Thursday, April 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 3

యో మామజమనాదిం చ
వేత్తి లోకమహేశ్వరమ్‌ |
అసమ్మూఢ: స మర్త్యేషు
సర్వపాపై: ప్రముచ్యతే ||

తాత్పర్యము : నన్ను పుట్టుకలేని వానిగను, అనాదిగను, సర్వలోకములకు దివ్య ప్రభువుగను తెలిసికొనన వాడు మాత్రమే మనుజులందిలోను భ్రాంతి రహితుడై, సర్వపాపముల నుండి ముక్తుడగును.

భాష్యము : వేలకొలది మునుష్యులలో ఎవరో ఒకరు సత్యాన్ని అన్వేషించుటలో నిమగ్నులగుదురు. అటువంటి మనుష్యులలో శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని, అజుడని, సర్వలోక మహేశ్వరుడనే నిర్థారణకు వచ్చిన వాడు శ్రేష్టుడు. అటువంటి వ్యక్తి సర్వపాపముల నుండి విముక్తిని పొందగలుగుతాడు. భగవంతుడు తన అంతరంగ శక్తి ద్వారా తన ఇచ్ఛాపూర్వకముగా తన దివ్యమంగళ శరీరముతోనే ఈ భూమి పైన అవతరిం చుచుండును. దేవకీ వసుదేవులకు కూడా అటువంటి రూపముతోనే జన్మించి తిరిగి సపిపిల్లవాని వలె మార్పు చెందెను. కాబట్టి అతడు ‘అజుడు’ సామాన్య జీవుల వలే జన్మించడు. సృష్టి కంటే ముందే ఉండుట వలన సృష్టించబడిన లోకాలకు, వాటి దేవతలకు ఆయనే మూలము. శ్రీకృష్ణుని భగవద్గీత, భాగవతముల ఆదేశాలను గురువు ద్వారా గ్రహించి తు.చ. తప్పక పాటించే అరుదైన వ్యక్తి మాత్రమే శ్రీకృష్ణున్ని ఈవిధముగా అర్థము చేసుకుని సర్వపాపముల నుండి ముక్తిని పొందగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement