Thursday, April 25, 2024

బ్రహ్మ సృష్టించిన జగన్నాటకం

”పురమేకాదశ ద్వారమ్‌” మానవ శరీ రాన్ని పదకొండు ద్వారాలతో ఒక గొప్ప నగరంగా నిర్మించాడు బ్రహ్మదేవుడు. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కు రంధ్రాలు, నోరు, నాభి, జన నేంద్రి యం, అపానం, శిరస్సుపైన గల బ్రహ్మరంధ్రం. పదునాలుగు లోకాలను సృష్టించిన భగవం తుడు బ్రహ్మను సృజించి సమస్త జీవరాశులను ఆయన నుండి విస్తరింపచేసాడు. వాటికి ఆకలిని కల్పించి ఆహారాన్ని అందించాడు. చివరకు సృష్టి యందు తృప్తిచెందని బ్రహ్మ మనిషిని సృష్టించి జగన్నాటకం మొదలెట్టాడు. మనిషిలో అగ్ని వాక్కుగా, వాయువు ప్రాణ మై ముక్కులో, సూర్యుడు చూపుగా కళ్ళలో, దిక్కులు శబ్దమై చెవులలో, మూలికలు స్పర్శయై చర్మంలో, చంద్రుడు మనసై హృదయంలో, మృత్యువు అపానమై బొడ్డులో, నీరు రేతస్సుగా జననేంద్రియంలో ప్రవేశించారు. తరువాత అవి జడంగా నిలిచాయి. వాటికి చైతన్యం కలుగచేయ కపోతే అవి నిరుపయోగం అని భావించిన భగ వద్‌ శక్తి చైతన్యముగా నడినెత్తిన ఉన్న బ్రహ్మ రంధ్రముగుండా ప్రవేశించింది. అప్పుడు శరీ రం, మనస్సు, ప్రాణం పనిచేయడం ప్రారంభిం చాయి. ఇంద్రియాలు చైతన్యవంత మయ్యాయి. శిథిలమైన శరీరంలోని ప్రాణం బ్రహ్మ రంధ్ర ముగుండా తిరిగి నిష్క్రమిస్తే అథో లోకాలకు పోతాడని వివరించాడు బ్రహ్మ. పునర్జన్మలేని జీవుడు బ్రహ్మరంధ్రమైన విదృతిగుండా పోయి ఆనందస్థాయిని చేరతాడు. బ్రహ్మ రంధ్రము గుండా ప్రవేశించిన చైతన్యమే ఆత్మ. సకల లోకా లను నడిపిస్తూ ఆక్రమించివున్నదే మహా చైతన్య ము. ఈ అద్భుత ప్రహేళికలో జరుగుతున్న అనం త విన్యాసమును వీక్షించు భగవంతుడే ఆత్మ. తండ్రి శరీరంలోనున్న రేతస్సు ప్రాణంగా తల్లి శరీరాన్ని చేరుతుంది. అది తల్లి శరీరంలో బస చేస్తుంది. అంటే తల్లి శరీరం, తండ్రి శరీరం, పిం డంగా మారిన చేరువైన శరీరం. ఇవి మూడూ శరీ రాలను మూడు అవస్థలుగా చెపుతారు. అవే జాగ్ర త్‌, స్వప్న, సుషుప్తావస్తలు. వీటిని మూడు కల లుగా ప్రస్తావించారు. ఇవి స్థితిరహిత అవస్థలు. సహజంగా కలలో లభించినవన్నీ మెలకువ రాగా నే అదృశ్యమయిపోతున్నాయి. సుషుప్తా వ్యవస్థ నుండి మేల్కొన్నపుడు కలలో అనుభవించినట్లు భావించిన సుఖం మాయమైపోతుంది. ఇదేవిధంగా జాగ్రదావ స్థలో భావన చేసే అనేక స్థితులు భగవదను భూతి పొందినప్పుడు అదృశ్యమవుతాయి. ఆత్మానం దానుభూతి కలుగుతుంది. అప్పుడు ‘నేను’ అనేది పోయి మిగిలిన జీవరాశుల గురించి ఆలో చన ప్రారంభమవుతుంది. అప్పుడు నాలో ఉన్న దే అంతటా ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. అదే మహాచైతన్యమయుడైన పరమాత్మ అని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఋగ్వేద మహా వాక్యమైన ”ప్రజ్ఞానం బ్రహ్మ” ప్రకృష్టమైన బ్రహ్మమే జ్ఞానం అని సూచిస్తుంది. బ్రహ్మ జ్ఞానం ప్రశస్తము.
దేహం తల్లి నుండి లభిస్తుంది. ప్రాణం తం డ్రి ద్వారా ప్రవేశిస్తుంది. భగవంతుడు ఆత్మగా ప్రవేశించి, చైతన్యవంతం గావిస్తాడు. పురుషు నిలోనున్న రేతస్సు స్త్రీలో ప్రవేశపెట్టి తిరిగి జన్మింపచేసుకుంటాడు. అది మొదటి జన్మగా పరిగణించవచ్చు. అంటే రేతస్సు శిశువుగా రూపొందుతుంది. రేతస్సు శిశువుగా మారి స్త్రీలో భాగమై పోతుంది. అందువలన స్త్రీ మాతృభావనతో పులకించిపోతుంది.
శిశువును గర్భకోశంలో ఆనందంగా పోషిస్తుంది. అందుకే సృష్టిలో మాతృమూర్తిని మహోన్నతంగా నిలిపాడు బ్రహ్మ. నవమాసాలు మోసి శిశువుకు జన్మ నిస్తుంది. ఇది రెండవ జన్మగా పరిగణించవచ్చు. తండ్రి నుండి తల్లిలో ప్రవేశం మొదటి జన్మ. తల్లి నుండి ఈ లోకంలోకి జన్మించడం రెండవ జన్మ. శిథిలమైన ఈ దేహం నుండి నిష్క్రమించి సత్కర్మల, దుష్కర్మల ఫలితాలను అనగా ప్రార బ్ధాన్ని అనుభవించడానికి మూడవ జన్మను పొందడం. తండ్రి తనయుడిగా జన్మించి తన ప్రతినిధిగా లోకంలో విడిచిపెట్టి తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు. చిత్రమైన రహస్యం ఏమిటంటే! ప్రతి ఒక్క రూ మాతృగర్భంలో గత జన్మల అనుభవాలను పొందుతారు. ఆ జన్మలలోని పాపపుణ్యాల అను భూతులు తెలుస్తాయి. దీనినే గర్భస్త నరకమం టారు. కాని ప్రథమ కేకవేసి తొలి వెలుగు మీద పడ గానే గతజన్మ జ్ఞాపకాలను ఆత్మ యొక్క మాయ చేత మరచిపోతాడు.
పరమాద్భుతమైన ఇటువంటి విషయాలు వేల సంవత్సరాల క్రితం ఉపనిషత్తుల రూపంలో పండితుల సభలలో చర్చించబడ్డాయి. ఈ జ్ఞాన సభలలో స్త్రీలు పాల్గొన్నారు. వేదకాలంలో చక్క ని ఆరోగ్యకరమైన ఎన్నో విషయాలు చిన్న వయ సులోనే నేర్పించబడ్డాయి. మనిషి, మరుజన్మ, శిశు జననం, గర్భ సమయంలో స్త్రీ తీసుకోవల సిన జాగ్రత్తలు మొదలైన విజ్ఞానము సమా జానికి అందచేయబడింది. సమాజానికి అందచేయు తమ ప్రతినిధులే సంతానమన్న భావన తల్లిదండ్రు లలో ఉండేది. అందుకే సత్‌సంతా నాన్ని అందించడానికి తల్లిదండ్రు లు సత్ప్రవర్తనతో ఒకటై భావితరా లకు మార్గం చూపారు. ఈవి ధంగా స్త్రీ పురుష సమాగమాన్ని ఒక పవి త్రమైన భావముతో గురుకులాల లో విద్యార్థులకు బోధించే వారు. ప్రకృతిని మనిషిని ఒకే సమ యంలో సృజించాడు బ్రహ్మ. సం సారమనే మహాసముద్రంలో పడ వేసాడు. అజ్ఞానం, కోరికలు, కర్మలు మొదలైన వాటివల్ల రోగాలు, వార్థక్యం, మృత్యు వు అనే భయంకర జంతువులు మహా సముద్ర ములో తిరగసాగాయి. నిత్యం ప్రమాద కర భీకర అలలు లేస్తూనే ఉంటున్నాయి. విశ్రాంతి అను పదానికి చోటే లేదు. ప్రాపంచిక సుఖాల కోసం చేసే కర్మల వల్ల అలల ఉధృతి పెరుగుతోంది. స్వర్గ నర కాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోలేని అజ్ఞా నం నురగగా ఏర్పడింది. ఆది అంతములేని ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఏదైనా తెప్ప దొరుకుతుందా అని కొంతమంది మనుషులు జిజ్ఞాసువులై ఆలోచించడానికి అవకాశం కల్పిం చింది కూడా ప్రకృతే!
సత్యం, నిజాయితీ, దానం, కరుణ, అహిం స, ఇంద్రియ నిగ్రహం, ఆత్మనిగ్రహం, సహనం మొదలైనవి తెడ్లుగా చేసుకున్న తెప్ప సాధు సాంగ త్యం అనే ప్రశాంత జలమార్గంలో ప్రయాణిస్తే అది తప్పనిసరిగా జన్మరాహిత్యమనే తీరాన్ని చేరుతుందని మన సనాతన మహావాఙ్మయం తెలియచేస్తోంది. ఇక ఆలస్యం చేయకుండా వేద సారమైన ఉపనిషత్తులను అధ్యయనం చేద్దాం, చేయిద్దాం.

– వారణాశి వెంకట సూర్యకామేశ్వరరావు
8074666269

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement