Thursday, April 18, 2024

జీవన కరదీపిక


వేద ధర్మకర్మభూమిగా ప్రపంచానికే తలమాని కమై… ఋషి.. గురుపీఠమై.. వెలుగొందుతున్నది మన భారతదేశం. ఈ విశాల భారతదేశ ఆత్మ…. ధర్మానికి ప్రతి రూపం శ్రీరామచంద్రుడు. గొప్ప తనయుడు…. గొప్ప భర్త… గొప్ప నాయకుడు. గొప్ప పాలకుడు.. రామ మార్గమే మనకు శరణ్యం… ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం… ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం… రామాయణమే మన కు దారి దీపం… అద్భుతమైన జనరంజక మహాకావ్యం… రామాయణం అందులోని పాత్రలు అజరామరం..
శ్రీ రామ తారకమంత్రమే గెలుపు మంత్రం. రామా యణమే వికాస మార్గం.. సకల నీతి శాస్త్రాల సారం రామాయణం. రామాయణంలోని ప్రతి పాత్రతో… మనల్ని మనం సరిపోల్చుకుంటాం.. రామ కథ మనందరిని సంస్కారవంతులుగా తీర్చిదిద్ది… లోకానికి శాంతి చేకూరుస్తుంది. రామాయణం చదివినా, విన్నా మన కు పుణ్యం వస్తుంది. భక్తి ముక్తి ఆత్మార్ప ణకు అసలైన మార్గం శ్రీరాముని చరణాలే… జగదానంద కారకు డు… జానకి ప్రియ నాయ కుడు… మూర్తీభవిం చిన ధర్మ మూర్తి అయిన శ్రీరాముని నామ జపం పరమానంద కరము. ఒకే మాట.. ఒకే బాణం.. ఒకే పత్ని.. అన్న సిద్ధాంతానికి కట్టుబడి జీవనం… కోట్లాది ప్రజల ఆదర్శ దైవం శ్రీరామచంద్రుడు. రావణుని, వాలిని సంహరించినా రాజ్యానికై ఆశపడలేదు. రావణుని చంపిన తర్వాత… లంకాధి పతి కాలేదు. విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. కిష్కిందలో వాలిని చంపి అంగదుని యువరాజుగా పట్టాభిషేకం చేసి… ప్రపంచంలోని ఏ జాతి పైనా… దురా క్రమణ చేయని జాతిగా భారత జాతిని నిలబెట్టాడు. రాజంటే శ్రీరామచంద్రుడే.. రాజ్యమంటే… రామ రాజ్యమే… పక్షపాతం ఎరుగనివాడు. తల్లిదండ్రులంటే అమిత గౌరవం. ప్రజలంటే అంతకుమించిన అభిమానం. శ్రీరామచంద్రుడు అడవికి వెళుతున్నప్పుడు అయో ధ్య ప్రజలంతా దు:ఖిస్తుంటే… రథచక్రాల దుమ్ము లేచే విధంగా…. వాళ్ళు ఎవరూ నాకు కనిపించనంత వేగంగా…. రథాన్ని తోలమని సారధిని ఆజ్ఞాపిస్తాడు. మందస్మిత మృదు మధుర మితభాషి. శ్రీరాముని మనసులో ప్రతిష్టించుకుందాం. మన కర్తవ్యం విషయంలో తల్లిదండ్రులతో… అన్నదమ్ములతో… భార్యతో… గురువు లతో… ఆత్మీయులతో…. మిత్రులతో ప్రజలతో.. జటా యువుతో…. శత్రువులతో…. ఎలా మసలుకోవాలో… శ్రీ రాముని జీవిత సలక్షణాలను గ్రహించి ధర్మ మార్గంలో నడుద్దాం. మన యువతకు సంస్కారంతో పాటు జీవన లక్ష్యాన్ని అందించి శక్తివంతులుగా మలుచుకుందాం. నేడు శ్రీరామనవమి. అదిగో శ్రీ రాముడు సీతా సమే తుడై…లక్ష్మణ సమేతుడై…మన ఊరికొస్తున్నాడు భక్తితో కొలుద్దాం. ఎంతకాలం పుణ్య నదులు ప్రవహస్తూ ఉంటా యో… అంతకాలం సీతారాముల పుణ్య చరిత చల్లని తల్లి యై మనందరినీ చేరదీసి సంరక్షిస్తూనే ఉంటుంది. రామాయణం ఈ లోకంలో జీవించి ఉన్నంతకాలం. మన మనసుల్లో ఉన్నంతకాలం.. మన గుండెల్లో పదిలంగా ఉన్నంతకాలం.. మానవత్వం బతికుంటుంది. ప్రతి ఒక్క రూ యావన్మంది శ్రీమద్రామాయణమును అనుదినము భక్తితో శ్రద్ధలతో పాటించి సద్ధర్మాచరణమున తరింతురు గాక.

Advertisement

తాజా వార్తలు

Advertisement