Thursday, April 25, 2024

శ్రీహరి అవతారాలు… అంతరార్థం

”య దా యదా హ ధర్మస్య గ్లా నిర్భవతి భారత!
అభ్యుత్థాన మీ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహమ్‌!!”

అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అంటే ధర్మం నశించి, అధర్మం పెచ్చుమీరునప్పుడు, దేవతలకు హాని కలుగునప్పుడు, నన్ను నేను సృష్టించుకొం టాను అని. సందర్భానుసారంగా, జగత్‌కళ్యాణానికి, ధర్మం కాపాడడానికి అవతారా లు ధరించాడన్న విషయం మనకు అవగతమే! భాగవతంలో శ్రీహరి అవతారాలు ఏకవింశతి అని పేర్కొంటే, కొన్ని పురాణాలలో అవతారాలు ఇరవైనాలుగు అని చెపుతున్నాయి. మనకు తెలిసిన దశావతారాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. అవే మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కావతారాలు. ఇవన్నీ లీలావతారాలు. జీవన పరిణామక్రమంలో ముందుగా మహాతత్త్వ సృష్టి, రెండవది అండగతమైన సృష్టి, మూడవది సమస్త భూతగణమైన సృష్టి. అందుకేనేమో పరమాత్మ మత్స్యావతా రం, కూర్మావతారం, నృసింహావతారాలను సృష్టి క్రమంలోనే ధరించాడని భావించవచ్చు.
యజ్ఞవరాహావతారం: హరణ్యాక్షుడు తన పరివారంతో భూమిని ఒక చాపలా చుట్టే సి, పాతాళంలో విసిరేసే ఉద్దేశంతో సముద్రంలో దాగి ఉండగా, శ్రీహరి తన శక్తిని ఉపయోగించి భూమిని తన కోరలపై పెట్టుకొని పైకి వచ్చాడు. అపుడు బ్రహ్మ సృష్టి ప్రారంభం చేసాడు. దీనిలోని అంతరార్థం ఏమిటంటే అధర్మ నిరతులకు శిక్ష తప్ప దని, భగవంతుని శక్తి తెలియచేయడానికి, ఆయన అన్ని జీవరాసులలో తన ఉనికిని చాటడానికి, అవతారం ధరించాడు.
మత్స్యావతారం: సృష్టి సమయంలో మనువు ఒక నది ఒడ్డున కూర్చుని, జలప్రళ యాన్ని చూసి, భయపడుతుండగ ఒక చేప సమీపించి, సృష్టికి అవసరమైన బీజాలు, ఓషధులు, వేసుకుని, సప్తఋషులతో సిద్ధంగా ఉండమని, చెప్పి వెళ్ళింది. తరువాత వచ్చి, అందరూ ఉన్న పడవను తన కొమ్ములకు కట్టించుకొని చాలా దూరం వెళ్ళి, భూమి ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లింది. అప్పటి నుండే వైవస్వత మన్వంతరం ప్రారం భం అయింది. ఇది ఒక ప్రయోజనం. మరో ప్రయోజనం, బ్రహ్మ యోగ నిద్రలో ఉండగా, వేదాలను సోమకుడు అనే రాక్షసుడు అపహరిస్తే ఇదే మత్స్యం ”శఫరి” పేరుతో సోమకుడుని సంహరించి, వేదాలను కాపాడింది. దీనివల్ల జ్ఞానాన్వేషణకు ఎంత లోతుకు వెడితే అంత జ్ఞానం సిద్ధిస్తుందని. జలకాలుష్య నివారణకు, ముందు గా చెప్పుకొన్న దాని ద్వారా ఆపదలో ఉన్నవారిని కాపాడాలని తెలియపరుస్తోంది.
కూర్మావతారం: క్షీరసాగర మథనం సమయంలో మందరగిరి పర్వతం సముద్రం లోకి జారిపోతే, ఆటంకం తొలగించడానికి దేవతల కోరిక మేరకు శ్రీహరి కూర్మావతా రం ధరించాడు. సరైన ఆధారం క్రింద లేకపోవడం వల్లే మందరగిరి పర్వతం జారి పోయింది. అంటే ఇంటికి, ఏ కార్యసాధనకైనా గట్టి పునాది అవసరమని చెపుతోంది. కార్యసాధనకు ఉపయుక్తమైన వాటిని ముందుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెపు తోంది తాబేలు. శత్రువులు దాడి చేసే సమయంలో తన భాగాలన్నీ లోపలికి ఇము డ్చుకుంటుంది. అంటే శత్రువుల పాలిట జాగరూకతతో ఉండాలని సూచిస్తోంది .
సింహావతారం:—శ్రీహరి ఈ అవతారం ఎందుకు ధరించాడో మనకందరికి తెలుసు. అంతరార్థమేమిటంటే తన అనన్యభక్తుల రక్షణ వహస్తాడని ఋజువు చేయడమే. తన భక్తుడు చెప్పిన రీతిలో ఇందు గలడందు లేడని సందేహము వలదు అని చెప్పిన మాటలు సత్యం చేయడానికి, తాను సర్వాంతర్యామినని ఋజువు చేయడానికి అవ తరించినట్లు ఉంది. అంతేకాక భగవతత్త్వం మనం తెలుసుకొనడానికి, మనిషిలోని క్రోధం, రౌద్రం, వంటి దుర్గుణాలు వదలమని తెలియచేస్తోంది.
వామనావతారం: ఇంద్ర పదవి ఆశించి, దానకర్ణుడుగా పేరుపొందిన బలిచక్రవర్తి లోని అతిశయాన్ని తగ్గించడానికి, జన్మత: రాక్షసుడు, ఇతనే ఇంద్ర పదవి అలంకరి స్తే, దేవతలు తమ ప్రాభవాన్ని కోల్పోకుండా, అసురులు చేసే అకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకే, శ్రీ మహావిష్ణువు పొట్టిగా, మరుగుజ్జు రూపంలో, ఒక బ్రాహ్మణ బాలుడు గా వచ్చి, మూడు అడుగుల నేల ను దానం కోరాడు. మూడో అడుగు బలి తలపై పెట్టి, పాతాళానికి అధిపతిని చేసాడు. అతిశయం, గర్వం ఉంటే పరాభవం తప్పదని, దుష్టులను చేరదీయడం వల్ల కలిగే నష్టాన్ని తెలుపుతోంది.
శ్రీ రామావతారం: పితృవాక్య పరిపాలన, అన్నదమ్ముల అనుబంధం, ఏక పత్నీ వ్రతం, ధర్మపాలన, సత్యవాక్కు, కర్తవ్య నిష్ఠ వంటి సుగుణాలను అను సరించి, జగత్తుకు అందించిన అవతారం. ఎన్నో యుగాలైనా, ఆయనను అనుసరిస్తున్నా మంటే, ఆయన చూపిన మార్గానికి ఉన్న విలువ. లోకకళ్యాణం నిమిత్తం, ప్రజలు ఎలా జీవించాలో ఎత్తి చూపిన అవతారం.
శ్రీకృష్ణావతారం: నిరంజనుడు, సచ్చిదానందుడు, అయిన పరమాత్మే సాకార రూపముగా శ్రీకృష్ణుడుగా అవతరించి, అనేక లీలలు చేసాడు. శ్రీ కృష్ణావతారంలో అలజడులు, వనవాసం, వంటివి ఏమీ లేవు. ఆయన జీవి తంలోని ప్రతీ సంఘటన ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంది. మానవ జీవితానికి అవసరమైన ముక్తి మార్గంలోకి వెళ్ళడానికి అవసరమైన కర్మ- భక్తి- జ్ఞాన మార్గాలు, మనం త్రిగుణాతీతుడుగా ఎలా జీవించాలో లోకానికి ‘భగవద్గీత’ ద్వారా అందించిన అవతారం. గోపికలు, రాధ వంటి వారి ద్వారా భక్తి తత్త్వాన్ని తెలియచే సాడు. అంతేకాదు, కపిల మహ ర్షిగా అవతరించి, తల్లి దేవహూతికి సాంఖ్యయోగాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశిం చాడు. ఈ అవతారంలో తల్లి ద్వారా లోకానికి తెలియజేయడం ముఖ్య ఉద్దేశం. మానవుడు సృష్టిలోని ప్రతీ జీవి నుంచి అంటే కీటకాలు, పక్షులు, జంతువులు, ప్ర కృతి, ఇలా ప్రతీ అంశంనుంచి ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గాన్ని తెలియపరచడా నికి దత్తాత్రేయ అవతారంగా దర్శనమిస్తాడు. జ్ఞాన ప్రదాతగా, వేద సంరక్షకుడుగా, శత్రు వినాశకుడుగా, శ్రీహరి హయగ్రీవుడుగా కనపడుతున్నాడు. ఇలా ప్రతీ అవ తారంలో ఒక విశేషం, లక్ష్యం, అంతరార్థం కనపడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement