Thursday, April 18, 2024

గృహస్థ ధర్మంలోనే వెూక్ష సాధన

ధర్మరాజు తన తాతగారైన భీష్ముడును అడిగి ఎన్నో ధార్మిక విష యాలను తెలుసుకొన్నాడు. ఆ సందర్భంలోనే, ఒకసారి ”తాతా! గృహస్థ ధర్మం లో ఉంటూనే మోక్షాన్ని పొందవచ్చునా? అని అడిగాడు. దానికి భీష్ముడు సమాధానం ఇస్తూ ”ఈ విషయంలో జనక మహారాజుకు సులభ అనే వనితకు మధ్య జరిగిన సంవాదాన్ని వివ రించాడు. సులభ అనే వనిత యోగ ధర్మా లను, అనుసరిస్తూ, భగవతత్త్వం తెలుసు కొంది. జనక మహారాజు గొప్ప ధార్మికుడు. తత్త్వవేత్త.
ఎందరో ఋషులు వద్ద ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొన్నవాడు. అటువంటి జనకుడను ఈ సులభ అనే మహిళ పరీక్షించాలని, ఆయన జ్ఞానం ఎంతవరకు విస్తరించిందో తెలుసు కుందామని, దర్బారుకు వచ్చింది. ఆమె సౌందర్యంతో, మంచి శరీర సౌష్ఠవంతో ఒప్పా రుతూ జనక మహారాజును సందర్శించి, తాను ”భిక్షుకి” (భిక్షాటన చేసే స్త్రీ) నని, తనకు తెలుసున్న ఆధ్యాత్మిక మాటలను చెప్పింది. జనకుడు ఆమెను సాదరంగా ఆహ్వానించి ఆతి ధ్యం ఇచ్చారు. అప్పుడు ఆయన నిజంగా విర క్తుడో, కాదో? మోహావేశంలోనే ఉన్నాడా? అని పరీక్షించాలని, తను శృంగార చేష్టలతో, మన్మ థ వికారం కలిగించబోయింది. ఆమె భావాన్ని గ్రహించి, లోపలే నవ్వుకొని ”ఓ! సుదతీ! నీవె రవు? ఏ ఊరు? ఎక్కడికి వెడుతున్నావు? ఏమి చేస్తూంటావు? నీ వివరాలు తెలియ చేయి!” అని అడిగి, ముందుగా నేను చెప్పే విష యాలు గమనించమని చెప్పాడు.
”ఓ! పద్మాక్షీ! పంచశిఖుడనే మహర్షికి నేను శిష్యుడను. నేను ఎంతోమంది మహర్షు లతోను ఆధ్యాత్మిక జ్ఞానవంతులతోను గోష్టు లను ఏర్పాటు చేసినవాడను. నాకు సాంఖ్య, యోగ శాస్త్రాలలోను, రాజ్యపరిపాలనలోను, పలు సూచనలు పొందినవాడను. అందుచేత నేను నిష్కామంగా, నిస్సంశయంగా ఉంటూ పరమాత్మను సేవిస్తున్నవాడను. ముక్తికి వైరా గ్య మే మూలం. వైరాగ్యానికి జ్ఞానమే ఆధారం.
కాబట్టి, జ్ఞానంతో కూడిన విరక్తి నా అంత రంగంలో ఉండటంవల్ల, సుఖ దు:ఖాలు, రాగద్వేషాలు వంటి వాటికి అతీతంగా జీవిం చగలుగుతున్నాను. ఓ! యోగినీ! నా శరీరాన్ని చందనంతో పులిమినా, కత్తితో నరికినా, ఒకే విధంగా స్పందిస్తుంది. నా దృష్టిలో బంగారా నికి, మట్టికి తేడా లేదు సుమా! రెండూ సమా నమే. ఓ! మానినీ! జ్ఞానం వలననే ముక్తి లభి స్తుంది. దండ, కమండలం, మెడలో రుద్రా క్షల వల్ల రాదు కదా!
నేను రాజ్యపాలన చేస్తున్నా, కర్తవ్యంగా భావించి, రాగభోగాదులను అన్నింటినీ జ్ఞానం వల్ల తెలుసుకొని ప్రవర్తిస్తున్నాను. నువ్వు నన్ను పరీక్షించడానికి వచ్చావు. నేను ముక్తుడనయ్యానో లేదోనని పరీక్షించడానికి వచ్చిన ఏ ధర్మదేవతవో? అలాకాకుండా నువ్వు ఏ శృంగారపరమైన వాంఛతో వచ్చిన ట్టయితే, నువ్వు బ్రాహ్మణ వనితలా కనపడు తున్నావు. నేను క్షత్రియుడను. నేను యోగిని నేను గృహస్థుడను. నేను ఆచార్య పరుడను. నువ్వు నా గురించి తెలుసుకొనే వచ్చావు కదా! నీవు మన్మథ చేష్టలతో ప్రవర్తించడం ధర్మ మేనా? నేను ముక్తుడనయ్యానని తెలిసి నీ చేష్టలు మానుకోవద్దా?” అన్నాడు.
జనకుడి మాటలు శ్రద్ధగా ఆలకించిన ఆమె ”రాజా! వినే వ్యక్తికి, చెప్పే వ్యక్తికి, హత మైన పద్ధతిలో వెలువడినదే సరైన మాట. నా వివరాలు అడిగావు కదా. చెపుతున్నాను. నేను ప్రథన మహారాజు వంశంలో పుట్టినదానను. మా వంశచరిత్ర జగదాదాయకం. నా పేరు సులభ. మా వంశంలో మా పూర్వీకులు మహా యజ్ఞాలు చేసారు. ఇంద్రుడు తనంతట తాను వస్తే, మా పెద్దలు ఆయనతో పారమార్థిక గోష్ఠి జరిపేవాడు. నాకు సరైన పురుషుడు, కన పడకపోవడం వల్ల, నేను వివాహం చేసుకో లేదు. నేను యోగినిగా మారి, మోక్ష ధర్మం పట్టి, ఇలా తిరుగుతున్నాను. నువ్వు అనుకొ న్నట్టు నేను బ్రాహ్మణ వనితను కాదు. నన్ను నేను కప్పిపుచ్చుకొనేది ఏమీలేదు. జనక మహారాజు ముక్తుడా? కాదా? పరిశీలిద్దామని వచ్చాను. ఇందులో తప్పేమీ లేదు కదా! యోగులు వలె యోగినుల మనస్సులు కూడా రాగద్వేషాలు లేకుండానే ఉంటాయి. నేను నిన్ను తాకలేదు. అటువంటప్పుడు నేను శృం గార మోహంలో ఉన్నానని ఎందుకు భ్రమిం చావు? ఇంకా నీలో పరిపూర్ణ త్వం రాలేదు. లేక పోతే నువ్వు అలా అడగవు. అందరి శరీ రాల్లో పంచ భూతాలు, మనసు బుద్ధి, దశేంద్రి యాలు (పంచ జ్ఞానేద్రియాలు, పంచ కర్మేంద్రి యాలు) అన్నీ ఉంటాయి కదా. నీలో నువ్వు చూసుకొన్నట్లు, ఇతరులను కూడా చూడాలి. నీలో ఇంకా బేధ భావం ఉంది. నువ్వు పంచ శిఖ మహర్షి శిష్యుడవయినా, ఆయన చెప్పిన బోధనలన్నీ మరోసారి మననం చేసుకొంటే నీవు ముక్తుడవుతావు. రాజుల హృదయం ఎప్పుడూ వర్గత్రయ కాంక్ష అంటే రాజధర్మం, ధనాగారాన్ని కాపాడుకోవడంలాంటి విష యాలపైనే వుండాలి. నీ ఆధ్యాత్మిక జీవన సాధన అంశాలు మనస్సును పట్టి పీడిస్తుంటా యి. ఆ పరిస్థితిలో మనస్సును నిగ్రహించి, ముక్తిమార్గంలోకి ఎలా తేగలవు? మహారాజా!
యోగీశ్వరులు ఏ అడవిలోనో, శూన్య ప్రదేశాలలోనో నివశిస్తూ భగవత్చింతన చేస్తా రు. నేను తామరాకు మీద నీటిబొట్టు వలె నిస్సంగంగా జీవిస్తున్నాను. నన్ను నువ్వు తెలిసికోలేకపోయావు.” అంటూ సులభాదేవి జనక మహారాజుకు మరికొన్ని మోక్షసాధనకు మార్గాలు చెప్పి, ఆయన ఆతిధ్యం స్వీకరించి వెళ్ళిపోయింది. జనక మహారాజు ఆమె చెప్పిన విషయా లు గ్రహించాడు. కాబట్టి మోక్షం కావాలను కొన్న గృహస్థుడు కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను వదిలి వేసి, నిర్వికారంగా ధ్యాస భగవంతునిపై ఉంచాలి.

  • అనంతాత్మకుల రంగారావు
    7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement