Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకాలు 4,5
4.
బుద్ధిర్‌ జ్ఞానమసమ్మోహ:
క్షమా సత్యం దమ: శమ: |
సుఖ: దు:ఖం భవోభావో
భయం చాభయమేవ చ ||

5.
అహింసా సమతా తుష్టి:
తపోదానం యశోయశ: |
భవంతి భావా భూతానాం
మతత్‌ ఏవ పృథ గ్విధా: ||

4,5
తాత్పర్యము : బుద్ధి, జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమా గుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనో నిగ్రహము, సుఖ దు:ఖములు, జన్మము, మృత్యువు, భయము, భయ రాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములు నా చేతనే సృష్టించబడినవి.

భాష్యము : మనము ప్రజలలో చూసే మంచి చెడు లక్షణాలు రెండూ భగవంతుడి నుండే ఉద్భవించినవి. ఏ లక్షణమూ తనంతట తాను ఉద్భవించదు. సమస్తము శ్రీ కృష్ణుడి నుండే వచ్చుచున్నవి అని తెలుసుకొనుటయే జ్ఞానము. ఆ ల క్షణాలు ఈ విధముగా వివరించుబడుచున్నవి. బుద్ధి అనగా సరైన ధృక్పథముతో ఏ అంశాన్నైనా విశ్లేషణాత్మకముగా పరిశీలించుట. జ్ఞానము అనగా ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికము అనే స్పష్టమైన విచక్షణా జ్ఞానమును కలిగి యండుట. నేటి ఆధునిక విద్య కేవలము మూలకములు, రసాయనములు, శరీర అవసరాలకు మాత్రమే పరిమితమై, ఆత్మ గురించి ఆధ్యయనము చేయ నుందున అసంపూర్ణముగానే మిగిలిపోతుంది. అసమ్మో: అనగా సందేహాలు, మోహాలు లేకుండుట. పరమ సత్యాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి సమ్మోహము చెందడు. క్షమా అనగా వేరే వారి చిన్న చిన్న తప్పులను ఓర్చుకొని, క్షమించుట. సత్యము అనగా వేరే వారి శ్రేయస్సు కోరి ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయుట. శమ: అనగా మనస్సును అనవసరపు ఆలోచనలకు వెళ్ళకుండా నిగ్రహించుట. సాధువు, గురువు శాస్త్రములో చెప్పిన విధముగా మంచి సాంగత్యములో జీవిత లక్ష్యాన్ని ఆలోచిస్తూ ఉండుట వలన మనస్సును నిగ్రహించవచ్చును.. సుఖము దు:ఖము అనగా కృష్ణ చైతన్యానికి ఏది సానుకూలమో దానిని స్వీకరించి, ప్రతికూలమైన దానిని వర్ణించుట. భవ:, అభవ:, అనగా ఈ శరీరమునకు జన్మ, మృత్యువు ఉంటుంది. కాని ఆత్మకు అటువంటి మార్పులు ఉండవు. భయము, అభయము అనగా భవిష్యత్తు తెలియక కలత చెందుట, భక్తులకు వైకుం ఠానికి వెళ్తామని విశ్వాసము ఉంటుంది కాబట్టి అభయాన్ని కలిగి ఉంటారు. కాని అట్టి భక్తిలేని వారు మాత్రమే భయపడుచూ ఉంటారు. అహింస అనగా మానవ జీవితము ఆత్మ సాక్షాత్కారము కొరకు ఉద్దేశించబడినది. అటువంటి ప్రయోజనమును నెరవేర్చుటకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. దానినే నిజమైన అహింస అందురు. సమత అనగా రాగద్వేషాల నుండి విముక్తి పొంది సమ భావనను కలి గి ఉం డుట. కృష్ణ చైతన్యాన్ని సాధించుటకు తప్ప భక్తునికి స్వీకరించవలసినది లేదా వదిలిపెట్టవలసినది అంటూ ఏదీ ఉండదు. తుష్టి అనగా భగవంతుని కృపతో ఏదైతే లభిస్తుందో దానితో సంతృప్తి చెందుట, అంతేకాని ప్రయాసతో ఎక్కువగా కూడబెట్టుటకు ప్రాకులాడ కూడదు. తప: అనగా వేద శాస్త్రాలను అనుసరించి సత్త్వ గుణములో జీవించుట. రజో తమో గుణములలో ఆధ్మాత్మిక చింతన సాధ్యపడదు. దానము అనగా తన అదయములో యాభది శాతము, మంచి కార్యము కొరకై కృష్ణ చైతన్యములో ఉన్న వ్యక్తికి దానము చేయవలెను. యశ: అనగా భక్తుడుగా పేరు గాంచుటయే నిజమైన యశస్సు అని శ్రీచైతన్య మహాప్రభు చెప్పేవారు. ఈ లక్షణాలన్ని మానవదేవతా సంఘాలలో చూడవచ్చును. వీటన్నింటిని సృష్టించినవాడు శ్రీకృష్ణుడే. కాబట్టి కృష్ణున్ని పూజించిన భక్తుడు అన్ని మంచి లక్షణాలను పొందగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement