Saturday, April 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 7
7.
ఏతాం విభూతిం యోగం చ
మమ యో వేత్తి తత్త్వత: |
సో వికంపేన యోగేన
యుజ్యతే నాత్ర సంశయ: ||

తాత్పర్యము : నా ఈ దివ్యవిభూతిని, యోగశక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుతసేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు.

భాష్యము : ‘భగవంతుడు గొప్పవాడు’ అనే వాక్కు అందరికి సుపరిచతమే. అయితే నిజముగా అతడు ఎంత గొప్పవాడో తెలిస్తే అతన్ని శరణు పొంది, భక్తి ప్రవృత్తులతో సేవించెదము. అతడు మన తాత ముత్తాత లకు సైతమూ పూర్వీకుడు. ఇంతకు ముందు శ్లోకములో తెలియజేయబడిన ఇరువది ఐదు ముఖ్యులకు మరియు బ్రహ్మ, శివులకు కూడా అతడే మూలము. కాబట్టి శ్రీకృష్ణుని తెలిసుకొనుటలో నిర్లక్ష్యము వహింపక, ఇంతకు ముందు తెలుపబడిన అతని వైభవాలను గుర్తించినట్లయితే , ఎంతో విశ్వాసముతో స్థిరముగా అతడిని సేవించగులుగుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement