Sunday, December 4, 2022

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 8, శ్లోకం 6

6.
యం యం వాపి స్మరన్‌ భావం
త్యజత్యంతే కలేవరమ్‌ |
తం తమేవైతి కౌంతేయ
సదా తద్భావభావిత: ||

- Advertisement -
   

తాత్పర్యము: ఓ కౌంతేయా! దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును.

భాష్యము : మన మంచి భవిష్యత్తుకు మృత్యు సమయము ఎంత కీలకమైనదో ఈ శ్లోకములో తెలియజేయటమైనది. మనము ఆ సమయములో కృష్ణున్ని గనక స్మరిస్తే కృష్ణున్ని గనక స్మరిస్తే దివ్యచైతన్యము వస్తుంది లేకపోతే మరొక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. గొప్ప భరత మహా రాజు సైతము, జింకను స్మరించుట చేత తరువాతి జన్మలో జింకగా జన్మించాల్సి వచ్చింది. మన జీవిత కాలంలో వేటిని స్మరిస్తూ ఉం టామో వాటి ప్రభావం మృత్యు సమయంలో ఉంటుంది కాబట్టి మనము సాత్విక జీవనాన్ని గడుపుచూ కృష్ణున్ని స్మరించటాన్ని ‘హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే ‘ అనే మంత్ర జపము ద్వారా అభ్యాసము చేసినట్లయితే కృష్ణుణ్ణి దివ్యత్వాన్ని పొందే అవకాశము తప్పక ఉంటుంది. మన బంగారు భవిష్యత్తుకు దీనిని మించిన పద్ధతి లేదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement