Wednesday, April 24, 2024

నందంపూడిలో.. నందిలేని శివాలయం!

కార్తీకమాసంలో భక్తుల తాకిడి.. నూరు రెట్లు ఫలితమిచ్చే ఉమా రామలింగేశ్వరుడి క్షేత్రం ఇది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత వుంది. శివుని వాహనం నందీశ్వరుడని అందరికీ తెలిసిందే.. ప్రతి శివాలయంలోనూ నందీశ్వరుడు పరమేశ్వరుని గర్భాలయం బయటే ఉంటాడు. అయితే నంది లేకుండా శివాలయం ఉంటుందా అంటే, ఉంది మరి. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం నందంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో నంది లేకుండానే శివాలయం ఉంది. బహుశా దేశంలోనే నంది లేకుండా ఉన్న శివాలయం ఇది ఒకటే కావచ్చు. ఇక్కడ స్థలపురాణం, క్షేత్ర విశేషాలు గురించి తెలుసుకోవలసిందే.

ఆలయ చరిత్ర….
త్రేతాయుగంలో పరశురాముడు ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్లు లింగ పురాణం ఆధారంగా తెలుస్తోంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో అప్పటి పాలకులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయంలో లభించిన రాతి, తామ్ర శాసనాల ద్వారా తెలియ వచ్చింది .ఈ ఆలయా నికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఆలయ అర్చ కులు యలమంచిలి సుబ్రహ్మణ్య శర్మ వివరించారు. నందంపూడి శివాలయంలో శివుడు పశ్చిమాభిముఖు డుగా ఉంటాడని,గర్బాలయంలో పానుపట్టం ఉండదని తెలిపారు. ముఖ్యంగా అమ్మవారు గర్భాలయంలో ఉండరని, అంతరాలయంలో ఉత్తరాభి ముఖంగా ప్రతిష్ఠితమై ఉన్నారని వివరించారు.

గ్రామ చరిత్ర…..
నందంపూడి గ్రామాన్ని 11వ శతాబ్దంలో రాజ మహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టుకు అగ్రహారంగా దానం చేసాడని తెలు స్తోంది. అయితే ఆలయంలో ఉండే రాతి శాసనం పై ఆనందపురి అని లిఖించబడింది. కాలక్రమేణా అది నందంపూడిగా మారింది.
సంతాన పార్వతి…
జమదగ్ని మహర్షి, రేణుకల కుమారుడు, బ్రహ్మ చారి అయిన పరశురాముడు ఆలయంలో రామ లింగేశ్వ రుని మాత్రమే ప్రతిష్టించడంతో నందంపూడి గ్రామంలో దంపతులెవ్వరికీ ఆ రోజులలో సంతానం లేకుండా పో యిందని, వారి బంధువులు, స్నేహితుల వద్ద నుండి పిల్ల లను దత్తత తెచ్చుకొనేవారని, వారి వివాహానంతరం వారికి సైతం సంతానం కలగక పోవడంతో గ్రామ జమిం దార్‌ వడ్లమాని కామేశ్వరరావు ముత్తాతల హయాంలో ఒక మహమాన్విత స్వామీజీ గ్రామానికి రావడంతో ఆయనకు గ్రామస్తులు తమ సమస్య గురిం చి మొరపెట్టుకొన్నారని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. ఆ స్వామీజీ తన దివ్యదృష్టితో పరి స్థితిని తెలుసుకొని (సుమారు 350 సంవత్సరాల క్రితం) పార్వ తి అమ్మవారిని ప్రతిష్టించడంతో అప్పటి నుండి ఆ గ్రామంలోని ప్రజలకు సంతానం కలుగుతోందని, దీనితో అమ్మవారు సంతాన పార్వతిగా ఖ్యాతి గాంచారని సుబ్ర హ్మణ్యశర్మ వివరించారు. అంతేకాకుండా సంతాన పార్వతీ అమ్మవారి మహిమలను తెలుసుకొన్న, సంతాన లేమితో బాధపడుతున్న కొంతమంది బయట ప్రాంత వాసులు కూడా ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించు కుని సంతానాన్ని పొందిన దాఖలాలున్నాయని సుబ్ర హ్మణ్య శర్మ తెలిపారు.
నంది వాహనం ఎందుకు లేదు….
సాధారణంగా ప్రతి దేవాలయంలో కొలువై ఉన్న భగవంతునికి ఒక వాహనం ఉంటుంది. పరమేశ్వరునికి ప్రథమగణాలలో అతిముఖ్యుడైన నంది వాహనంగా ఉంటూ, ప్రతి శివాలయంలో నంది విగ్రహ రూపంలో గర్భాలయంలో వేంచేసిఉన్న, లింగాకారంలోని పరమే శ్వరునికి అభిముఖంగా అంతరాలయంలో ఉంటుందని సుబ్రమణ్య శర్మ తెలిపారు.మనం ఆయా ఆలయాలలో నెలకొని ఉన్న భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళిన ప్పుడు, ఆ భగవంతుని వాహనం అనుమతి తీసుకుని, దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే నందీశ్వరుడు, పరమేశ్వరుని ఒక కోరిక కోరాడని, తన అనుమతి లేకుం డా భక్తులకు నేరుగా శివ దర్శనం ఇవ్వాలని కోర డంతో ఈ ఆలయంలో మాత్రమే నంది ఉండదని వివ రించారు. అందువల్లే ఈ శివాలయంలో భగవం తుని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని సేవిస్తే నూరు రెట్ల ఫలితం లభిస్తుందని సుబ్రహ్మణ్య శర్మ వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement