పుడు చూసినా మనకు కనబడవు. ఆ దినాలు ఆ నక్షత్రమున కు ‘కార్తె’ దినం అంటారు. సూర్యాస్తమైన తరువాత సూర్యోదయం వరకు, రాత్రి ఏ వేళ చూసినా ఏ నక్షత్రపు కార్తెలో ఆనక్షత్రం మనకు కనబడదు. గ్రహాల విషయంలో ఈ కాలంను ‘మూఢం’ అంటారు. మూఢం అయిపోగానే ఇవి మరలా కనబడును.
ఏనుగు తొండం, లంబోదరం, ఎలుక వాహనంతో కూడిన నక్షత్ర స్వరూపుడగు విఘ్నరాజు ఉత్తరాకాశాన సూర్యోదయానికి పూర్వం తూర్పున ఉదయించును. తొలి నాడు విఘ్నేశ్వర చవితి. మరునాడే ఋషి పంచమి. కాబట్టి సప్త ఋషులు ప్రక్కనే మనం విఘ్నేశ్వర నక్షత్రాలను చూడగలం. సప్త ఋషులు ఏడు కొంగలు ఎగురుచు న్నట్లు కనబడునని ‘భాసుడు’ వర్ణించాడు. ఈ విఘ్నేశ్వర నక్షత్రాలు భల్లూకం రూపంలో, (ఎలుక- ఏనుగు) కనిపిస్తున్నవని పలు శాస్త్రకారులు నిరూపించారు.
భూభ్రమణం మొదలగు అనేక కారణముల వలన ఒకనాటి సూర్యోదయానికి ముందు ఉదయించిన నక్షత్రం మరునాడు నాలుగు నిముషాల ముందు ఉదయించు ను. పదునైదు దినాలలో 15 ృ 4 ్స 60 నిముషాలు, అనగా ఒక గంటకు ముందు ఉదయించును. నెలరోజులలో రెండు గంటలు ముందు ఉదయించును. 6 నెలలో 12 గంటల ముందు ఉదయించును. అనగా సూర్యస్తమానం వేళకు తూర్పున ఉద యించును. కాగా, భాద్రపద శుద్ధ చవితి నాడు సూర్యోదయానికి ముందు తూర్పున ఉదయించిన విఘ్నేశ్వర నక్షత్రం చైత్ర శుద్ధ చవితినాడు సూర్యాస్తమైన తరువాత తూ ర్పున కనబడును. కాబట్టి ఆనాడు వేదాలలో గణశ పూజ చేయమని చెప్పబడింది.

ఖగోళ దృశ్యాలలో విఘ్నేశ్వరుని కథ

- Advertisement -
   

ఖగోళంలో అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు నాగవీధి అని, రో#హణి, మృగశిర, ఆర్ద్ర నక్షత్రాలు గజవీధి అని పురాణాలన్నీ తెలుపుచున్నవి. కాబట్టి ఆర్ద్ర నక్షత్రం రుద్రు డు- ఈశ్వరుడు. ఈశ్వరుడు గజవీధిలో అనగా గజునిలో ఇరుకుకొని ఉండవలసి వచ్చింది. పిమ్మట రాశీ విభాగం వచ్చింది. మొదటి మూడు రాశులు మేషం, వృష భం, మిథునం. అందు మేషం- అశ్విని ్శ భరణి ్శ కృత్తిక 1/4; వృషభం- కృత్తిక 3/4 ్శ రోహణి ్శ మృగశిర 1/2. ఈ వృషభరాశియే నంది. మృగశిరలో సగం; ఆర్ద్ర నక్ష త్రం పూర్తిగాను, పునర్వసులో 3/4- అవి మిథునంలోకి వెళ్ళాయి.
గజవీధి నుండి- అనగా గజనిలో నుండి ఆర్ద్రం వెలికితీసి, వృషభం ఆర్ద్రకు వా #హనంను, ధ్వజాన్ని నై ఆర్ద్రను మిధునంలో చేర్చుటకు తోడ్పడింది. అంతకుముందు గజుని మూలముగా వేరైన పార్వతీ పరమేశ్వర మిథునమిపుడేం కాగల్గింది. గజచర్మ రూపాన్ని స్ఫురింపజేయు చిన్నచుక్కలు అనేకంగా ఆరుద్ర సమీపాన మీదుగా ఉన్నా యి. పార్వతీ పరమేశ్వరులకు ముద్దుబిడ్డడై, గజముఖుడై, పునర్వసు చుక్కలకు సమీ పంలో సప్తఋషుల పక్కనే విఘ్నేశ్వరుడున్నాడు. శివకేశవులందు భక్తి భావము గలవారికి విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడై ఖగోళములో సంబంధము కలుపుచు న్నాడు. శివాలయాలలో నందులు వృషభరాశి సంకేతములై ఉన్నాయి.
ఆకాశంలో గమనించే పన్నెండు రాశులలో వృషభ, మిథున రాశులు అందరికీ తెలుసు. మిథున రాశిలోని ఆర్ద్ర నక్షత్రం శివునికి సంకేతంగా చూస్తారు. వేదం కూడా ‘ఆర్ద్రయా రుద్ర: ప్రథమాన ఏతి’ అని చెపుతుంది. మిథునం అంటే పార్వతీ పరమే శ్వరుల అర్ధనారీశ్వర భావనా మైథునమే. దాని ముందున్న రాశి వృషభం. ఆకాశం లో వృషభ రాశి తూర్పున శివునికి ధ్వజంలా, పశ్చిమాకాశంలో అస్తమించే ముందు శివునికి వా#హనంలాగా కనిపిస్తుంది. అందుకే శివునికి నంది మాత్రమే వాహనంగా మన వారు నిర్ణయించిన ఖగోళాంశం. విఘ్నేశ్వర చవితి నాడు సాధార ణంగా హస్త నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండును. అనగా ఆవేళ నక్షత్రం హస్త, హస్తి అనగా ఏను గు తొండం గల జంతువు. విఘ్నేశ్వరునికి ఏనుగు తొండముంది. హస్త నక్షత్రానికి సవి తృ అధిదేవత. సవితృ అనగా సూర్యుడు. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించి శ్యమంత కమణిని సంపాదించెన ని పురాణాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement