Monday, September 25, 2023

బలహీనతలో దైవసాయం

మన బలహనత నెరిగిన దేవుడు వాటినుంచి మనం బయటకు రావడానికి ఎల్లవేళలా సాయపడతా డు. దుర్గతి నుంచి సద్గతి లోనికి చీకటి నుండి వెలుగు లోనికి మరణము నుండి జీవంలోనికి నడిపిస్తాడు. లోక మివ్వలేని ఓదార్పును అనుగ్ర#హస్తాడు. నిన్ను మానసి కంగా బలపరచి చావు గోతి నుంచి తప్పిస్తాడు.
మానవులు పైకి కనిపించేటంత బలవంతులుకా రు. ప్రతి వారిలో ఏదో ఒక మానసిక బలహనత కొనసా గుతుంది. ఇది ఎదుటి వారికి కనిపించదు. కేవలం అతని తో సహజీవనం చేసేవారికి వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. కొన్నిసార్లు వారికి కూడా తెలి యకపోవచ్చు. కొంతమంది ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడేస్తారు. ఇది కనీసం తప్పనికూడా గ్రహంచరు. వీరిని చూసి వారి పిల్లలు అబద్ధాలకు అలవాటుపడతారు. కొంతమంది నోరు తెరిస్తే బూతులు. అందరూ వినేలా సరసోక్తులు పోకిరి మాటలు మాట్లాడుతూ వుంటారు. అందమైన భార్య, అల్లారుముద్దుగా పెరిగే పిల్లలు మం చి హోదా ఉండి సమాజంలో మంచి పేరు ఉన్నా మానసిక దౌర్భల్యంతో బజారుల్లో తిరిగే వేశ్యలతో పొం దుకోరే పురుషులు కుటుంబానికి ఎంతో అపకీర్తి తెస్తారు. భార్యకు పుట్టెడు దు:ఖం మిగుల్చుతారు. సమాజంలో పేరు తెచ్చుకున్న వారు సైతం తాగుడుకు బానిసలైపోయి ప్రతి రాత్రి కుటుంబానికి నరకం చూపెడతారు. లక్షల జీతాలు ఆర్జిస్తూ ఆనందం గా బతకాల్సిన సమయంలో కక్కుర్తి పడి రెండువేల రూపాయల లంచం తీసుకుం టూ పట్టుబడి కుటుంబాలకు తలవంపు తెచ్చేవారు లెక్కకుమించే ఉన్నారు. పేకాటరాయుళ్లు, మద్యపానం, మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డవారు గుప్తనిధి దొరు కుతుందని నరబలికి పాల్పడేవారూ ఇలా జాబితా పెరు గుతూనే వుంది. పుర్రెకో బుద్ధి అన్న లోకోక్తిని నిజం చేస్తూ మనుష్యుల్లో ఉన్న బలహనతలు అంచనా వేయడం కూ డా కష్టమే. కొన్నిసార్లు వీరి బలహనతలు చూస్తే ఆశ్చ ర్యం, విస్మయం, రోత కలుగుతుంది. ఇలాంటి బలహన తలు పురుషుల్లోనే కాదు స్త్రీలలోనూ కన్పిస్తాయి. ఈ రోజుల్లో ఇలాంటి బలహనతల్లో కూరుకుపోయే వారి శాతం పెరగడం విచారకరం. మొదట్లో వీటిని అధికమి స్తామని వీరు భావించినా చివరకు వాటిలోనే కూరుకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకోవడంతోపాటు కుటుంబాలకు తీరని దు:ఖం మిగుల్చుతారు. దేవుని విరోధులు, అపవిత్ర జీవితం కలవారు, నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు అంత తేలికగా తమ చెడు మా ర్గాల నుంచి వైదొలగలేరు. ఎందుకీ వైపరీత్యం? ఇలాం టి బలహనతలు పోగొట్టుకోడానికి మార్గ మేది? కేవలం దేవుని ఆశ్రయించడం ద్వారానే వీటినుంచి మనుష్యులు బయటపడగలరు, బలహనతలను వదిలి పెట్టగలరు.
ఏసుక్రీస్తును ఓ ధనవంతుడైన యువకుడు నిత్యజీ వం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అందుకు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలించవ ద్దు, అబద్ధ సాక్ష్యం పలుక వద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లి దండ్రులను సన్మానింపుము అని ఏసుప్రభువు చెప్పాడు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే వున్నానుగా అని యువకుడు సమాధానం చెపుతాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది నీ ఆస్థి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబ డించమని చెపుతాడు. అందుకా యువకుడు ముఖము చిన్నబుచ్చుకొని అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఎన్నో మంచికార్యాలు చేసే అతనికి డబ్బే ప్రధానం. నిత్యజీవం అనేది అతనికి ఒక ఆశ మాత్రమే. రెండింటి మధ్య ఏది కావాలో కోరుకోమంటే మిగుల ఆస్థిపరుడు కాబట్టి డబ్బే కోరుకునే బల#హనత అతనిది. కానీ ఏసుప్రభువు తన శిష్యులుగా చేసుకునేందుకు పేతురు, అంద్రెయ, యాకోబు, యోహానులను కోరినప్పుడు వారు తమ జీవనోపాధి అయిన చేపలు పట్టే వలలను విడిచిపెట్టి, కుటుంబాలను సైతం వదిలేసి ప్రభువును వెంబడించా రు. ఫలితంగా పరలోక రాజ్యానికి వారసులయ్యారు. మనలో ఏ బలహనతలున్నా దేవుని సమీపించలేము. అయితే మనం నిజాయితీగా మన బలహనతలు ఒప్పు కొని ఆ దేవుని ప్రార్థిస్తే ప్రతి బలహనతను తీసివే స్తాడు.
నా బలహనత నుంచి ఈ జీవితంలో బయటకు రాలేనన్న వ్యధతో జీవించేవారూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. మనలో ఎట్టి బలహనత వున్నా దేవుడు తొలగిస్తాడు. ఏసుక్రీస్తు ఒకసారి సమరయ పట్టణం గుం డా వెళుతుండగా మధ్యాహ్నం భోజనం తెచ్చేందుకు శిష్యులు సుఖారను ఊరిలోకి వెళతారు. ఆ సమయం లో వేశ్య అయిన ఒక సమరయ స్త్రీ నీళ్ళకోసం ఏసు కూ ర్చున్న బావి దగ్గరకు వస్తుంది. ఏసు ప్రభువు దాహమి వ్వమని ఆమెను అడుగుతాడు. మాటల్లో నేనే జీవ జల మని చెబుతూ నేనిచ్చు నీళ్లు త్రాగే వారెన్నటికి దాహము గొనరని చెబుతాడు. అలాంటి నీరు నాకు కావాలని ఆ స్త్రీ అడిగినప్పుడు నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకు రమ్మం టాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని దేవుని కుమారుని తోనే అబద్ధమాడుతుంది. అందుకు యేసు నీవు నిజమే చెప్పావు, నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఇప్పుడు ఉన్న వాడు కూడా నీ పెనిమిటికాడు అని ఆమె బల#న తలను బహర్గతం చేస్తాడు.
అప్పుడు అతడు మెస్సయ్య అనగా రక్షకుడని గ్ర #హస్తుంది. జీవజలమైన ఏసుక్రీస్తును తన రక్షకునిగా అంగీకరించడం ద్వారా తన పాప జీవితాన్ని మార్చుకు ని నూతన జీవితంలోకి అడుగుపెడుతుంది. తన బల#హ నతలు వదలి వేయడంతో సమాజంలోనూ ఆమెకు గౌర వం పెరుగుతుంది. దేవుని కుమార్తెగా మారిపోతుంది. మానవుల బల#హనతయందు దేవుని శక్తి పరిపూర్ణమ వుతుంది. అందుకు మన #హృదయం నూతనపరచబ డాలి. మనలను బలవంతులుగా చేయుటే దేవుని చిత్తం.

Advertisement

తాజా వార్తలు

Advertisement