Wednesday, March 27, 2024

దైవం- మానవ ప్రయత్నం ఏది గొప్పది

సాధారణంగా మనం ఏదైనా కార్యం సిద్ధించినపుడు ఇదంతా తన ప్రయత్నం వల్లనే సాధ్యమైంది అని ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే, నెపం దైవం మీదకు నెట్టేస్తూంటాము. దైవం సహకరించలేదు అని భావిస్తుంటారు. కాని విశ్లేషణ చేసుకోరు. మానవ ప్రయత్నంకు దైవం తోడ్పాటు ఉంటేనే మనం కార్యాలను పొందగలు గుతాము. ఎలాగంటే ఒకసారి వశిష్ఠ మహర్షి బ్రహ్మ వద్దకు వెళ్ళి ”ఓ! సృష్టికర్తా! దైవం- మానవ ప్రయత్నం ఇందులో ఏది ముఖ్యం? ఏది గొప్పది? కొందరు అంతా దైవానిదే, మనం నిమిత్తమాత్రులం అంటుం టే, మరికొందరు దేవుడు అన్నం పెడుతున్నాడా? మనం వండుకుం టేనే కదా లభించేది. బ్రతుకుతెరువుకు కష్టపడితేనే కాని డబ్బు రాదు కదా. మానవుడు చేస్తేనే పనులు సమకూరుతున్నాయి అంటుంటారు. దీనిలో ఏది గొప్పది? వివరించమని కోరాడు.
అపుడు బ్ర#హ్మ బదులిస్తూ ”మానవ ప్రయత్నం భూమి అయితే, దైవం విత్తు. ఈ రెండు కలవగలిగేటట్లు ప్రయత్నంచే మానవులు చక్కని ఫలితాలు పొందుతారు. అంటే ప్రయత్నం అనేది మానవులు చేతుల్లో ఉంది. ఫలితమిచ్చే అదృష్టం కనిపించని దైవానిది. ఈ రెండు కలిస్తేనే మానవ జీవితం సఫలమవుతుంది. ఇదే జీవిత సాఫల్యానికి మూలం. మార్గం కూడా. మనిషి ఏ పని చేయకుండా కూర్చొంటే దైవం మాత్రం ఏం చేస్తుంది. మనుషులు పనులు చేస్తేనే (కర్మలు) ఆయా ఫలాలను ఇస్తుంది తప్ప. దైవం సహకరించకపోతే, మానవ ప్రయత్నం ఫలవం తం కాలేదు. విత్తు తోడ్పాటు లేకుండాపోతే నేల బీడు పడిపోయినట్లు అవుతుంది తప్ప ఫలితాన్ని ఇస్తుందా? మేలు చేస్తే రెండు లోకాల్లో మేలే. చెడు చేస్తే చెడే. కనుక మనిషి ప్రయత్నానికి అనుకూలించే ఫలమే దైవం ఇస్తుంది. మ#హర్షీ! మానవుడు మంచి కర్మలు, సత్సంకల్పంతో చేసే వాటికి దైవానుకూలత పెరుగుతుంది. దీపంలోని నెయ్యి/ నూనె తగ్గి పోతే, దీపపు కాంతి తగ్గిపోతుంది కదా. అదేవిధంగా మనిషి చేసే కర్మ లలో పవిత్రత లోపిస్తే దైవానుకూలత లోపిస్తుంది. కాబట్టి కర్మ దైవం తక్కువ విషయాలు కావు. ఆలోచిస్తే ఒక పని ఫలవంతం కావడానికి మానవ ప్రయత్నం దైవానుగ్రహం రెండూ కావాలి. కనుక ఆ రెండిం టిలో ఏది ఎక్కువ? ఏది తక్కువ? అనే విషయం అక్కర్లేదు. రెండూ సమానమే. అని వివరించగా నే, వశిష్ఠ మహర్షి ”మంచి పనులు (కర్మ లు)కు ఫలం ఎలా ఉంటుందో వినాలని కుతూహలంగా ఉంది. వివరిం చమని కోరగా, బ్రహ్మ ”మహర్షీ! కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అలసిపోయిన బాటసారికి అన్నం పెట్టడం వంటి ధర్మకార్యాలకు మిం చినవి లేవు. అగ్ని ఆరాధన వల్ల, ముక్తి లభిస్తుంది. మంచి ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పండితులకు, పుణ్యాత్ములకు దానం చేయడం వల్ల వస్తువు లు సిద్ధించడమేకాక పుణ్యం వస్తుంది.
మౌనవ్రతానికి ఫలితం జ్ఞానశక్తి, గొప్ప తపస్సుకు భోగభాగ్యాలు, శక్తి, జ్ఞానం ఫలితాలు. అహింసకు రూప, బలం, జ్ఞాన ఐశ్వర్యాలు ఫలి తాలు. బ్రహ్మచర్య వ్రతానికి దీర్ఘాయువు ఫలం. ఉపవాసానికి ఫలం చిత్త శుద్ధి. ఇలాచేసే ప్రతీ పవిత్ర కార్యాలకు ఫలితం లభిస్తుంది. మనిషి చేసే మంచి పనులకు దుష్కార్యాలకు ఆయా సమయాల్లో చేసే కర్మల ఆధా రంగానే ఫలం కలుగుతుంది. ఎలాగంటే కాలానుగుణంగా చెట్లకు ఆకు లు, పువ్వులు, కాయలు, పండ్లు, కలిగినట్లుగా మంచి-చెడు ఫలితాలు కలుగుతాయి. ముసలితనం రాకతో జుట్టు, దంతాలు, చెవులు, కళ్ళు ఇలా శరీరంలోని ప్రతీ అవయవం ముసలిధైపోతుంది. కాని కోరికకు మాత్రం ముసలితనం రాదు. ప్రాణాలు ఉన్నంత
వరకు ఉండే రోగమది. అది ఒక రోగమని, అజ్ఞానులు, అల్పబుద్ధి గలవారు ఆలోచించరు. సుఖాలకు అలవాటు పడిన వారిలో ఉన్న కోరిక అనే రోగాన్ని పోగొట్టుకొందామన్న ఆలోచనను మనస్సులోకి కూడా రానివ్వరు. లోకాలను రక్తులైనవారికి పాపం పుణ్యం కర్మలు దు:ఖాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి.మమకారంలేని వారికి, విరక్తులకు ఆ ఫలాలు కలుగవు. వారికి సుఖ- దు:ఖాను భావం ఉండదు. అందు చేత మోహాన్ని వీడి, మనిషి తామరాకు మీద నీటిబొట్టులా జీవించ గలగాలి.” అని వివరించారు. కాబట్టి మానవ ప్రయత్నం సఫలమవ డానికి దైవబలం తోడుండాలి. ఇందుకు మనం సత్సంకల్పంతో, సత్క ర్మలు చేస్తూ ఉండాలి. ఇదంతా మనకు అనుభవమే. ఆయినా, మమకా రాన్ని వదలడం లేదు. ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరునితో ”మానవు డి కర్మలయందు ప్రవర్తింప చేస్తున్నది దైవమా? అతని సంకల్పమా?” అని అడిగింది. పరమాత్మ బదులిస్తూ ”దేవీ! దైవం తనకుతానుగా ఏ పనిచేయడు. కాని నరుడు చేసే పనులకు తోడ్పడి ఫలితాన్ని ఇస్తాడు.
ముందటి జన్మలో మానవుడు చేసిన కర్మయే దైవం అని, ప్రస్తుతం చేసే కర్మలు మానవ ప్రయత్నం అని చెప్పబడుతోంది. నేలను త్రవ్వితేనే నీరు పడుతుంది. ఆరణి కర్రను మధిస్తేనే అగ్నిపుడుతుంది. అదేవిధం గా మానవ ప్రయత్నం ఉంటేనే దైవం సహాయపడుతుంది. అసలు యత్నపరుడు కాని వాడికి దైవం ఏవిధంగా సహాయపడుతుంది?
కర్మఫలాలు లభించడానికి మానవ ప్రయత్నం, దైవానుకూలత రెండూ ముఖ్యమే.” అని వివరించారు. ఇంత జ్ఞానాన్ని, మనం తెలుసు కొన్నా, కోరిక, వ్యామోహం వంటి వాటిని వదలలేకపోతున్నాం. తద్వా రా, ఒక్కోసారి దుష్కర్మలు చేయవలసి వస్తుంటుంది. దానికి తగ్గ ఫలి తాన్ని అనుభవిస్తూ, దైవాన్ని నిందిస్తుంటాము. కాబట్టి మంచితనంతో ఉంటూ జీవన గమనాన్ని సాఫల్యతతో ఆనందిద్దాం.

  • అనంతాత్మకుల రంగారావు, 7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement